తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable2 With Nbk Teaser: దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 టీజర్‌ అదిరింది

Unstoppable2 with NBK Teaser: దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 టీజర్‌ అదిరింది

HT Telugu Desk HT Telugu

05 October 2022, 7:07 IST

    • Unstoppable2 with NBK Teaser: దెబ్బకు థింకింగ్‌ మారిపోవాలా అంటూ అన్‌స్టాపబుల్‌2 విత్‌ ఎన్‌బీకే టీజర్‌ అదిరిపోయింది. ఈ టీజర్‌ను మంగళవారం (అక్టోబర్‌ 4) రాత్రి మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
అన్‌స్టాపబుల్‌ 2 టీజర్ లో బాలకృష్ణ
అన్‌స్టాపబుల్‌ 2 టీజర్ లో బాలకృష్ణ

అన్‌స్టాపబుల్‌ 2 టీజర్ లో బాలకృష్ణ

Unstoppable2 with NBK Teaser: టాలీవుడ్‌ నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో, అతని మాస్‌ ఫ్యాన్స్‌ ఎంత హడావిడి చేస్తారో మనకు తెలుసు. అయితే అతని సినిమా కాదు కదా.. ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ సెలబ్రిటీ టాక్ షోకు కూడా అదే రేంజ్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది.

ట్రెండింగ్ వార్తలు

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 3 సినిమాలు.. అన్ని ఒకేదాంట్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్.. మీరు చూశారా?

Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 1 పెద్ద సక్సెస్‌ కావడంతో ఇప్పుడు అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్‌ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో బాలయ్య ఓ డిఫెరెంట్‌, ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో తలపై హ్యాట్‌, బ్రౌన్‌ కోట్‌, దానికి తగిన ప్యాంట్‌ వేసుకొని, చేతిలో కొరఢా పట్టుకున్న బాలకృష్ణ ఫ్యాన్స్‌ను శివాలెత్తించేలా ఉన్నాడు.

ఈ సెలబ్రిటీ టాక్‌ షో టీజర్‌ ఈ రేంజ్‌లో ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ అంటూ బాలయ్య బాబును ఈ టీజర్‌లో ఇంట్రడ్యూస్‌ చేశారు. ఇక చివర్లో దెబ్బకు థింకింగ్‌ మారిపోవాలా అంటూ ఇచ్చి పంచ్‌లైన్‌ అదుర్స్‌ అనిపించేలా ఉంది. ఈ టీజర్‌ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్‌ చేశాడు. ఇందులో బాలకృష్ణ లుక్‌ వైరల్‌గా మారింది.

గుహలో దివిటీ పట్టుకొని ఏదో వెతుకుతున్నట్లుగా అతడు కనిపిస్తాడు. విజయవాడలో అన్‌స్టాపబుల్‌ 2 గ్రాండ్‌ లాంచ్‌ జరగనుంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్‌ 2 ఆంథెమ్‌ను కూడా మేకర్స్‌ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా యూట్యూబ్‌లో వైరల్‌ అయింది. ఈ అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 1 సూపర్‌ సక్సెస్‌ కావడంతో రెండో సీజన్‌ను మరింత గ్రాండ్‌గా తీసుకురావాలని ఆహా ఓటీటీ ప్లాన్‌ చేస్తోంది.

అందులో భాగంగానే ఆంథెమ్, టీజర్‌లతోనే సీజన్‌ 2పై అంచనాలు పెంచేసింది. ఈసారి షోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, తన అల్లుడు నారా లోకేశ్‌లతో మాట్లాడనున్నాడన్న వార్త ఇప్పటికే సంచలనం రేపిన విషయం తెలిసిందే. వీళ్లే కాదు.. ఎంతోమంది టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖులను ఈ అన్‌స్టాపబుల్‌ 2లో బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.