Anasuya Darja OTT Release Date: ఆహా ఓటీటీలో అనసూయ దర్జా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Anasuya Darja OTT Release Date: అనసూయ ప్రధాన పాత్రలో నటించిన దర్జా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఏ ఓటీటీలో విడుదల కానుందంటే...
Anasuya Darja OTT Release Date: అనసూయ ప్రధాన పాత్రలో నటించిన దర్జా సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. మాస్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దర్జా సినిమాలో అనసూయతో పాటు సునీల్ కీలక పాత్రలో నటించాడు. పుష్ప తర్వాత సునీల్, అనసూయ కలయికలో వచ్చిన ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దానికి తోడు ప్రచార చిత్రాల్లో అనసూయ మాస్ గెటప్‌లో కనిపించడంతో దర్జా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.
ట్రెండింగ్ వార్తలు
ఇందులో కనకం అనే సారా వ్యాపారిగా అనసూయ కనిపించింది. తనకు అడ్డొచ్చిన పోలీసులను హతమార్చే కిల్లర్‌గా డిఫరెంట్ రోల్ లో నటించింది. ఓ మూగ ప్రేమికుడి హత్య కేసులో కనకానికి, శివశంకర్ అనే పోలీస్ ఆఫీసర్‌కు మధ్య మొదలైన వార్‌తో దర్శకుడు సలీమ్ మాలిక్ దర్జా తెరకెక్కించారు. కథలో కొత్తదనం లేకపోవడంతో నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను తొలివారం ముగియక ముందే థియేటర్ల నుంచి తీసేశారు.
అనసూయ క్యారెక్టర్ లెంగ్త్ కూగా తక్కువగానే ఉండటంతో ఆమె ఆభిమానులు నిరాశ చెందారు. తాజాగా దర్జా సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్ రిలీజ్ కు ముందే దర్జా సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లు తెలిసింది. దర్జా సినిమాలో ఆమని, పృథ్వీ, షకలక శంకర్ కీలక పాత్రలను పోషించారు. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు రంగమార్తండ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది అనసూయ.