Unstoppable Season 2: బాలయ్య అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2 ఎప్పటి నుంచో తెలుసా?-unstoppable season 2 with balakrishna soon to be aired on aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Unstoppable Season 2 With Balakrishna Soon To Be Aired On Aha Ott

Unstoppable Season 2: బాలయ్య అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2 ఎప్పటి నుంచో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 07:24 PM IST

Unstoppalbe Season 2: బాలయ్య బాబు బుల్లితెరపై కనిపించి షో అన్‌స్టాపబుల్‌. ఈ షో ఫస్ట్‌ సీజన్‌కు పాజిటివ్‌ టాక్ వచ్చింది. దీంతో ఆహా ఓటీటీ ఇప్పుడు రెండో సీజన్‌ తీసుకురాబోతోంది.

అన్‌స్టాపబుల్‌ షోలో బాలకృష్ణ
అన్‌స్టాపబుల్‌ షోలో బాలకృష్ణ (Twitter)

అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే షో ఓటీటీల్లో రికార్డులు బద్ధలు కొట్టింది. ఈ టాక్‌ షోకు పెద్ద ఎత్తున వ్యూయర్‌షిప్‌ వచ్చింది. ఫిల్మ్‌ సెలబ్రిటీలతో బాలకృష్ణ సరదాగా చేసిన ఇంటర్వ్యూలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. ఈ షో సీజన్‌ 1 గతేడాది నవంబర్‌ 4 నుంచి ఆహా ఓటీటీలో టెలికాస్ట్‌ అయింది. తొలి సీజన్‌లో భాగంగా 10 ఎపిసోడ్లు వచ్చాయి. తన సినిమాలతో మాస్‌ ప్రేక్షకులను సంపాదించుకున్న బాలయ్య.. ఈ టాక్‌ షోతో మరింత మంది ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు.

కేవలం సినిమాలు, ప్రీరిలీజ్, సక్సెస్‌ ఈవెంట్లలో మాత్రమే కనిపించిన బాలయ్య బాబు.. ఇలా వెబ్‌ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో అతనిలోని మరో కోణం కూడా కనిపించింది. అన్‌స్టాపబుల్‌తో అతని ఫ్యాన్‌ బేస్‌ మరింత పెరిగింది. దీంతో రెండో సీజన్‌ తీసుకురావడానికి ఆహా ఓటీటీ ఏర్పాట్లు చేస్తోంది. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే రెండో సీజన్‌ ఆగస్ట్‌ నుంచి ప్రసారం కానుంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్‌ 15న రెండో సీజన్‌ తొలి ఎపిసోడ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బాలయ్య బాబు, అన్‌స్టాపబుల్‌ షో ఫ్యాన్స్‌కు నిజంగా గుడ్‌న్యూసే. ప్రస్తుతం బాలకృష్ణ తన తర్వాతి మూవీ ఎన్‌బీకే 107లో నటిస్తున్నాడు. వచ్చే వారం షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2 ఎపిసోడ్ల షూటింగ్‌ జరగనుంది.

అటు ఆహా ఓటీటీ ఈ సీజన్‌ కోసం గెస్ట్‌లను ఎంపిక చేసే పనిలో ఉంది. గత సీజన్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో చివరి ఎపిసోడ్‌ నిర్వహించారు. ఆ ఎపిసోడ్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. దీంతో ఈ సీజన్‌ను మెగాస్టార్‌ చిరంజీవితో ప్రారంభించాలన్న ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారు. అదే జరిగితే ఇటు నందమూరి, అటు మెగా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.

IPL_Entry_Point