తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sukumar Remuneration For Pushpa 2: రెమ్యునరేషన్‌ లేకుండానే పుష్ప 2 చేస్తున్న సుకుమార్‌!

Sukumar Remuneration for Pushpa 2: రెమ్యునరేషన్‌ లేకుండానే పుష్ప 2 చేస్తున్న సుకుమార్‌!

HT Telugu Desk HT Telugu

05 October 2022, 12:07 IST

    • Sukumar Remuneration for Pushpa 2: రెమ్యునరేషన్‌ లేకుండానే సుకుమార్‌ పుష్ప 2 చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి ఈ సినిమాకు అతడు తన రెమ్యునరేషన్‌ భారీగా పెంచినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
పుష్ప 2 పూజా కార్యక్రమాల సందర్భంగా సుకుమార్
పుష్ప 2 పూజా కార్యక్రమాల సందర్భంగా సుకుమార్

పుష్ప 2 పూజా కార్యక్రమాల సందర్భంగా సుకుమార్

Sukumar Remuneration for Pushpa 2: ఒకే ఒక్క సినిమాతో పాన్‌ ఇండియాలో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు సుకుమార్‌. ఎంతో టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అయినా అతడు తీసిన సినిమాలు టాలీవుడ్‌కే పరిమితమయ్యాయి. అయితే పుష్ప మూవీతో సంచలనం రేపాడు. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనంతో హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ల రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

GMV OTT Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

The Goat Life OTT Release Date: ఈవారం ఓటీటీలోకి మరో మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

OTT Releases This Week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

The Broken News Season 2 Review: క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే న్యూస్‌రూమ్ డ్రామా.. చూడాల్సిన వెబ్ సిరీసే..

రాజమౌళి, ప్రశాంత్ నీల్‌ తర్వాత సుకుమారే అనేంతలా పుష్ప మూవీతో పేరు సంపాదించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కూడా వందల కోట్లు వసూలు చేసింది. ఇదొక్క సినిమాతోనే రూ.15 కోట్ల రేంజ్‌ డైరెక్టర్‌ కాస్తా.. రూ.60 కోట్ల వరకూ వెళ్లిపోయాడని, పుష్ప 2 మూవీ కోసం అతడు ఇంత భారీ మొత్తం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అటు అల్లు అర్జున్ అయితే ఈ సీక్వెల్‌ కోసం రూ.125 కోట్లు తీసుకుంటాడనీ తేలింది.

కానీ తాజా రిపోర్ట్‌ ప్రకారం.. పుష్ప 2 సినిమా కోసం సుకుమార్‌ అసలు రెమ్యునరేషనే తీసుకోవడం లేదట. దీనికి బదులు తన కొత్త సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ సినిమాకు కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో సినిమాకు రెమ్యునరేషన్‌ తీసుకోకుండా లాభాల్లో వాటాకు సుకుమార్‌ మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే ఇదేమీ తక్కువ మొత్తం కాదు.

అలా చూసినా కనీసం రూ.70 కోట్ల వరకూ ఉండనుంది. పుష్ప సూపర్‌డూపర్‌ హిట్‌తో పుష్ప 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బాహుబలి 2, కేజీఎఫ్‌ 2 కోసం ఎంతలా ఎదురుచూశారో పుష్ప 2కు కూడా అదే రేంజ్‌ ఫాలోయింగ్‌ ఉంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులకు భారీ మొత్తం రావడం ఖాయం.

ఇదే కాకుండా డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోనున్నాయి. ఆ లెక్కన పుష్పతో పోలిస్తే పుష్ప 2కి వచ్చే లాభాలు ఊహకందని విధంగా ఉండనున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. మరింత ఆలస్యమవుతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిగి సుమారు రెండు నెలలు అయింది. అయితే దసరా తర్వాత షూటింగ్‌ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.