Allu Arjun at Wagah Border: వాఘా సరిహద్దులో ఫ్యామిలీతో అల్లు అర్జున్‌-allu arjun at wagah border with bsf jawans on snehas birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun At Wagah Border With Bsf Jawans On Snehas Birthday

Allu Arjun at Wagah Border: వాఘా సరిహద్దులో ఫ్యామిలీతో అల్లు అర్జున్‌

HT Telugu Desk HT Telugu
Sep 30, 2022 09:16 AM IST

Allu Arjun at Wagah Border: వాఘా సరిహద్దులో ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్‌ దిగిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు.

వాఘా సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లతో అల్లు అర్జున్, స్నేహ, వాళ్ల పిల్లలు
వాఘా సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లతో అల్లు అర్జున్, స్నేహ, వాళ్ల పిల్లలు

Allu Arjun at Wagah Border: టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పంజాబ్‌లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా గురువారం (సెప్టెంబర్‌ 29) తన భార్య స్నేహ, ఇద్దరు పిల్లలతో కలిసి వాఘా సరిహద్దుకు వెళ్లాడు. గురువారం స్నేహ బర్త్‌డే కావడం విశేషం. అంతకుముందు అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌కు కూడా అతడు వెళ్లాడు.

అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాడు. పుట్టినరోజు నాడు స్నేహ సిక్కు గురువుల ఆశీర్వాదం తీసుకుంది. వీళ్లు కేక్‌ కట్‌ చేసిన వీడియో, ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. ఇక ఆ తర్వాత అమృత్‌సర్‌ నుంచి బన్నీ ఫ్యామిలీ నేరుగా వాఘా సరిహద్దుకు వెళ్లింది. అక్కడ బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాలో అర్జున్‌ షేర్‌ చేశాడు.

"బీఎస్‌ఎఫ్‌. గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. థ్యాంక్యూ" అని అతడు క్యాప్షన్‌ ఉంచాడు. ఇక తన ఇన్‌స్టా స్టోరీలోనే మరో వీడియోను కూడా ఈ స్టైలిష్‌ స్టార్‌ పోస్ట్‌ చేశాడు. జవాన్లతో కలిసి నడుస్తున్న సమయంలో స్టాండ్స్‌లో కూర్చున్న అతని అభిమానుల పెద్దగా అరవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ప్యాంట్, షర్ట్‌లో వాఘా సరిహద్దుకు వెళ్లాడు.

పుష్ప మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన బన్నీకి నార్త్‌లోనూ ఇప్పుడు ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. అతడు ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్‌ ఎగబడుతున్నారు. ఇప్పుడు పుష్ప 2 మూవీ కోసం వాళ్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప మూవీతో నేరుగా అతడు నార్త్‌లో అడుగుపెట్టినా.. అంతకుముందే అతని ఎన్నో సినిమాలు హిందీలో డబ్‌ అయి హిట్‌ సాధించాయి. ఇప్పుడు పుష్పతో అతని క్రేజ్‌ మరింత పెరిగింది.

ఒక రకంగా తెలుగులో కంటే హిందీ బెల్ట్‌లోనే ఈ పుష్ప మూవీ సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో అర్జున్‌ లుక్‌, మేనరిజం అక్కడి ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఈ మధ్య వినాయక చవితి వేడుకల సందర్భంగా కూడా నార్త్‌లో పుష్పలో అల్లు అర్జున్‌ స్టైల్లోనే గణపతులు కొలువుదీరిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point