తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

OTT Releases This Week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu

06 May 2024, 10:28 IST

    • OTT Releases this week: ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లో మొత్తంగా 21 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

OTT Movies On This Week: ఎవ్రీ వీక్ సరికొత్త మూవీ, వెబ్‌ సిరీస్‌లు మూవీ లవర్స్‌ను ఊరిస్తుంటాయి. మరోవైపు ఐపీఎల్ కూడా జోరుగా సాగుతోంది. ఓవైపు ఓటీటీలు, మరోవైపు ఐపీఎల్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ పంచుతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారంలో విడుదలయ్యే ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసుల గురించి పూర్తి సమాచారం వచ్చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఈ వారం అంటే మే 6 నుంచి మే 12వ తేది వరకు ఓటీటీలోకి వెబ్ సిరీస్‌లు సినిమాలు కలుపుకుని మొత్తం 21 స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో ఏ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రత్యేకంగా ఉండనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం)- మే 9 (ప్రచారంలో ఉన్న తేది)

మ్యాక్స్‌టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9

ది గోట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ చిత్రం)- మే 6

మదర్ ఆఫ్ ది బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ)- మే 9

బోడ్కిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9

థ్యాంక్యూ నెక్ట్స్ (టర్కిష్ వెబ్ సిరీస్)- మే 9

లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 10

ఆహా ఓటీటీ

గీతాంజలి మళ్లీ వచ్చింది (తెలుగు హారర్ కామెడీ సినిమా)- మే 8

రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10

జీ5 ఓటీటీ

8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం)- మే 10

పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ

ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 8

ఆడు జీవితం (మలయాళ డబ్బింగ్ సినిమా)- మే 10 (రూమర్ డేట్)

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

డార్క్ మేటర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 8

హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 8

చిత్రం చూడరా (తెలుగు సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 9

మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- మే 10

ఉందేకి సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మే 10

ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే- మే 10

ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 10

వంద కోట్ల కలెక్షన్స్

ఇలా ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు/వెబ్ సిరీసులు విడుదల కానున్నాయి. వాటిలో హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది, మలయాళంలో వంద కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టిన ఫహాద్ ఫాజిల్ ఆవేశం సినిమా, వరుణ్ సందేశ్ నటించిన చిత్రం చూడరా మూవీతోపాటు మలయాళ బ్లాక్ బస్టర్ ఆడు జీవితం వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు బాగా స్పెషల్ కానున్నాయి.

స్పెషల్‌ 7

వీటితోపాటు తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ రోమియో, మర్డర్ ఇన్ మహిమ్ హిందీ వెబ్ సిరీస్, మల్లేశం సినిమా డైరెక్టర్ తెరకెక్కించిన 8 ఏఎమ్ మెట్రో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇలా ఆరు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో 7 స్పెషల్‌గా ఉండనున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం