Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్
Baak Director Sundar C About Sangamithra Movie: కోలీవుడ్ పాపులర్ డైరెక్టర్ సుందర్ సి తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమన్నా, రాశీ ఖన్నా నటించిన హారర్ థ్రిల్లర్ బాక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Director Sundar C About Telugu Cinema: అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ 'అరణ్మనై' నుంచి సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించిన 'అరణ్మనై 4' మే 3న థియేట్రికల్ రిలీజ్ అయింది. దీన్ని తెలుగులో బాక్ అనే టైటిల్‌తో విడుదల చేశారు. తమిళ పాపులర్ డైరెక్టర్, యాక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్‌లు అవ్నీ సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు.
బాక్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. హారర్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ బాగున్నాయని కోలీవుడ్, టాలీవుడ్ ఆడియెన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే బాక్ విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు చిత్రాలపై సుందర్ సి చేసిన కామెంట్స్ విశేషంగా మారాయి.
నటుడిగా, దర్శకుడి కొనసాగడం ఛాలెంజ్‌గా అనిపించడం లేదా ?
నటుడిగా ఇది నా ఇరవై ఒకటో చిత్రం. దర్శకుడన్నప్పుడు బోలెడు బాధ్యతలు ఉంటాయి. నటుడికి కూడా చాలా బాధ్యతలు. నటుడిగా దర్శకుడిగా కొనసాగడం కష్టమైనపనే. అయితే నాకున్న ఇష్టం, నా టీం సపోర్ట్, ప్రేక్షకుల ఆదరణతో రెండింటిని సమపాలల్లో చేస్తున్నా. కానీ, మొదట పాషన్ మాత్రం దర్శకత్వమే.
హిప్ హాప్ తమిళ మ్యూజిక్ గురించి ?
తను సెన్సేషనల్ కంపోజర్. ఈ బాక్ సినిమా కోసం అద్భుతమైన పాటలు చేశారు. క్లైమాక్స్ సాంగ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
సురేష్ ప్రొడక్షన్, ఏసియన్ పిక్చర్స్ మీ సినిమాని రిలీజ్ చేయడంపై?
సురేష్ ప్రొడక్షన్, ఏసియన్ పిక్చర్స్ లాంటి ప్రముఖ సంస్థలు మా సినిమాని విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను. తెలుగులో చాలా గ్రాండ్‌గా విడుదల చేయడం ఆనందాన్ని ఇస్తోంది. మా గత చిత్రాలకు ప్రేక్షకులు అందించిన ఆదరణే ఈ సినిమాకి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులని గొప్పగా అలరిస్తుంది.
'అరణ్మనై 'నుంచి ఇంకా ఎన్ని సినిమాలు ఆశించవచ్చు ?
అది ఇప్పుడే చెప్పలేను. 'అరణ్మనై' విజయం రెండో భాగం తీయడానికి బలాన్ని ఇచ్చింది అలాగే 'అరణ్మనై 4' విజయం ఇందులో మరో సినిమా చేయడానికి ఎనర్జీ ఇస్తుందని భావిస్తున్నాను.
దర్శకుడిగా మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా?
సంఘమిత్ర అనే పెద్ద ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశాం. కానీ, కొన్ని కారణాల వలన అది ఆగింది. అది మళ్లీ మొదలుపెట్టె ప్లాన్స్ జరుగుతున్నాయి. అది దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది.
నేరుగా తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు?
తెలుగ పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటినుంచో నేరుగా తెలుగు సినిమా చేయాలని ఉంది. అది తొందరలోనే జరుగుతుందని భావిస్తున్నాను.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమపై, తెలుగులో సినిమాలు చేయడంపై, డ్రీమ్ ప్రాజెక్ట్ సంఘమిత్రపై డైరెక్టర్, హీరోయిన్ ఖుష్బూ భర్త సుందర్ సి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక బాక్ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నాతోపాటు వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
బాక్ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా ఇద్దరూ నటనతోపాటు గ్లామర్‌ను కూడా యాడ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పంచుకో అనే పాటలో తమ అందంతో మెస్మరైజ్ చేశారు ఈ ముద్దుగుమ్మలు. ఇదే పాటను తమిళంలో అచచోగా రిలీజైంది. ఈ పాటకు సంబంధించిన వీడియో, తమన్నా, రాశీ ఖన్నా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.