Recent OTT Releases: 3 తెలుగు సినిమాలు.. 2 బాలీవుడ్ చిత్రాలు.. 2 వెబ్ సిరీస్‍లు.. ఈ వారం ఓటీటీల్లో పండుగే-3 telugu movies 2 bollywood films 2 web series debuted for streaming this week netflix prime video disney hotstar otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Recent Ott Releases: 3 తెలుగు సినిమాలు.. 2 బాలీవుడ్ చిత్రాలు.. 2 వెబ్ సిరీస్‍లు.. ఈ వారం ఓటీటీల్లో పండుగే

Recent OTT Releases: 3 తెలుగు సినిమాలు.. 2 బాలీవుడ్ చిత్రాలు.. 2 వెబ్ సిరీస్‍లు.. ఈ వారం ఓటీటీల్లో పండుగే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 27, 2024 04:05 PM IST

Latest OTT Releases: ఈ వారం ఓటీటీల్లో కంటెంట్ పుష్కలంగా అడుగుపెట్టింది. ఏకంగా మూడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అలాగే బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‍లు కూడా అడుగుపెట్టాయి.

OTT Releases: 3 తెలుగు సినిమాలు.. 2 బాలీవుడ్ చిత్రాలు.. 2 వెబ్ సిరీస్‍లు.. ఈ వారం ఓటీటీల్లో పండుగే
OTT Releases: 3 తెలుగు సినిమాలు.. 2 బాలీవుడ్ చిత్రాలు.. 2 వెబ్ సిరీస్‍లు.. ఈ వారం ఓటీటీల్లో పండుగే

OTT Releases: ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం దాదాపు పండుగలానే ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్‍లు వెల్లువలా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేశాయి. ముందు ఏది చూడాలో తికమక పడేలా ఎక్కువగా కొత్త కంటెంట్ ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చింది . ఈ వారం (ఏప్రిల్ నాలుగో వారం) మూడు తెలుగు చిత్రాలు, 2 బాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వెబ్ సిరీస్‍లు కూడా ఎంట్రీ ఇచ్చాయి. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ముఖ్యమైన చిత్రాలు, సిరీస్‍లు ఇవే..

ఈ వారంలో ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు

భీమా: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా ఈ వారంలోనే ఏప్రిల్ 25వ తేదీన డిస్న+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ఏ.హర్ష దర్శకత్వం వహించారు. థియేటర్లలో అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. భీమా సినిమా ప్రస్తుతం హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

ది ఫ్యామిలీ స్టార్: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా.. థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.

టిల్లు స్క్వేర్: థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ అయిన టిల్లు స్క్వేర్ చిత్రం ఏప్రిల్ 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 29న థియేటర్లలో రిలీజై రూ.125కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీని ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.

బాలీవుడ్ చిత్రాలు

లాపతా లేడీస్: బాలీవుడ్ కామెడీ డ్రామా మూవీ లాపతా లేడీస్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఏప్రిల్ 26న స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మంచి కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలను ఈ మూవీ అందుకుంది. కిరణ్ రావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

యోధ: బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ యోధ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 26న స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ప్రస్తుతం రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లకు రెంట్ లేకుండా ఉచితంగా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రావొచ్చు. సిద్ధార్థ మల్హోత్రా, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మార్చి 15న థియేటర్లలో రిలీజ్ అయింది.

ఈ వారం వెబ్ సిరీస్‍లు

దిల్ దోస్తీ డైలమా: అనుష్క సేన్ ప్రధాన పాత్ర పోషించిన దిల్ దోస్తీ డైలామా వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 25వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. టీనేజ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

రణ్‍నీతి: పుల్వామా ఉగ్రదాడికి బదులుగా భారత్ చేసిన బాలకోట స్ట్రైక్స్ ఆధారంగా ఈ రణ్‍నీతి వెబ్ సిరీస్ రూపొందింది. జిమ్మి షెర్గిల్, అషుతోశ్ రాణా, లారా దత్తా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఏప్రిల్ 26వ తేదీన జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

IPL_Entry_Point