Dil Dosti Dilemma OTT: ఇంట్రెస్టింగ్‍గా దిల్ దోస్తీ డైలమా సిరీస్ ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్
Dil Dosti Dilemma OTT Release Date: దిల్ దోస్తీ డైలమా వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. అనుష్క సేన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది.
Dil Dosti Dilemma Web Series: బాలీవుడ్ యంగ్ నటి అనుష్క సేన్ ప్రధాన పాత్రలో ‘దిల్ దోస్తీ డైలమా’ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్‍కు డెబ్బీ రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. కెనడా వెళ్లాలని కోరుకున్న అస్మారా అనే అమ్మాయి.. నార్త్ ఇండియాలోని ఓ చిన్న పట్టణానికి వెళ్లి అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే విషయంపై ఈ సిరీస్ ఉంది. దిల్ దోస్తీ డైలమా సిరీస్ ట్రైలర్ నేడు (ఏప్రిల్ 16) వచ్చింది. దీంతో పాటు ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
ట్రైలర్ ఇలా..
టీనేజ్ అమ్మాయి అస్మారా (అనుష్క సేన్) తన తండ్రిని పాకెట్ మనీ ఇవ్వాలని అగడంతో దిల్ దోస్తీ డైలమా ట్రైలర్ మొదలవుతుంది. గత వారమే ఇచ్చానని చెప్పటంతో.. టీనేజర్లకు చాలా ఖర్చులు ఉంటాయని.. హెయిర్, స్కిన్, లంచ్, బ్రంచ్, డిన్నర్, ఆఫ్టర్ పార్టీ అంటూ లిస్ట్ చదివేస్తుంది అస్మారా. అయితే, సిటీలో ఫుల్ ఎంజాయ్ చేసే అస్మారా కెనడా వెళ్లాలని అనుకుంటుంది. అయితే, ఓ పెద్ద తప్పు చేయడంతో తన నానమ్మ ఉండే ఓ చిన్న పట్టణానికి అస్మారా వెళ్లాల్సి వస్తుంది.
ఆ ఊరికి వెళ్లినా తాను కెనడా వెళ్లానంటూ స్నేహితులకు అస్మారా అబద్ధం చెబుతుంది. ఇక, ఆ ఊరిలో సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకుంటుంది. సిటీలో వేసుకున్నట్టు డ్రెస్‍లు ధరిస్తుంది. పద్ధతిగా ఉండాలని పెద్దలు చెప్పినా.. తనకు నచ్చినట్టే ఉంటుంది అస్మారా. అయితే, ఆ తర్వాత తన కుటుంబం గురించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ట్రైలర్ మొత్తంగా ఆసక్తికరంగా ఉంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
దిల్ దోస్తీ డైలమా వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ట్రైలర్‌తో స్ట్రీమింగ్ డేట్‍ను ప్రైమ్ వీడియో కన్ఫర్మ్ చేసింది.
దిల్ దోస్తీ డైలమా గురించి..
దిల్ దోస్తీ డైలమా చిత్రంలో అనుష్క సేన్‍తో పాటు ఖుష్ జోత్వానీ, తన్వీ అజ్మి, శిశిర్ శర్మ, సుహాసినీ ములాయ్, ఎలిషా మేయర్, రేవతి పిళ్లై కీలకపాత్రలు పోషించారు. రచయిత అందలీబ్ వాజిద్ రచించిన అస్మారాస్ సమ్మర్ బుక్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ వెబ్ సిరీస్‍కు డెబ్బీ రావ్ దర్శకత్వం వహించారు.
టెన్ ఇయర్స్ యంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సీమ మహోపాత్ర, జహనారా భార్గవ ఈ సిరీస్‍ను నిర్మించారు. అనురాధ తివారీ, భార్గవ్ కృష్ణ, రాఘవ్ దత్, మంజరి విజయ్ పుపల ఈ సిరీస్‍కు స్క్రిప్ట్ రాశారు.