Bhimaa OTT: అఫీషియల్: భీమా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. స్ట్రీమింగ్ వివరాలివే-bhimaa ott release date confirmed gopichand fantasy action movie will stream on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhimaa Ott: అఫీషియల్: భీమా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. స్ట్రీమింగ్ వివరాలివే

Bhimaa OTT: అఫీషియల్: భీమా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. స్ట్రీమింగ్ వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 09, 2024 05:56 PM IST

Bhimaa OTT Release date: భీమా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ విషయంపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రం ఏ ప్లాట్‍ఫామ్‍లో.. ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందంటే..

Bhimaa OTT Release Date Official: అఫీషియల్: భీమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. స్ట్రీమింగ్  వివరాలివే
Bhimaa OTT Release Date Official: అఫీషియల్: భీమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. స్ట్రీమింగ్ వివరాలివే

Bhimaa OTT Release date: మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా మూవీ ‘భీమా’ మంచి అంచనాలతో వచ్చింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ చిత్రంపై బాగానే బజ్ ఏర్పడింది. మార్చి 8వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, అనుకున్న స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మిక్స్డ్ టాక్ రావడంతో ఆశించిన మేర వసూళ్లు రాలేదు. అయితే, భీమా సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు వేచిచూస్తున్నారు.

స్ట్రీమింగ్ డేట్ ఇదే..

భీమా సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 25వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ నేడు (ఏప్రిల్ 9) అధికారికంగా ప్రకటించింది. సర్‌ప్రైజ్ అంటూ ఈ అనౌన్స్‌మెంట్ చేసింది.

నేడు ఉగాది సందర్భంగా సర్‌ప్రైజ్ అంటూ ఏప్రిల్ 25న భీమా స్ట్రీమింగ్‍కు రానుందని డిస్నీ+ హాట్‍స్టార్ వెల్లడించింది. “యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌ భీమాను ఏప్రిల్ 25వ తేదీన మీ స్క్రీన్‍లపైకి తీసుకొస్తున్నాం” అని హాట్‍స్టార్ నేడు ట్వీట్ చేసింది. ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది.

ఆలస్యంగానే..

భీమా సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్‍గా నిలువడంతో నెల రోజుల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఏప్రిల్ తొలివారంలోనే వస్తుందనే రూమర్లు వచ్చాయి. అయితే, ఈ సినిమా మాత్రం అనుకున్న దాని కంటే ఆలస్యంగా ఓటీటీలో అడుగుపెడుతోంది. ఏప్రిల్ 25వ తేదీన హాట్‍స్టార్‌ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ షురూ కానుంది.

భీమా చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు గోపీచంద్. మరో రోల్‍లో కూడా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు కనిపించారు. వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, నాజర్, నరేశ్ కీలకపాత్రలు పోషించారు.

భీమా చిత్రానికి ఏ.హర్ష దర్శకత్వం వహించారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. రూ.25కోట్లకు పైగా బడ్జెట్‍తో రూపొందించిన ఈ మూవీకి రూ.15 కోట్లలోపే కలెక్షన్లు వచ్చాయనే లెక్కలు బయటికి వచ్చాయి. దీంతో కమర్షియల్‍గా ఈ మూవీ నిరాశపరిచింది.

భీమా స్టోరీ బ్యాక్‍‍డ్రాప్

మహేంద్రగిరి అనే ప్రాంతంలో భీమా సినిమా సాగుతుంది. ఆ ప్రాంతానికి ఓ పురాణ చరిత్ర ఉంటుంది. అక్కడ పరశురామ క్షేత్రం ఉంటుంది. ఆ ఊరికి ఎస్సైగా భీమా (గోపీచంద్) వస్తాడు. ఆ ప్రాంతంలో భవానీ (ముకేశ్ తివారి) అరాచకాలు చేస్తూ.. ప్రజలపై ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. అతడిని భీమా ఢీకొంటాడు. అతడి అరాచకాలను అంతం చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ట్యాంకర్లను అడ్డుకుంటాడు. అయితే, భీమా ఆ ప్రాంతానికి వచ్చేందుకు కారణమేంటి? ట్యాంకర్ల రహస్యమేంటి? పరశురామ క్షేత్రం మూతపడేందుకు కారణమేంటి? మళ్లీ తెరుచుకుందా? అనే విషయాలు భీమా చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

గోపీచంద్ తదుపరి దర్శకుడు శ్రీవైట్లతో సినిమా చేస్తున్నారు. యాక్షన్ మూవీగానే ఇది ఉండనుంది. ఈ చిత్రం నుంచి ది ఫస్ట్ స్టైక్ పేరుతో టీజర్ ఏప్రిల్ 11న రానుంది. ఈ విషయంపై నేడు ప్రకటన వచ్చింది.

IPL_Entry_Point