Bheema vs Gaami: భీమా వర్సెస్ గామి - ప్రీ రిలీజ్ బిజినెస్‌లో గోపీచంద్‌పై విశ్వక్‌సేన్‌దే డామినేషన్
Bheema vs Gaami: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ భీమా, విశ్వక్‌సేన్ గామి మధ్య ప్రధానంగా పోటీపడబోతున్నాయి. ఈ రెండు సినిమాల
Bheema vs Gaami: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ భీమా, విశ్వక్‌సేన్ గామి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. భీమా సినిమా డివోషనల్ టచ్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కన్నడ డైరెక్టర్ ఏ.హర్ష భీమా సినిమాకు దర్శకత్వం వహించాడు. కాగా గామి సినిమా ప్రయోగాత్మక కథాంశంతో రూపొందింది. ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకొన్న ఈ మూవీతో విధ్యాధర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
టీజర్స్, ట్రైలర్స్‌తో రెండు సినిమాలపై మంచి బ్రజ్ క్రియేట్ అయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. భీమాతో సమానంగా గామి థియేట్రికల్ బిజినెస్ జరగడం గమనార్హం.
భీమా ప్రీ రిలీజ్ బిజినెస్...
గోపీచంద్ భీమా ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్‌గా పదకొండున్నర కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఈ సినిమా నైజాం ఏరియా థ్రియేట్రికల్ రైట్స్ మూడున్నర కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఆంధ్రా ఏరియా మొత్తం కలిసి నాలుగున్నర కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదిన్నర కోట్ల వరకు భీమా బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
మొత్తం 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెబుతోన్నారు. రీసెంట్ టైమ్‌లో గోపీచంద్ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భీమా నిలిచింది.
భీమా సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. పరశురామ క్షేత్రాన్ని కాపాడుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ బ్రహ్మరాక్షసుడిగా ఎలా అవతారం ఎత్తాడనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
గామి టార్గెట్...
ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో గామిపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్స్ సంఖ్యలో భీమాపై గామిదే పైచేయిగా ఉంది. గామి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు పదిన్నర కోట్ల వరకు జరిగినట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఏపీ, తెలంగాణలో కలిసి గామి మూవీ థియేట్రికల్ హక్కులను ఎనిమిదిన్నర కోట్లకు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఎంత రావాలంటే?
ఓవర్‌సీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో రెండు కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు చెబుతోన్నారు. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో గామి మూవీ రిలీజ్ అవుతోన్నట్లు సమాచారం.
చాందిని చౌదరి హీరోయిన్...
గామి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోటి దాటినట్లు తెలిసింది. తొలిరోజు భీమా కంటే గామి ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. గామి సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. అభినయ కీలక పాత్ర పోషిస్తోంది. గామి సినిమాను యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ వీ సెల్యూలాయిడ్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ గురువారం గామి, భీమాతో పాటు ప్రేమలు, రికార్డ్ బ్రేక్, బుల్లెట్‌తో పాటు మరికొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.