Gaami Song: గామి నుంచి ‘శివమ్’ పాట వచ్చేసింది.. శంకర్ మహదేవన్ గాత్రంతో గూజ్‍బంప్స్ తెప్పించేలా..-shankar mahadevan shivam song released from gaami movie vishwak sen ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gaami Song: గామి నుంచి ‘శివమ్’ పాట వచ్చేసింది.. శంకర్ మహదేవన్ గాత్రంతో గూజ్‍బంప్స్ తెప్పించేలా..

Gaami Song: గామి నుంచి ‘శివమ్’ పాట వచ్చేసింది.. శంకర్ మహదేవన్ గాత్రంతో గూజ్‍బంప్స్ తెప్పించేలా..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 04, 2024 05:40 PM IST

Gaami - Shivam Song: గామి సినిమా నుంచి శివమ్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ పాటను ఆలపించారు.

Gaami Song: గామి నుంచి ‘శివమ్’ పాట వచ్చేసింది
Gaami Song: గామి నుంచి ‘శివమ్’ పాట వచ్చేసింది

Gaami: మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గామి సినిమాపై ప్రస్తుతం హైప్ వీపరీతంగా ఉంది. ట్రైలర్ టెక్నికల్‍గా అద్భుతంగా ఉండటంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. దర్శకుడు విద్యాధర్ కగిటకు ఇది డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంది. ఈ చిత్రం కోసం అతడు ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. మార్చి 8వ తేదీన గామి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో నేడు (మార్చి 4) ఈ చిత్రం నుంచి ‘శివమ్’ అనే పాట వచ్చేసింది.

గామి చిత్రం నుంచి శివమ్ సాంగ్ నేడు రిలీజ్ అయింది. స్పిరిట్ ఆఫ్ గామి పేరుతో ఈ పాటను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ‘నీలోని యుద్ధం శివమ్.. నీతోనీ యుద్ధం శివం’ అంటూ ఈ పాట ఇంటెన్సిటీతో ఉంది. ఈ మూవీ థీమ్‍ను తెలిపేలా ఈ సాంగ్ ఉంది.

శంకర్ మహదేవన్ గాత్రం

దిగ్గజ గాయకుడు శంకర్ మహదేవన్.. గామిలోని ఈ శివమ్ పాటను ఆలపించారు. శ్రీమణి ఈ పాటకు లిరిక్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేశ్ కుమారన్ ఈ పాటకు స్వరాలు అందించారు. ఇంటెన్స్‌గా ఉన్న మ్యూజిక్, శంకర్ మహదేవన్ గాత్రం, బరువైన సాహిత్యంతో ఈ పాట గూజ్‍బంప్స్ తెప్పించేలా ఉంది. గామి చిత్రానికి ఈ సాంగ్ హైలైట్‍గా నిలిచేలా కనిపిస్తోంది.

‘మావన స్పర్శే అతడికి అతిపెద్ద భయం.. అదే అతడికి అమితమైన కోరిక’ అనే ఇంట్రెస్టింగ్ లైన్‍తో గామి చిత్రం వస్తోంది. మానవ స్పర్శ పట్ల తనకు ఉండే భయాన్ని జయించి.. సాధారణంగా మారేందుకు ఓ వ్యక్తి చేసే ప్రయత్నమే గామి చిత్రంలో ప్రధానంగా ఉండనుంది. ఈ థీమ్‍ను తెలిపేలా ‘శివమ్’ పాట ఉంది. అందుకే స్పిరిట్ ఆఫ్ గామి అంటూ ఈ పాటను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

గామి సినిమాలో శివమ్ పాట లాంచ్‍కు ముందు నేడు శ్రీశైలం ఆలయాన్ని హీరో విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. పంచె కట్టులో నుదుటన నామంతో స్వామి దర్శనం చేసుకున్నారు విశ్వక్.

గామి చిత్రంలో చాందినీ చౌదరి, ఎంజీ అభినయ్, మహమ్మద్ సమద్ కీలకపాత్రలు పోషించారు. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ మూవీకి స్వీకర్ అగస్థి, నరేశ్ కుమారన్ సంగీతం అందించారు. వీ సెల్యూలాయిడ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చేశారు.

విద్యాధర్ కగిట దర్శకత్వం వహించిన ఈ సినిమా స్క్రీన్‍ప్లే చాలా విభిన్నంగా ఉంటుంది విశ్వక్‍సేన్ ఇటీవల చెప్పారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ స్టైల్‍లో గామి స్కీన్‍ప్లే ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు ఈ మూవీ మంచి అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ఈ చిత్రం కోసం తాను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని కూడా వెల్లడించారు.

గామి ట్రైలర్‌లో విజువల్స్, గ్రాఫిక్స్ అందరినీ మెప్పించాయి. మహా శివరాత్రి పర్వదినమైన మార్చి 8న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లలో ఈ సినిమాకు టికెట్ల బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

Whats_app_banner