Gaami Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న విశ్వక్‌సేన్ గామి ట్రైలర్.. విజువల్ ఫీస్ట్ గ్యారెంటీ-gaami trailer released vishwak sen movie is a visual feast telugu cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gaami Trailer Released Vishwak Sen Movie Is A Visual Feast Telugu Cinema News

Gaami Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న విశ్వక్‌సేన్ గామి ట్రైలర్.. విజువల్ ఫీస్ట్ గ్యారెంటీ

Hari Prasad S HT Telugu
Feb 29, 2024 09:54 PM IST

Gaami Trailer: టాలీవుడ్ స్టార్ విశ్వక్సేన్ నటిస్తున్న గామి మూవీ ట్రైలర్ గురువారం (ఫిబ్రవరి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్న ఈ ట్రైలర్ విజువల్ ఫీస్ట్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది.

విశ్వక్‌సేన్ గామి ట్రైలర్ రిలీజ్
విశ్వక్‌సేన్ గామి ట్రైలర్ రిలీజ్

Gaami Trailer: ఓ డిఫరెంట్ ఫీల్, స్టోరీ లైన్ తో విశ్వక్‌సేన్ నటిస్తోన్న గామి మూవీ ట్రైలర్ రిలీజైంది. ఓ మనిషి స్పర్శను గుర్తించలేకపోయే అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరా పాత్రలో విశ్వక్ ఈ మూవీలో కనిపించనున్నాడు. టైటిల్ సహా ఫస్ట్ లుక్ నుంచే ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ అందిస్తున్న ఈ సినిమా తాజా ట్రైలర్ తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

విశ్వక్‌సేన్ గామి ట్రైలర్

విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేసిన గామి మూవీ మార్చి 8న రిలీజ్ కానుండగా.. గురువారం (ఫిబ్రవరి 29) ట్రైలర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో మేకర్స్ మూవీ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ అడ్వెంచర్ డ్రామా ట్రైలర్ అద్భుతంగా సాగిపోయింది.

ట్రైలర్ మొదట్లోనే విశ్వక్‌సేన్ ఓ సింహంతో ఫైట్ కు సిద్ధమవుతున్నట్లు చూపించారు. ఆ తర్వాత అతన్ని అఘోరాల మధ్య తాను ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకు వచ్చాను అన్నట్లుగా పడి ఉంటాడు. తన సమస్యకు పరిష్కారం లభించాలంటే 36 ఏళ్లకోసారి హిమాలయాల్లో లభించే స్వయం ప్రకాశితులైన ఆకులే మార్గమని తెలుసుకున్న విశ్వక్ అక్కడికి బయలుదేరుతాడు.

ఈ సినిమా వివిధ చోట్ల జరిగే మూడు కథల సమాహారంగా కనిపిస్తోంది. ఈ కథల మధ్య ఉన్న లింకేంటి? ఈ భయంకరమైన ప్రయాణంలో విశ్వక్ ఎదుర్కొనే సవాళ్లేంటి అన్నది మూవీలో చూడాలి. అయితే ట్రైలర్ మొత్తం అద్భుతమైన విజువల్స్ తో సాగింది. వాటికి తగిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమా కోసం విశ్వక్ మేకోవర్ బాగా ఆకట్టుకుంది.

ఇన్నాళ్లూ అతడు తీసిన సినిమాలకు ఈ గామికి అసలు సంబంధమే లేనట్లుగా విశ్వక్ కనిపించాడు. ఓ డిఫరెంట్ జానర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అతడు ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి. మార్చి 8న థియేటర్లలోకి గామి రానుంది. ఈ సినిమాలో అభినయ, హారిక, మహ్మద్ సమద్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

గామి మూవీకి నరేష్ కుమరన్ మ్యూజిక్ అందించాడు. విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే అందించారు. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా థియేటర్లలో ఎలా ఆడుతుందో చూడాలి.

గామి ఓటీటీ

విశ్వ‌క్‌సేన్‌కు యూత్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్‌తో పాటు గామి కంటెంట్‌పై ఉన్న న‌మ్మ‌కంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 కొనుగోలు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శాటిలైట్ హ‌క్కుల‌ను జీ తెలుగు ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల త‌ర్వాత గామి మూవీ ఓటీటీలో రిలీజ‌య్యేలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

2017లో గామి సినిమాను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. 2018 లో షూటింగ్ మొద‌లైంది. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్‌ను జ‌రుపుకున్న‌ది. గామి సినిమాను యూవీ క్రియేష‌న్స్ అనుబంధం సంస్థ వీ సెల్యూలాయిడ్స్ రిలీజ్ చేస్తోంది. గామి సినిమాలో చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

IPL_Entry_Point