Gaami OTT Platform: థియేట‌ర్ రిలీజ్‌కు ముందే విశ్వ‌క్ సేన్ గామి ఓటీటీ, శాటిలైట్‌ డీల్ క్లోజ్‌-vishwak sen gaami movie ott and satellite rights sold before theatrical release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gaami Ott Platform: థియేట‌ర్ రిలీజ్‌కు ముందే విశ్వ‌క్ సేన్ గామి ఓటీటీ, శాటిలైట్‌ డీల్ క్లోజ్‌

Gaami OTT Platform: థియేట‌ర్ రిలీజ్‌కు ముందే విశ్వ‌క్ సేన్ గామి ఓటీటీ, శాటిలైట్‌ డీల్ క్లోజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 27, 2024 01:31 PM IST

Gaami OTT Platform: థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే విశ్వ‌క్ సేన్ గామి మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయిన‌ట్లు స‌మాచారం. ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీ5 కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

విశ్వ‌క్ సేన్ గామి మూవీ ఓటీటీ
విశ్వ‌క్ సేన్ గామి మూవీ ఓటీటీ

Gaami OTT Platform: విశ్వ‌క్‌సేన్ గామి మూవీ మార్చి 8న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు రెండు వారాల ముందే గామి సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయిన‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. గామి మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

విశ్వ‌క్‌సేన్‌కు యూత్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్‌తో పాటు గామి కంటెంట్‌పై ఉన్న న‌మ్మ‌కంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 కొనుగోలు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శాటిలైట్ హ‌క్కుల‌ను జీ తెలుగు ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల త‌ర్వాత గామి మూవీ ఓటీటీలో రిలీజ‌య్యేలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అఘోరాగా విశ్వ‌క్‌సేన్‌...

గామి సినిమాలో అఘోరాగా విశ్వ‌క్ సేన్ న‌టిస్తోన్నాడు. ఈ సినిమాతో విద్యాధ‌ర్ కాగిత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. తొలుత ఫిబ్ర‌వ‌రి 29న ఈ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో మార్చి 8కి రిలీజ్ డేట్‌ను వాయిదావేశారు.

టీజ‌ర్‌కు మిలియ‌న్ వ్యూస్‌...

ఇటీవ‌ల రిలీజైన గామి టీజ‌ర్ యూట్యూబ్‌లో మిలియ‌న్‌కుపైగా వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ది. శంక‌ర్ అనే యువ‌కుడు అఘోరాగా ఎందుకు మారాడు? హిమాల‌యాల వ‌ర‌కు సాగిన అత‌డి ప్ర‌యాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

2017లో గామి సినిమాను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. 2018 లో షూటింగ్ మొద‌లైంది. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్‌ను జ‌రుపుకున్న‌ది. గామి సినిమాను యూవీ క్రియేష‌న్స్ అనుబంధం సంస్థ వీ సెల్యూలాయిడ్స్ రిలీజ్ చేస్తోంది. గామి సినిమాలో చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అభిన‌య‌, స‌మ‌ద్‌, హారిక కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి అనుకున్నారు..కానీ...

విశ్వ‌క్ సేన్ గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావ‌రి మూవీని మార్చి 8న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా ఈ మూవీ పోస్ట్ పోన్ కావ‌డంతో అదే డేట్‌కు గామి థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. గ్యాంగ్ ఆఫ్ గోదావ‌రి మూవీకి చైత‌న్య కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

గోదావ‌రి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ తెర‌కెక్కుతోంది. నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో అంజ‌లి మ‌రో కీల‌క పాత్ర పోషిస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఓటీటీ హ‌క్కులు కూడా రిలీజ్ కుముందే అమ్ముడుపోయాయి. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది.

మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌...

గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి త‌ర్వాత విశ్వ‌క్ సేన్ మ‌రో యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాలో విశ్వ‌క్ సేన్‌కు జోడీగా గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మ‌రోవైపు జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా తెలుగు హీరోయిన్ చాందిని చౌద‌రి డిఫ‌రెంట్ మూవీస్ ఎంచుకుంటోంది. క‌ల‌ర్ ఫొటోతో పెద్ద విజ‌యాన్ని అందుకున్న‌ది చాందిని చౌద‌రి. స‌బానాయ‌గ‌న్ మూవీతో ఇటీవ‌లే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం తెలుగులో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేస్తోంది. ఇందులో అజ‌య్ ఘోష్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్నాడు.

టాపిక్