Vishwak Sen Gangs of Godavari: మాస్ లుక్‌లో విశ్వ‌క్‌సేన్ - గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్‌-vishwak sen gangs of godavari first glimpse out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen Gangs Of Godavari: మాస్ లుక్‌లో విశ్వ‌క్‌సేన్ - గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్‌

Vishwak Sen Gangs of Godavari: మాస్ లుక్‌లో విశ్వ‌క్‌సేన్ - గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్‌

HT Telugu Desk HT Telugu
Jul 31, 2023 11:04 AM IST

Vishwak Sen Gangs of Godavari: యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్‌, డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య కాంబోలో రూపొందుతోన్న సినిమా టైటిల్ ఫిక్స‌యింది. ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు.

విశ్వ‌క్‌సేన్‌ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి
విశ్వ‌క్‌సేన్‌ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి

Vishwak Sen Gangs of Godavari: గోదావరి స్లాంగ్‌లో అద‌ర‌గొట్టేందుకు యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్‌ రెడీ అవుతోన్నాడు. అత‌డు హీరోగా కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ గ్లింప్స్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ఈ మూవీకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి అనే పేరును ఖ‌రారు చేశారు.

ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ మాస్, రియ‌లిస్టిక్ అంశాల‌తో సాగింది. గోదావ‌రి యాస‌లో విశ్వ‌క్ సేన్ చెప్పిన డైలాగ్స్ ఈ ఫ‌స్ట్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచాయి. అన్న మేము గోదారోళ్లం...తేడాలోస్తే న‌రాలు లాగేస్తాం అంటూ విశ్వ‌క్‌సేన్ వార్నింగ్ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. గోదావ‌రి ప్రాంతం, చేప‌ల చెరువులు బ్యాక్‌డ్రాప్, అక్క‌డి రాజ‌కీయాల‌తో ముడిప‌డి ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

గ్లింప్స్ చివ‌ర‌లో లారీపై నిల్చొని విశ్వ‌క్ సేన్ మాస్ లుక్‌లో క‌నిపించి అల‌రించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా....అంజ‌లి కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆమెతో పాటు సాయికుమార్‌, నాజ‌ర్, గోప‌రాజు ర‌మ‌ణ ఈ ఫ‌స్ట్ గ్లింప్స్‌లో క‌నిపించారు.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌....

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తోన్న 11వ సినిమా ఇది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీని శ్రీక‌ర స్టూడియోస్‌, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్‌తో క‌లిసి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీకి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందిస్తోన్నాడు. గ‌తంలో కృష్ణ చైత‌న్య రౌడీ ఫెలో, ఛ‌ల్ మోహ‌న‌రంగ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు ఐదేళ్ల విరామం త‌ర్వాత తిరిగి మెగాఫోన్ ప‌ట్టిన ఆయ‌న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాను తెర‌కెక్కిస్తోన్నాడు.

తొలుత ఈ సినిమాను శ‌ర్వానంద్‌తో చేయాల‌ని కృష్ణ చైత‌న్య అనుకున్నారు. డేట్స్ స‌ర్ధుబాటు కాక శ‌ర్వానంద్ త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో విశ్వ‌క్‌సేస్‌తో ఈ సినిమాను మొద‌లుపెట్టాడు. ఇప్ప‌టివ‌ర‌కు త‌న సినిమాల్లో హైద‌రాబాద్ యాస‌లోనే డైలాగ్స్ చెప్పిన విశ్వ‌క్‌సేన్‌ ఈ మూవీ కోసం ఫ‌స్ట్ టైమ్ గోదావ‌రి స్లాంగ్ నేర్చుకున్న‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point