OTTPlay Premium Bumper Offer: 14 ఓటీటీలు.. హైస్పీడ్ ఇంటర్నెట్.. నెలకు కేవలం రూ.616 మాత్రమే.. ఓటీటీప్లే బంపర్ ఆఫర్
OTTPlay Premium Bumper Offer: ఒకే సబ్‌స్క్రిప్షన్ తో 14 ఓటీటీలు, హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే ప్లాన్ తీసుకొస్తున్న ఓటీటీప్లే ప్రీమియం, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లిమిటెడ్. కేవలం రూ.616కే ఈ ఆఫర్ అందిస్తున్నారు.
OTTPlay Premium Bumper Offer: ఓటీటీలు, హైస్పీడ్ ఇంటర్నెట్.. ఈ కాలం యువతకు ఈ రెండూ ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు. ఈ రెండింటినీ అందుబాటు ధరలో అందించడానికి ఓటీటీప్లే ప్రీమియం, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లిమిటెడ్ (కేసీసీఎల్) చేతులు కలిపాయి. ఈ సరికొత్త ప్లాన్ ను ఈ నెల 22న కేరళలోని కొచ్చిలో అనౌన్స్ చేశారు.
ఓటీటీప్లే ప్రీమియం కొత్త ప్లాన్ ఇదే
రెండేళ్లుగా ఓటీటీ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ప్లాట్‌ఫామ్ ఓటీటీప్లే (OTTPlay). దేశంలో తొలి ఏఐ పవర్డ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇది. ఒకే సబ్‌స్క్రిప్షన్ తో వివిధ ఓటీటీల కంటెంట్ చూసే వీలు దీని ద్వారా యూజర్స్ కు కలుగుతోంది. ఇప్పుడీ ఓటీటీప్లే నుంచి సరికొత్త ప్లాన్ వచ్చింది. నెలకు రూ.616తో ఈ ప్లాన్ తీసుకొచ్చారు.
ఇందులో భాగంగా 14 ఓటీటీలతోపాటు 50 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ అందిస్తారు. నెలకు 4 వేల జీబీ ఇంటర్నెట్ పరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ లో భాగంగా సన్‌నెక్ట్స్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్ట్రో టీవీ, నమ్మా ఫ్లిక్స్, ఏఎల్‌టీ బాలాజీ, ప్లే ఫ్లిక్స్, ఐస్ట్రీమ్, ఫ్యాన్‌కోడ్, డాలీవుడ్ ప్లే, షార్ట్స్ టీవీ, రాజ్ డిజిటల్ లాంటి ఓటీటీలు ఈ ప్లాన్ ద్వారా అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ప్లాన్స్ తో పోలిస్తే ఇది కస్టమర్లకు చాలా అందుబాటు ధరలో ఉన్న ప్లాన్. ఫిబ్రవరి 22న ఈ కొత్త ప్లాన్ ను ఓటీటీప్లే ప్రీమియం, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లిమిటెడ్ సంయుక్తింగా అనౌన్స్ చేశాయి. ఈ సందర్భంగా ఓటీటీప్లే సీఈవో, కోఫౌండర్ అవినాష్ ముదలియార్ మాట్లాడారు. తమ భాగస్వామ్యం ఈ ఇండస్ట్రీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
అసలేంటి ఓటీటీప్లే?
ఓటీటీప్లే ఇండియాలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓటీటీ రికమెండేషన్ ప్లాట్‌ఫామ్. అయితే 2022లో ఇది స్ట్రీమింగ్ సర్వీసులను కూడా ప్రారంభించింది. కేవలం రికమండేషన్లే కాదు.. వివిధ ఓటీటీల స్ట్రీమింగ్ కూడా ఈ ఓటీటీప్లేలో అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో వివిధ ఓటీటీల సర్వీసులను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.
ఇండియా వ్యాప్తంగా 32కుపైగా ఓటీటీలతో కలిసి వివిధ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ఓటీటీప్లే అందిస్తోంది. ఇందులో ఆరు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్స్, ఒకటి క్వార్టర్లీ, మరో ఆరు యానువల్ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఓటీటీప్లే యాప్ ను ఐఓఎస్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ తోపాటు జియో స్టోర్, పర్సనల్ కంప్యూటర్లు, ట్యాబ్లెట్లలో చూడొచ్చు.
ఈ ఓటీటీప్లే ప్రీమియంలో సన్‌నెక్ట్స్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్ట్రో టీవీ, నమ్మా ఫ్లిక్స్, ఏఎల్‌టీ బాలాజీ, ప్లే ఫ్లిక్స్, ఐస్ట్రీమ్, ఫ్యాన్‌కోడ్, డాలీవుడ్ ప్లే, షార్ట్స్ టీవీ, రాజ్ డిజిటల్ లాంటి వాటితోపాటు మరెన్నో ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి.