GOAT OTT Rights: దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ హక్కులకు కళ్లు చెదిరే మొత్తం.. ఆ ఓటీటీకే..-goat ott rights netflix bags thalapathy vijays movie ott rights for huge sum says a report kollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Goat Ott Rights Netflix Bags Thalapathy Vijays Movie Ott Rights For Huge Sum Says A Report Kollywood News In Telugu

GOAT OTT Rights: దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ హక్కులకు కళ్లు చెదిరే మొత్తం.. ఆ ఓటీటీకే..

Hari Prasad S HT Telugu
Feb 29, 2024 06:15 PM IST

GOAT OTT Rights: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఓటీటీ హక్కులకు కళ్లు చెదిరే మొత్తం లభించినట్లు వార్తలు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ హక్కులను దక్కించుకుంది.

దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ చేతికి..
దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ చేతికి..

GOAT OTT Rights: ఈ మధ్య సౌత్ సినిమాల విషయంలో దూకుడుగా వెళ్తున్న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్.. తాజాగా దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) మూవీ డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. తమిళ సినిమా ఇండస్ట్రీలోనే గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ చేతికి దళపతి గోట్

దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నటిస్తున్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో గోట్ ఓటీటీ హక్కులు రికార్డు మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఆ మొత్తం ఎంత అన్నది వెల్లడి కాకపోయినా.. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అయితే నెట్‌ఫ్లిక్స్ చేతికి మరో టాప్ మూవీ రావడం మాత్రం విశేషమే. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలు భారీ బడ్జెట్ సినిమాలను ఈ ఓటీటీ ఇప్పటికే దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జులై 31న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ దళపతి విజయ్ కెరీర్ చివరి సినిమాల్లో ఒకటి కాబోతోంది. ఈ మూవీలో అతడు డ్యుయల్ రోల్లో కనిపించనుండటం మరో విశేషం. అందులో ఒక పాత్రలో విజయ్ 18 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నాడు. అతన్ని అలా చూపించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

విజయ్ ఈ మధ్యే రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తర్వాత విజయ్ తన చివరి సినిమా దళపతి 69 చేయనున్నాడు. ఈ సినిమా గురించి ప్రస్తుతానికి పెద్దగా సమాచారం లేదు. అయితే ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నట్లు మాత్రం తెలుస్తోంది. వెట్రిమారన్, కార్తీక్ సుబ్బరాజ్ లలో ఒకరు విజయ్ చివరి మూవీని డైరెక్ట్ చేయనున్నారు.

నెట్‌ఫ్లిక్స్ చేతికి భారీ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్ తాజాగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా హక్కులు దక్కించుకుంది. అయితే ఇప్పటికే పలు తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీస్ కూడా ఆ ఓటీటీ చేతికి చిక్కాయి. ఈ మధ్యే ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఆ ఓటీటీ చేసింది.

అందులో అల్లు అర్జున్ పుష్ప 2, జూనియర్ ఎన్టీఆర్ దేవర, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సిద్దూ జొన్నలగడ్డ టిల్లూ స్క్వేర్ లాంటి తెలుగు సినిమాలతోపాటు తమిళ సినిమాలు ఇండియన్ 2, అజిత్ కుమార్ విదా ముయార్చి, శివకార్తికేయన్ అమరన్, విజయ్ సేతుపతి మహారాజా హక్కులను కూడా దక్కించుకుంది.

WhatsApp channel