OTTplay Premium: తక్కువ ధర.. ఎక్కువ ఓటీటీలు.. ఓటీటీప్లే ప్రీమియం డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?-one subscription and 12 otts with ottplay premium ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ottplay Premium: తక్కువ ధర.. ఎక్కువ ఓటీటీలు.. ఓటీటీప్లే ప్రీమియం డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?

OTTplay Premium: తక్కువ ధర.. ఎక్కువ ఓటీటీలు.. ఓటీటీప్లే ప్రీమియం డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?

HT Telugu Desk HT Telugu
Aug 10, 2022 07:30 PM IST

OTTplay Premium: ఇది ఓటీటీల జమానా అని తెలుసు కదా. ప్రతి ఇంట్లో స్మార్ట్‌ టీవీ వచ్చేసిన తర్వాత ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ)ల హవా మొదలైంది. అయితే ఒక్కో ఓటీటీకి సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలంటే తడిసి మోపెడవుతుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ ఓటీటీప్లే ప్రీమియం.

<p>ఓటీటీ ప్లే ప్రీమియం యాప్</p>
ఓటీటీ ప్లే ప్రీమియం యాప్

నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌, జీ5, సోనీ లివ్‌, సన్‌నెక్ట్స్‌.. ఇవన్నీ ఓటీటీలే. కాకపోతే వీటిలో ఒక్కోదానికి ఒక్కో సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. నెల నుంచి మొదలు ఏడాది కాలానికి ఒకేసారి వీటిని సబ్‌స్క్రైబ్‌ చేసుకునే వీలుంది. అయితే ఒక్కో ఓటీటీకి ఒక్కో సబ్‌స్క్రిప్షన్‌ రేటు ఉంటుంది. సగటు మధ్యతరగతి వాళ్లు ఇలా ఒక్కో ఓటీటీకి సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది.

అలాంటి వాళ్ల కోసం ఓటీటీప్లే ప్రీమియం (OTTplay Premium) ఓ సూపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. ఇందులో ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో 12 ఓటీటీలు ఏడాదిపాటు చూసే అవకాశం ఉంటుంది. చాలా చీప్‌గా ఇన్ని ఓటీటీలు అందిస్తున్నది కాబట్టే ఓటీటీప్లే ప్రీమియంకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. నిజానికి బుధవారం (ఆగస్ట్‌ 10) ఈ ఓటీటీప్లే ప్రీమియం ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్స్‌లో ఉండటం విశేషం.

తక్కువ ధరకే ఓటీటీల ప్యాకేజీ అందిస్తున్న దీని గురించి నెటిజన్లు ట్విటర్‌లో చర్చించుకుంటున్నారు. ఈ ఓటీటీప్లే ప్రీమియంలో టాప్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే అందులో సోనీలివ్‌తోపాటు జీ5, లయన్స్‌గేట్‌ ప్లే, సన్‌ నెక్ట్స్‌, షెమారూ మీ, షార్ట్స్‌ టీవీ, క్యూరియాసిటీ స్ట్రీమ్‌లాంటి 12 ఓటీటీలు చూడొచ్చు. వీటిలో 10 ప్రాంతీయ భాషల కంటెంట్‌తోపాటు మొత్తం 25 వేలకుపైగా సినిమాలు, వెబ్‌షోలు ఉండటం విశేషం.

ఈ ఓటీటీప్లే ప్రీమియంలో ఐదు సబ్‌స్క్రిప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువలో తక్కువగా నెలకు రూ.50 సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉండటం విశేషం. ఒకే ప్లాట్‌ఫామ్‌పై 25 వేలకుపైగా సినిమాలు, వెబ్‌షోలు అందించడం మన దేశంలో ఇదే తొలిసారి. ఒకే ప్యాకేజీలో 12 ఓటీటీలు కావాలంటే ఏడాదికి రూ.1999 చెల్లిస్తే సరిపోతుంది. వీటిని విడివిడిగా సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలంటే ఏడాదికి రూ.14 వేల వరకూ ఖర్చవుతుంది.

Whats_app_banner