New Movies in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల పండగ.. ఆగస్ట్‌లో రిలీజ్‌ అవుతున్న మూవీస్‌ ఇవే-netflix shares its new releases of august in instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  New Movies In Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల పండగ.. ఆగస్ట్‌లో రిలీజ్‌ అవుతున్న మూవీస్‌ ఇవే

New Movies in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల పండగ.. ఆగస్ట్‌లో రిలీజ్‌ అవుతున్న మూవీస్‌ ఇవే

HT Telugu Desk HT Telugu
Aug 01, 2022 08:30 PM IST

New Movies in Netflix: మీకు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉందా? అయితే ఈ ఆగస్ట్‌లో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పండగ చేసుకోండి. సోమవారం (ఆగస్ట్‌ 1) నుంచి ఈ నెల మొత్తం రిలీజ్‌ అవుతున్న కొత్త సినిమాల లిస్ట్‌ చూసేయండి.

ఈ నెల 5న నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ కానున్న డార్లింగ్స్ మూవీ
ఈ నెల 5న నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ కానున్న డార్లింగ్స్ మూవీ

ఆగస్ట్‌ వచ్చేసింది, డార్లింగ్స్‌ అంటూ నెట్‌ఫ్లిక్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా రిలీజ్‌ కాబోతున్న మూవీస్‌, వెబ్‌సిరీస్‌ల లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. సోమవారం (ఆగస్ట్‌ 1) ఈ గ్లోబల్‌ ఓటీటీ.. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్‌ను తమ యూజర్స్‌తో షేర్‌ చేసుకుంది. ఇందులో టాప్ హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది.

సోమవారమే నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌గన్‌ మూవీతోపాటు మిషన్‌ ఇంపాజిబుల్‌ 1, 2, 3, ఘోస్ట్‌ ప్రొటోకాల్‌, రోగ్‌ నేషన్, ఫాలౌట్‌లతోపాటు ఇంటర్‌స్టెల్లార్‌, బ్యాట్‌మన్‌ vs సూపర్‌మ్యాన్‌: డాన్‌ ఆఫ్‌ జస్టిస్‌లాంటి మూవీస్‌ వచ్చాయి. ఇక ఈ నెల 5న గోపీచంద్‌ నటించిన పక్కా కమర్షియల్‌తోపాటు బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించిన డార్లింగ్స్‌, కార్టర్‌లాంటి మూవీలు వస్తున్నాయి.

ఆగస్ట్‌ 8న తెలుగు మూవీ హ్యాపీ బర్త్‌డే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. ఇక ఈ నెల 10న ఇండియన్‌ మ్యాచ్‌మేకింగ్‌ సీజన్‌ 2తోపాటు లాక్‌&కీ సీజన్‌ 3 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 13న బ్రూక్లిన్‌ నైన్‌-నైన్‌ సీజన్‌ 8 రానుంది. ఆగస్ట్‌ నెల మొత్తం తన కొత్త రిలీజెస్‌ గురించి చెబుతూ.. ఇవన్నీ మిమ్మల్ని థ్రిల్‌ చేస్తాయని భావిస్తున్నామని నెట్‌ఫ్లిక్స్‌ క్యాప్షన్‌ ఉంచింది.

ఈ కొత్త లిస్ట్‌ చూసి ఫ్యాన్స్‌ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. ఎంతోమంది అభిమానులు తాము ఈ కొత్త మూవీస్‌, సిరీస్‌ల నుంచి ఏం చూడాలనుకుంటున్నామో కామెంట్స్‌ ద్వారా చెప్పారు. ఎక్కువ మూవీస్‌ కంటే బ్రూక్లిన్‌ నైన్‌-నైన్‌, లాక్‌&కీలాంటి సిరీస్‌లపైనే ఆసక్తి చూపడం విశేషం.

IPL_Entry_Point