Vishwak Sen: ఇష్టమైన హీరోతో పెద్ద సినిమా రిజెక్ట్ చేశా: విశ్వక్‍సేన్ చెప్పింది ఆ మూవీ గురించేనా?-i rejected a big movie with star hero says vishwak sen ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: ఇష్టమైన హీరోతో పెద్ద సినిమా రిజెక్ట్ చేశా: విశ్వక్‍సేన్ చెప్పింది ఆ మూవీ గురించేనా?

Vishwak Sen: ఇష్టమైన హీరోతో పెద్ద సినిమా రిజెక్ట్ చేశా: విశ్వక్‍సేన్ చెప్పింది ఆ మూవీ గురించేనా?

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 17, 2024 03:35 PM IST

Vishwak Sen: తనకు ఇష్టమైన ఓ హీరోతో ఓ పెద్ద సినిమా ఆఫర్ వస్తే తాను అంగీకరించలేదని విశ్వక్‍సేన్ చెప్పారు. ఎందుకో కూడా వివరించారు. అయితే, విశ్వక్ సేన్ రిజెక్ట్ చేసిన సినిమా ఏదో ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

Vishwak Sen: ఇష్టమైన హీరోతో పెద్ద సినిమా రిజెక్ట్ చేశా: విశ్వక్‍సేన్ చెప్పింది ఆ మూవీ గురించేనా?
Vishwak Sen: ఇష్టమైన హీరోతో పెద్ద సినిమా రిజెక్ట్ చేశా: విశ్వక్‍సేన్ చెప్పింది ఆ మూవీ గురించేనా?

Vishwak Sen: మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ దూకుడు మీద ఉన్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం ‘గామి’ రిలీజ్‍కు సిద్ధమైంది. అఘోరాగా విశ్వక్ నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా ఆయన చేస్తున్నారు. అలాగే, రామ్ తాల్లూరి దర్శకత్వం మరో చిత్రం కూడా విశ్వక్ లైనప్‍లో ఉంది. ఇలా ఫుల్ బిజీగా ఉంటున్నారు. కాగా, తాను తనకు ఇష్టమైన హీరో చేస్తున్న ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్‍సేన్ చెప్పారు. దీంతో ఈ మూవీ ఏదనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.

ఓ పెద్ద సినిమాలో బలంగా ఉండే ఓ మెయిన్ రోల్‍ను తాను ఇటీవల రిజెక్ట్ చేశానని విశ్వక్‍సేన్ చెప్పారు. తనకు ఇష్టమైన హీరో సినిమానే అయినా చేయలేదని చెప్పారు. అయితే, ఆ హీరోతో మరింత మంచి సినిమా చేయాలనుందని విశ్వక్ అన్నారు.

“నేను రీసెంట్‍గా ఓ పెద్ద సినిమాలో ఓ పెద్ద రోల్ వదిలేశా. నాకు ఇష్టమైన పెద్ద హీరోతోనే. సినిమాలో మొత్తం ఉండే మెయిన్ సాలిడ్ రోల్ అది. వాల్తేరు వీరయ్యలో రవితేజ రోల్ ఎలా ఉంటుందో.. నాకు ఇష్టమైన హీరోతో అంత మంచి రోల్ వచ్చింది. కానీ చేయలేదు. డబ్బుల కోసం చేయాలంటే చేయవచ్చు కదా” అని రాజేశ్ మన్నె యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వక్‍సేన్ చెప్పారు. అలా ఎందుకని ప్రశ్నించగా.. అదే హీరోతోనే ఇంకా మంచి సినిమా చేయాలనుందని విశ్వక్ చెప్పారు. అలాగే, విశ్వక్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.

విశ్వక్ చెప్పింది ఆ సినిమా గురించే!

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ (NBK 109) రూపొందుతోంది. ఈ చిత్రంలోనే విశ్వక్‍సేన్‍కు ఆఫర్ రాగా.. అతడు తిరస్కరించినట్టు తెలుస్తోంది. తనకు ఇష్టమైన హీరో అని అతడు చెప్పడంతో ఇది స్పష్టంగా తెలుస్తోందని నెటిజన్లు అంటున్నారు.

బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న అన్‍స్టాపబుల్ షోకు విశ్వక్ ఓసారి వెళ్లారు. అలాగే, దాస్ కా దమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడింది. తనకు బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో కూడా పలుసార్లు చెప్పారు విశ్వక్.

అయితే, విశ్వక్‍సేన్ వదులుకుందని NBK 109 చిత్రంలోని పెద్ద రోల్‍నే అని అర్థమవుతోంది. అయితే, విశ్వక్ రిజెక్ట్ చేసిన ఆ పాత్రను మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పాత్రకు చిత్రంలో చాలా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

గామి ట్రైలర్ డేట్ ఇదే

విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన గామి సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. సుమారు నాలుగేళ్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. విద్యాధర్ కటిగ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఘోరాగా డిఫరెంట్ గెటప్‍లో విశ్వక్ నటించారు. ఈ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 29న రానుంది. ఈ గామి సినిమా మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

IPL_Entry_Point