Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత: శ్రీశైలంలో విశ్వక్‍సేన్: వీడియోలు-samantha ruth prabhu visited tirumala temple and vishwak sen at srisailam for launch shivam song from gaami ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Samantha Ruth Prabhu Visited Tirumala Temple And Vishwak Sen At Srisailam For Launch Shivam Song From Gaami

Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత: శ్రీశైలంలో విశ్వక్‍సేన్: వీడియోలు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 04, 2024 03:01 PM IST

Samantha Ruth Prabhu - Tirumala Temple: స్టార్ హీరోయిన్ సమంత.. తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం సినిమాల నుంచి ఆమె బ్రేక్ తీసుకున్నారు. మరోవైపు, హీరో విశ్వక్‍సేన్ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు.

Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత: శ్రీశైలంలో విశ్వక్‍సేన్: వీడియోలు
Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత: శ్రీశైలంలో విశ్వక్‍సేన్: వీడియోలు

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకునేందుకు ఆమె విరామం ప్రకటించారు. ఇంకా తదుపరి ఏ సినిమాకు ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. చివరగా గతేడాది సెప్టెంబర్‌లో ఖుషి చిత్రంలో కనిపించారు సామ్. కాగా, సమంత నేడు (మార్చి 4) తిరుమల ఆలయానికి వెళ్లారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సమంత నేడు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ టైమ్‍లో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి సమంత బయటికి వచ్చాక.. ఆమె చుట్టూ చాలా మంది గుమికూడారు. కొందరు ఫొటోలు తీసేందుకు పోటీపడ్డారు.

అంతకు ముందు ఉదయం తిరుచానూరు ఆలయానికి కూడా సమంత వెళ్లారు. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుమలకు వెళ్లారు.

సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని సమాచారం. సినిమాలకు దూరంగా ఉన్నా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు సమంత. తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

ఇటీవలే టేక్ 20 అనే హెల్త్ పోడ్‍కాస్ట్ మొదలుపెట్టారు సమంత. వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ పోడ్‍కాస్ట్ తీసుకొచ్చారు. ఆరోగ్య నిపుణులతో ఆమె ముచ్చటిస్తారు. ఇటీవలే ఆటో ఇమ్యూనిటీ అంశం గురించి ఈ టేక్ 20 పోడ్‍కాస్ట్‌లో సమంత ఓ ఎపిసోడ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సమంత మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారో ఇంకా స్పష్టత రాలేదు. ఏ చిత్రానికి ఆమె ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తోంది. మరికొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. తనకు మయోసైటిస్ వ్యాధి వచ్చిందని సమంత గతేడాది వెల్లడించారు. దాని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పారు. ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనా ఖుషి చిత్రాన్ని ఆమె పూర్తి చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ చిత్రం గతేడాది సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. సమంత మళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తారా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

శ్రీశైలంలో విశ్వక్‍సేన్

Vishwak Sen: మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్‍సేన్.. నేడు శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్నారు. గామి చిత్రం నుంచి శివమ్ అనే పాటను నేడు మూవీ టీమ్ లాంచ్ చేయనుంది. ఆధ్యాత్మికతతో కూడిన ఈ పాటను శ్రీశైలంలోనే రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం శ్రీశైలం చేరుకున్న విశ్వక్.. మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పంచె కట్టులో సంప్రదాయబద్దంగా ఆలయానికి వెళ్లారు విశ్వక్.

గామి సినిమా మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ అద్భుతంగా ఉంటూ అందరినీ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విద్యాధర్ కగిట. చాందినీ చౌదరి, అభినయ, హారిక, దయానంద్ రెడ్డి ఈ చిత్రంలో కీరోల్స్ చేయగా.. నరేశ్ కుమారన్ సంగీతం అందించారు. గామి చిత్రం కోసం తాను ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని విశ్వక్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది సాధారణమైన చిత్రం కాదని అన్నాడు.

IPL_Entry_Point