Samantha Take 20: నేనూ అలానే అనుకున్నా.. కానీ: సమంత-samantha take 20 podcast first episode about autoimmunity is out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Take 20: నేనూ అలానే అనుకున్నా.. కానీ: సమంత

Samantha Take 20: నేనూ అలానే అనుకున్నా.. కానీ: సమంత

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 20, 2024 02:40 PM IST

Samantha Take 20 Podcast: హీరోయిన్ సమంత.. ఆరోగ్యంపై పోడ్‍కాస్ట్ మొదలుపెట్టారు. టేక్ 20 అనే ఈ పోడ్‍కాస్ట్ సిరీస్‍లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది. దీంట్లో ఆసక్తికర విషయాలు చెప్పారు సమంత.

Samantha Take 20: నేనూ అలానే అనుకున్నా.. కానీ: సమంత (Photo: Samantha/YouTube)
Samantha Take 20: నేనూ అలానే అనుకున్నా.. కానీ: సమంత (Photo: Samantha/YouTube)

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. ఆటో ఇమ్యూన్ వ్యాధి ‘మయోసైటిస్‍’తో తాను బాధపడుతున్నట్టు ఆమె గతేడాది వెల్లడించారు. దానికి చికిత్స తీసుకునేందుకు, కోలుకునేందుకు సమంత ప్రస్తుతం విరామం తీసుకుంటున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) శరీరానికి మంచి కాకుండా వ్యతిరేకంగా పని చేస్తే కలిగే వ్యాధే మయోసైటిస్. ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమంత నిర్ణయించుకున్నారు. అందుకే టేక్ 20 పేరుతో ఇటీవలే ఓ హెల్త్ పోడ్‍కాస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. సమంత హోస్ట్ చేస్తున్న ఈ పోడ్‍కాస్ట్‌లో తొలి ఎపిసోడ్ తాజాగా వచ్చింది.

ఆటో ఇన్యూనిటీని అర్థం చేసుకోవడం అనే అంశంతో టేక్ 20 పోడ్‍కాస్ట్ తొలి ఎపిసోడ్‍ను సమంత తీసుకొచ్చారు. ప్రత్యేక నిపుణుడు అల్కేశ్‍ను ఈ అంశంపై సమంత ప్రశ్నలు అడిగారు. ఆటో ఇమ్యూన్‍పై ఎందుకు పెరుగుతుంది, ఏం చేయాలనే అంశాలతో పాటు తన విషయాలను కూడా సమంత చెప్పారు. తన యూట్యూబ్ ఛానెల్‍లో ఈ ఎపిసోడ్‍ను అప్‍లోడ్ చేశారు.

ఆటో ఇమ్యూనిటీ సమస్య ఎక్కువగా ఎందుకొస్తుందనే సమంత ప్రశ్నకు అల్కేశ్ సమాధానం ఇచ్చారు. “శరీరంలోని టాక్సిక్‍లు (చెడు కారకాలు).. బయటికి వెళ్లే టాక్సిక్‍ల మధ్య సమతుల్యలత దెబ్బ తిన్నప్పుడు ఆటోఇమ్యూనిటీ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుత లైఫ్‍స్టైల్‍లో పర్యావరణానికి సంబంధించిన టాక్సిక్‍లు ఎక్కువగా ఉన్నాయి. కాస్మోటిక్స్, దుస్తులు, వంట సమాన్లతో పాటు చాలా విషయాలు ప్రభావం చూపిస్తాయి” అని అల్కేశ్ చెప్పారు.

నేను అలానే భావించా

చాలా మంది మంచి ఆహారం తింటూ బాగున్నామని, ఎలాంటి సమస్యలు రావని భావిస్తారని సమంత అన్నారు. తాను కూడా అలా అనుకున్నానని.. కానీ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు.

“నేను ఆరోగ్యంగా ఉన్నా.. నేను మంచి ఆహారం తింటున్నా. మంచి జీన్ ఉంది. ఇది నాకు జరగదు అని చాలా మంది అనుకుంటుంటారు. నేను కూడా వారిలో ఉన్నందుకు పశ్చాత్తాపడుతున్నా. ఎందుకంటే నేను త్వరగా నిద్ర లేచి వర్కౌట్స్ చేస్తా. నేను బాగా నవ్వుతా.. బాగా ఆరోగ్యకరమైన ఆహారం తింటా. ఇలా ఉంటూ కూడా తమకు ఏం కాదని అనుకునే వారికి ఏం చెబుతారు” అని అల్కేశ్‍ను అడిగారు సమంత.

ఒత్తిడి కూడా సమస్యేనా అని అడిగారు. ఒత్తిడి వల్ల కూడా ఆటో ఇమ్యూన్ సమస్య సమస్య వస్తుందని అల్కేశ్ తెలిపారు. నిద్రలో ఉన్న సమయంలోనూ రకరకాల ఆలోచనలతో ఒత్తిడికి లోనైతే ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుందని తెలిపారు. ఆటో ఇమ్యూనిటీ వ్యాధి కాదని, మేలు చేయాల్సిన వ్యాధినిరోధక వ్యవస్థ తిరిగి శరీరంపై అటాక్ చేస్తే ఏర్పడి సమస్యే అని చెప్పారు.

చెప్పిన జాగ్రత్తలు ఇవే

  • ఆరోగ్యకరమైన, శుభ్రమైన ఆహారం తీసుకుంటూ శరీరంలోకి చెడు కారకాలు తక్కువగా వెళ్లేలా చేసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు.
  • శుభ్రమైన, శుద్ధి చేసిన నీటిని తాగాలి.
  • డియోడ్రెంట్లు, మేకప్ కిట్లు లాంటి పర్సనల్ కేర్ ప్రొడక్టులు శుభ్రంగా ఉంటేనే వాడాలి. ఖరీదైనవి వాడుతున్నంత మాత్రాన అన్నీ మంచివని అర్థం కాదు.
  • ఇష్టమైన వారితో సమయం గడుపుతూ ఒత్తిడిని తగ్గించుకోండి. సరైన నిద్ర ఉండాలి. ఒత్తిడి లేకుండా నిద్రించాలి.

సినిమాల విషయానికి వస్తే.. సమంత ఇంకా ఏ కొత్త సినిమాకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. త్వరలోనే స్క్రిప్ట్స్ వినడం మొదలుపెడతారనే టాక్ ఉంది. సమంత చివరగా గతేడాది సెప్టెంబర్‌లో రిలీజైన ఖుషిలో కనిపించారు.

Whats_app_banner