Gaami Runtime: విశ్వక్‍సేన్ ‘గామి’ రన్‍టైమ్ ఇదే.. 'ఏ' సర్టిఫికేట్ ఎందుకో!-vishwak sen gaami movie gets a certificate from censor runtime details revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gaami Runtime: విశ్వక్‍సేన్ ‘గామి’ రన్‍టైమ్ ఇదే.. 'ఏ' సర్టిఫికేట్ ఎందుకో!

Gaami Runtime: విశ్వక్‍సేన్ ‘గామి’ రన్‍టైమ్ ఇదే.. 'ఏ' సర్టిఫికేట్ ఎందుకో!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 05, 2024 05:00 PM IST

Gaami Movie Runtime: గామి సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి అనూహ్యంగా ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ మూవీ రన్ టైమ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి.

Gaami Runtime: విశ్వక్‍సేన్ ‘గామి’ రన్‍టైమ్ ఇదే.. ఏ సర్టిఫికేట్ ఎందుకో!
Gaami Runtime: విశ్వక్‍సేన్ ‘గామి’ రన్‍టైమ్ ఇదే.. ఏ సర్టిఫికేట్ ఎందుకో!

Gaami Runtime, Censor: భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘గామి’ సినిమా రెడీ అవుతోంది. మరో మూడు రోజుల్లో మార్చి 8వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఎగ్జైట్ చేసింది. ఆసక్తిని ఆమాంతం పెంచేసింది. మాస్ కా దాస్‍గా పాపులర్ అయిన విశ్వక్‍సేన్ అఘోరగా ఈ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. గామి సినిమా సెన్సార్ పనులు నేడు పూర్తయ్యాయి.

రన్ టైమ్ ఇదే..

గామి సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. గామి సినిమా రన్ టైమ్ వివరాలు కూడా బయటికి వచ్చాయి. ఈ చిత్రం రన్‍టైమ్ 2 గంటల 26 నిమిషాలు (146 నిమిషాలు) ఉండనుంది. మోస్తరు నిడివితోనే ఈ చిత్రం వస్తోంది.

ఏ సర్టిఫికేట్ ఎందుకు?

గామి సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూవీ ట్రైలర్లో ఎలాంటి రక్తపాతం, అభ్యంతరకర సన్నివేశాలు ఏమీ లేవు. మరి ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఎందుకు అని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే, ఈ చిత్రంలో కొన్ని సెన్సిటివ్ అంశాలు ఉండే అవకాశం ఉందని, అందుకే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందో ఈ చిత్రం రిలీజ్ అయ్యాక స్పష్టంగా తెలియనుంది.

గామి చిత్రానికి విద్యాధర్ కగిట దర్శకత్వం వహించారు. సుమారు ఆరేళ్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించగా.. చాందినీ చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెద్ద, దయానంద్ రెడ్డి, శాంతి రావు, మయాంక్ పరాఖ్, జాన్ కొటోలీ, బొమ్మ శ్రీధర్ కీలకపాత్రల్లో నటించారు. మానవ స్పర్శతో తనకు ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు ఓ వ్యక్తి చేసే సాహసోపేత ప్రాణమే గామి సినిమా ప్రధాన అంశంగా ఉండేలా కనిపిస్తోంది. మరిన్ని సామాజిక అంశాలు కూడా ఉంటాయని ట్రైలర్‌తో అర్థమైంది.

గామి సినిమాపై హీరో విశ్వక్‍సేన్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతి కలిగించి, మెప్పిస్తుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍తో పాటు తన ఇంటర్వ్యూలో చెబుతూ వస్తున్నారు. హిమాలయాల్లోనూ ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా చేశారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో కాళ్లు, చేతులు కూడా గడ్డకట్టిపోయేవని విశ్వక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నగరానికి ఏమైంది చిత్రానికి కంటే ముందే గామి మొదలైందని చెప్పారు. గామి కోసం తాను రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని వెల్లడించారు.

గామి ట్రైలర్లో విజువల్స్, వీఎఫ్‍ఎక్స్, సినిమాటోగ్రఫీ చాలా మెప్పించాయి. తక్కువ బడ్జెట్‍లోనే హైక్వాలిటీ గ్రాఫిక్స్‌ను మూవీ టీమ్ సాధించింది. ఈ సినిమాపైనే ఆరేళ్లుగా పని చేస్తున్నారు దర్శకుడు విద్యాధర్. ఈ చిత్రానికి నరేశ్ కుమారన్ సంగీతం అందించగా.. విశ్వనాథ్ రెడ్డీ సీహెచ్ సినిమాటోగ్రఫీ చేశారు.

గామి చిత్రం నుంచి శివమ్ అనే సాంగ్ సోమవారమే వచ్చింది. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ పాటను ఆలపించారు.

Whats_app_banner