Tamanna Raashi Khanna: హారర్ మూవీలో తమన్నా రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్.. పంచుకో అంటున్న హీరోయిన్స్-tamanna raashi khanna panchuko song released from baak movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamanna Raashi Khanna: హారర్ మూవీలో తమన్నా రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్.. పంచుకో అంటున్న హీరోయిన్స్

Tamanna Raashi Khanna: హారర్ మూవీలో తమన్నా రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్.. పంచుకో అంటున్న హీరోయిన్స్

Sanjiv Kumar HT Telugu
Apr 15, 2024 06:19 AM IST

Tamanna Raashi Khanna Panchuko Song Baak: ముద్దుగుమ్మలు తమన్నా, రాశీ ఖన్నా ఒకే పాటలో ఇద్దరూ అదిరిపోయే గ్లామర్ షో చేశారు. హారర్ మూవీ బాక్‌లో పంచుకో అనే పాటకు ఇద్దరు కలిసి అదిరిపోయే స్టెప్పులతో పాటు హాట్‌గా అందాల విందు చేశారు.

హారర్ మూవీలో తమన్నా రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్.. పంచుకో అంటున్న హీరోయిన్స్
హారర్ మూవీలో తమన్నా రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్.. పంచుకో అంటున్న హీరోయిన్స్

Tamanna Raashi Khanna Baak Panchuko: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా ఇప్పటివరకు పలు ఐటమ్ సాంగ్స్ చేసి అలరించిన విషయం తెలిసిందే. తాజాగా తమన్నాతోపాటు బొద్దుగుమ్మ రాశీ ఖన్నా కూడా జత కట్టి మరి స్పెషల్ సాంగ్ చేసింది. అది కూడా ఓ హారర్ మూవీలో. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హార్రర్ కామెడీ మూవీ బాక్.

తమిళ సినీ ఇండస్ట్రీలో భారీగా విజయాన్ని అందుకున్న హారర్ కామెడీ సిరీస్ అరణ్‌మనై. ఈ సిరీస్ నుంచి నాల్గవ చిత్రంగా అరణ్‌మనై 4 వస్తోంది. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేస్తున్నారు. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఇటీవల మేకర్స్ ఈ సినిమాలోని అన్ని ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అలా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. తాజాగా ఏప్రిల్ 14న బాక్ సినిమా నుంచి 'పంచుకో'అనే పూర్తి సాంగ్‌తో వచ్చారు. కోలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ పాప్ తమిళ కొన్ని లవ్లీ బీట్‌లతో ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేశారు. సాహితీ ఫన్నీ లిరిక్స్ రాస్తే, రాఘవి హస్కీ వాయిస్ మెస్మరైజ్ చేస్తోంది. తమన్నా, రాశీఖన్నాల గ్లామర్‌ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దింది.

తమన్నా, రాశీ ఖన్నా గ్రేస్ ఫుల్ మూమెంట్స్, ముఖ్యంగా హిప్ మూమెంట్స్ చూడటానికి అభిమానులకు సూపర్ ట్రీట్‌గా ఉంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, హీరోయిన్స్ ఇద్దరూ హాట్ అందాలతో అదరగొట్టారు. అలాగే సాంగ్‌లో సినిమాలోని కొన్ని ఎగ్జయిటింగ్, హారర్ సన్నివేశాలను కూడా చూపించారు. ఈ పాట చూస్తే ఒక ఐటమ్ లేదా స్పెషల్ నెంబర్‌లా ఉంది.

పంచుకో అంటూ తమన్నా, రాశీ ఖన్నా వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. కాగా ఈ సినిమాను అవ్నీ సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

ఏప్రిల్ 26న 'బాక్ ' సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్. ఇదిలా ఉంటే, ఇదివరకు తమన్నా పలు ఐటమ్ సాంగ్స్ చేసింది. కానీ, రాశీ ఖన్నా ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయలేదు.

ఇక తమన్నా, రాశీ ఖన్నా ఇదివరకు కలిసి నటించిన సినిమా రవితేజ బెంగాల్ టైగర్. ఈ మూవీలో ఒక పాటలో రవితేజతో కలిసి తమన్నా, రాశీ ఖన్నా స్టెప్పులు వేస్తారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు ఏ హీరో లేకుండా వీరిద్దరే అదిరిపోయే గ్లామర్ షోతో పంచుకో అనే పాటకు హాట్ ట్రీట్ అందించారు

IPL_Entry_Point