Tamanna: సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో తమన్నా.. శివానీగా భయపెట్టనున్న మిల్కీ బ్యూటి-tamanna first look released from baak movie and sundar c first look out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamanna: సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో తమన్నా.. శివానీగా భయపెట్టనున్న మిల్కీ బ్యూటి

Tamanna: సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో తమన్నా.. శివానీగా భయపెట్టనున్న మిల్కీ బ్యూటి

Sanjiv Kumar HT Telugu
Apr 11, 2024 06:38 AM IST

Baak Movie Tamanna First Look: మిల్కీ బ్యూటి తమన్నా, తమిళ డైరెక్టర్ అండ్ హీరో సుందర్ సి నటిస్తున్న సినిమా బాక్. ఈ సినిమా నుంచి తమన్నా, సుందర్ సి ఫస్ట్ లుక్ పోస్టర్‌లను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో తమన్నా.. శివానీగా భయపెట్టనున్న మిల్కీ బ్యూటి
సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో తమన్నా.. శివానీగా భయపెట్టనున్న మిల్కీ బ్యూటి

Tamanna Baak First Look: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా నటిస్తున్న సరికొత్త చిత్రం బాక్. అవ్ని సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తమిళంలో నిర్మిస్తున్న ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ సమర్పణలో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ ఏప్రిల్‌ నెలలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాక్ సినిమా నుంచి తాజాగా తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

బాక్ మూవీలో శివానీగా తమన్నా భాటియా నటిస్తుండగా.. శివ శంకర్‌గా సుందర్ సి చేస్తున్నారు. అయితే, 'అరణ్మనై' అనేది తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ. తెలుగులో విడుదలైన ఈ ఫ్రాంచైజీ అన్ని వెర్షన్లు హిట్ అయ్యాయి. ఈ హారర్-కామెడీ సిరీస్ నాలుగో సినిమాగా తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు.

ఈ చిత్రంలో సుందర్ సి హీరోగా నటిస్తుండగా, తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే వీరితోపాటు వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌లను మేకర్స్ రివీల్ చేయడంతో తెలుగు ప్రమోషన్స్ మొదలయ్యాయి. తమన్నాని శివానిగా పరిచయం చేసారు. ఆమె సాంప్రదాయ గెటప్‌లో కనిపిస్తుంది. సుందర్ సి శివశంకర్‌గా పరిచయం కాగా, అతని క్యారెక్టర్ పోస్టర్‌లో అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు.

రెండు పోస్టర్లు బాక్‌లో కొన్ని స్పైన్ -చిల్లింగ్ ఎలిమెంట్‌‌తో ఆకట్టుకున్నాయి. ఇక హిప్ పాప్ తమిళ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఏపీ, తెలంగాణ లో భారీ విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి సూపర్ హిట్ హారర్ కామెడీ సిరీస్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఫ్రాంచైజీలో తమన్నా నటిస్తుండటంతో బాక్‌పై క్యూరియాసిటీ కలుగుతోంది. మరి ఈ సినిమాలో తమన్నా భయపెట్టనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా ఈ ఫ్రాంచైజీలో హీరోయిన్లు సూపర్ నాచురల్ పవర్స్ కారణంగా వింతగా ప్రవర్తిస్తూ భయపెడుతుంటారు. మరి ఇందులో తమన్నా ఎలా భయపెట్టనుందో చూడాలి.

ఇదిలా ఉంటే, తమన్నా హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటి 19 ఏళ్లుగా దక్షిణ చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. ప్రస్తుతం సౌత్‌తోపాటు నార్త్ సినిమాలు, వెబ్ సిరీసులతో కూడా తెగ బిజీగా ఉంది. 

ఇటీవలే తమన్నా జైలర్, భోళా శంకర్ మూవీస్‍తోపాటు లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా, ఆఖరీ సచ్ వెబ్ సిరీసులతో నెట్టింట్లో బీభత్సంగా వైరల్ అయింది. ఇక తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కొనసాగిస్తుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. 

ఈ ఇద్దరు ఇప్పటికీ చాలా సార్లు కలిసి కెమెరాలకు చిక్కారు. ఇటీవల కూడా కెమెరామెన్ లను చూసి తమన్నా, విజయ్ షాక్ అయిన ఫొటోలు, వీడియోలు, నెట్టింట్లో వైరల్ అయ్యాయి. 

IPL_Entry_Point