Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..
Romeo OTT Release Date: రోమియో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. విజయ్ ఆంటోనీ హీరోగా చేసిన కామెడీ డ్రామాకు స్ట్రీమింగ్ డేట్ వెల్లడైంది. ఆ వివరాలు ఇవే.
Romeo OTT Release Date: రోమియో సినిమా రిలీజ్‍కు ముందు మంచి బజ్ తెచ్చుకుంది. ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉండటంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తమిళ హీరో విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి హీరోహీరోయిన్లుగా నటించిన రోమియో మూవీ ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగులో లవ్ గురు పేరుతో విడుదలైంది. అయితే, థియేటర్లలో అంచనాలను రోమియో చిత్రం అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేదు. ఈ తరుణంలో ఈ చిత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
రోమియో సినిమా మే 10వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ నేడు (మే 4) అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ మూవీ తెలుగు వెర్షన్ లవ్ గురు గురించి ఇంకా అప్‍డేట్ ఇవ్వలేదు.
నెలలోపే..
రోమియో చిత్రం మే 10న ప్రీమియర్ అవుతుందని ఆహా తమిళ్ నేడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో రిలీజైన నెలలోగానే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఏప్రిల్ 11న రోమియో థియేటర్లలో రిలీజ్ కాగా.. మే 10న ఆహా తమిళ్‍లోకి వస్తోంది. మే 3నే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుందని గతంలో అంచనాలు రాగా.. వారం ఆలస్యంగా అడుగుపెడుతోంది.
తెలుగు ఎప్పుడో! మరో ఓటీటీ వద్ద కూడా హక్కులు
రోమియో తెలుగు వెర్షన్ ‘లవ్ గురు’ సినిమా కూడా మే 10వ తేదీన ఆహా తెలుగు ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి. అయితే, ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే అప్‍డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే, రోమియో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వద్ద కూడా ఉన్నాయి. దీంతో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో కూడా వస్తుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది. లవ్ గురు ఏ ఓటీటీలో వస్తుందో చూడాలి. ఈ విషయంలో అతిత్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేసిన విజయ్ ఆంటోనీ కాస్త పంథా మార్చుకొని రొమాంటిక్ కామెడీ డ్రామా జానర్‌లో రోమియో చిత్రం చేశారు. ఈ సినిమాలో ఆయన నటన కూడా ఆకట్టుకుంది. భార్య ప్రేమను పొందేందుకు తంటాలు పడే భర్తగా ఆయన నటన మెప్పించింది. హీరోయిన్ మృణాళిని రవి యాక్టింగ్ కూడా భేష్ అనిపించుకుంది. ఈ సినిమా కోసం ప్రమోషన్లను కూడా గట్టిగానే చేశారు విజయ్ ఆంటోనీ. తెలుగు వెర్షన్ లవ్ గురు కోసం కూడా ప్రమోషన్లను జోరుగా చేశారు. అయితే, మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్న రేంజ్‍లో ఈ మూవీ వసూళ్లను రాబట్టలేకపోయింది.
రోమియో చిత్రాన్ని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ కోసం ఆయన రాసుకున్న కథ కొత్తగా అనిపించలేదని ప్రేక్షకుల నుంచి రియాక్షన్స్ వచ్చాయి. ఎంటర్‌టైన్‍మెంట్ ఉన్నా కొత్తదనం లేదనే కామెంట్లు వచ్చాయి. దీంతో థియేటర్లలో సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయింది ఈ చిత్రం.
రోమియో చిత్రంలో విజయ్ ఆంటోనీ, మృణాళినితో పాటు వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్, సుధ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్, రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు.