Love Guru Premiere Reviews: విజయ్ ఆంటోనీ ‘లవ్ గురు’ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందంటే!
Love Guru Premiere Reviews: లవ్ గురు సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆలోగానే ప్రీమియర్లను మూవీ టీమ్ ప్రదర్శిచింది. దీంతో ఈ సినిమాపై కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ చిత్రానికి రెస్పాన్స్ ఎలా ఉందంటే..
Love Guru Premiere Reviews: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ సినిమా రోమియో.. తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లను కూడా విజయ్ జోరుగా చేశారు. భార్యభర్తల మధ్య ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన లవ్ గురు సినిమా ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగులో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. కాగా, రిలీజ్‍కు ముందే ప్రీమియర్ షోలను మూవీ టీమ్ ప్రదర్శించింది. దీంతో లవ్ గురు మూవీ టాక్ బయటికి వచ్చేసింది.

తానంటే ఇష్టపడని భార్యను దగ్గర చేసుకునేందుకు తంటాలు పడే భర్త పాత్రలో లవ్ గురు చిత్రంలో నటించారు విజయ్ ఆంటోనీ. ఈ మూవీలో మృణాళిని రవి హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రానికి ప్రీమియర్ల తర్వాత పాజిటివ్ టాక్ వస్తోంది. ఫన్, సెంటిమెంట్‍తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఉందనే రెస్పాన్స్ వస్తోంది.
ఎంటర్‌టైనింగ్‍గా..
లవ్ గురు సినిమా కథ కొత్తదేం కాకపోయినా.. కామెడీ, డ్రామా ఆకట్టుకునేలా ఉందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ సమ్మర్‌లో మంచి ఎంటర్‌టైనర్‌గా వచ్చిందని, ఫ్యామిలీతో కలిసి చూసేందుకు సూటవుతుందని అభిప్రాయపడుతున్నారు. తనకు దర్శకుడిగా తొలి చిత్రమే అయినా వినాయకన్ ఈ మూవీని బాగా తెరకెక్కించారనే ప్రశంసలు వస్తున్నాయి.
లవ్ గురు చిత్రాన్ని మంచి రిలేషన్‍షిప్ డ్రామాగా.. పర్‍ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారని, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్ కూడా బాగా పండిందని ఈ మూవీ చూసిన కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు.
లవ్ గురు చిత్రంలో విజయ్ ఆంటోనీ, మృణాళిని పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయిందనే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా భార్యను దగ్గర చేసుకునేందుకు విజయ్ చేసే ప్రయత్నాలతో బాగా ఫన్ జనరేట్ అయిందని, ఎమోషన్ కూడా ఈ మూవీలో ఉందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఓవరాల్‍గా లవ్ గురు చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
థియేటర్లలో పూర్తిస్థాయిలో రిలీజయ్యాక కూడా పాజిటివ్ టాక్ కొనసాగితే ‘లవ్ గురు’ చిత్రం మంచి వసూళ్లను దక్కించుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వేసవి సెలవులు కావడం, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడం ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. బిచ్చగాడు మూవీతో తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న విజయ్ ఆంటోనీ.. ఆ తర్వాత ఆ రేంజ్‍లో సక్సెస్ చూడలేదు. లవ్ గురుపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రమోషన్లను దూకుడుగా చేశారు. ప్రీమియర్ షోలకు కూడా హాజరై అభిమానుల రెస్పాన్స్ తెలుసుకున్నారు.
లవ్ గురు మూవీ గురించి..
లవ్ గురు సినిమాలో విజయ్ ఆంటోనీ, మృణాళినితో పాటు యోగిబాబు, వీటీవీ గణేశ్, ఇళవరసు, తలైవాసల్ విజయ్, సుధ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వినాయకన్ దర్శకత్వం వహించగా.. భరత్ ధనశేఖర్ సంగీతం అందించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానరే ఈ చిత్రాన్ని నిర్మించింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన తమిళం, తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది.