GMV OTT Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?-geethanjali malli vachindi ott streaming on aha official ott release announcement anjali srinivas reddy sunil aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gmv Ott Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

GMV OTT Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
May 06, 2024 11:19 AM IST

Geethanjali Malli Vachindi OTT Official Release: తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారింది. మొన్నటివరకు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరిగింది. కానీ, దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.

మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?
మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Geethanjali Malli Vachindi OTT Release: బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి, కమెడియన్ శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా గీతాంజలి. 2014లో బ్లాక్ బస్టర్ హారర్ కామెడీగా హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిందే గీతాంజలి మళ్లీ వచ్చింది. అంజలి సినీ కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

డైరెక్టర్‌గా పరిచయం

కామెడీ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు శివ తూర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీతో ఆయన టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మాతలుగా వ్యవహరించారు. కథ, స్క్రీన్ ప్లేను కోన వెంకట్ అందించారు.

కలెక్షన్ల రూపంలో

ఈ సినిమాలో అంజ‌లి, శ్రీనివాస్ రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, సునీల్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ త‌దిత‌రులు పాత్రలు పోషించి కామెడీ పండించారు. అయితే, ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

ఓటీటీ అధికారిక ప్రకటన

అయితే, నెల కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేయనుందని ప్రచారం జోరుగా సాగింది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మే 10 నుంచి గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఆహా ఓటీటీలో

ముందుగా ప్రచారం జరిగినట్లు అమెజాన్ ప్రైమ్‌లో కాకుండా వేరే ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది డిజిటల్ ప్రీమియర్ కానుంది. అదే అచ్చ తెలుగు ఓటీటీ ఆహా. అంతేకాకుండా రిలీజ్ డేట్ కూడా మారిపోయింది. ఆహాలో మే 8 నుంచే ఈ హారర్ కామెడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయంపై తాజాగా ట్విటర్‌లో పోస్ట్ షేర్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది ఆహా టీమ్.

రెండు రోజుల ముందుగానే

అంటే ప్రచారం జరిగిన డేట్ కంటే రెండు రోజుల ముందుగానే ఆహాలోకి గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా వచ్చేయనుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో ఎంచక్కా ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. కాగా ఇందులో సునీల్, సత్య కామెడీ చాలా బాగా వర్కౌట్ అయిందని ప్రశంసలు వచ్చాయి.

రొటీన్ కామెడీ

అయితే రెగ్యులర్ రొటీన్ కాన్సెప్ట్, టేకింగ్, కామెడీతో సినిమాను తెరకెక్కించారని టాక్ వచ్చింది. కానీ, ఇదివరకు వచ్చిన గీతాంజలి సినిమా టైప్ కామెడీ ఇష్టపడేవారికి ఈ సీక్వెల్ మూవీ నచ్చుతుందని పలు రివ్యూలు తెలిపాయి. అనేక మంది నటీనటులతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

గేమ్ చేంజర్ సినిమాలో

ఇదిలా ఉంటే, హీరోయిన్ అంజలి ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానితోపాటు మరో హీరోయిన్‌గా అంజలి చేస్తోంది. ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్ తండ్రి పాత్రకు భార్యగా అంజలి నటిస్తోందని టాక్.