Rashmika Mandanna on Pushpa 2: పుష్ప-2 గురించి అప్డేట్ ఇచ్చిన రష్మిక.. పుష్ప కోసం రెడీ అయిన శ్రీవల్లీ
Rashmika Mandanna on Pushpa 2: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పుష్ప-2 సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని తెలియజేసింది. మరో రెండు రోజుల్లో తాను ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు స్పష్ట చేసింది.
Rashmika about pushpa 2: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్‌గా మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీలో అన్నింట్లోనూ వరుసగా చిత్రాలు చేస్తూ తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ ఇప్పటికే.. అక్కడ కొన్ని చిత్రాలను కంప్లీట్ చేసింది కూడా. వీటిల్లో భాగంగా ఆమె నటించిన తాజా బాలీవుడ్ చిత్రం గుడ్ బై. అమితాబ్ బచ్చన్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా రష్మిక కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇందులో భాగంగా పుష్ప-2 సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చింది.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తాన పాజిటివ్ పర్సన్ అని.. అందరూ నెగిటివిటీకి దూరంగా ఉండాలని రష్మిక స్పష్టం చేసింది. ఈ ప్రపంచ మొత్తం పాజిటివిటీతో నిండిపోవాలని ఆశాభావం వ్యక్తం చేసింది. "నేను ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా ఆలోచిస్తా. అందరూ నెగిటివిటీకి దూరంగా ఉండాలి. ఈ సినిమాలో అమితాబ్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మరో రెండు రోజుల్లో నేను పుష్ప-2 సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నా." అని రష్మికా మందన్నా స్పష్టం చేసంది.
గుడ్ బై సినిమాలో రష్మికా మందన్నాకు అమితాబ్ తండ్రిగా కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఫీల్ గుడ్ మూవీ జోనర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబరు 7న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సకుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుందని చిత్రబృందం స్పష్టం చేసింది.
ప్రస్తుతం రష్మికా మందన్నా గుడ్ బై చిత్రం పూర్తి చేసింది. ఇది కాకుండా హిందీలో మిషన్ మజ్నూ చిత్రాన్ని కంప్లీట్ చేయగా.. యానిమల్ అనే మరో చిత్రంలో నటిస్తోంది. తెలుగులో పుష్ప-2 సినిమాలో చేస్తోంది. ఇది కాకుండా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి నటిస్తోన్న వారసుడు చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది.
సంబంధిత కథనం