Sukumar Remuneration: పుష్ప 2 కోసం సుకుమార్ అంత భారీ మొత్తం డిమాండ్ చేశాడా?
Sukumar Remuneration: పుష్ప 2 కోసం డైరెక్టర్ సుకుమార్ భారీ మొత్తం డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సీక్వెల్ ప్రొడక్షన్‌లో ఇప్పుడు సుకుమార్ సంస్థ కూడా భాగమైంది.
Sukumar Remuneration: ఇండియన్ సినిమాలో రాజమౌళి రేంజ్ ఇప్పుడు అందరికీ తెలుసు. టాప్ హీరోలతో సమానంగా అతడు సుమారు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరిపోయాడు. అతడే కాదు ఇప్పుడు సుకుమార్ రేంజ్ కూడా పెరిగిపోయింది. పుష్ప ద రైజ్ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించడంతోపాటు పాన్ ఇండియా లెవల్లో రూ.400 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టింది.
దీంతో పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లే అటు హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కూడా తమ రెమ్యునరేషన్లు భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ అయితే ఈ సీక్వెల్ కోసం రూ.100 కోట్ల వరకూ అందుకోబోతున్నట్లు తేలగా.. తాజాగా సుకుమార్ కూడా రూ.50 కోట్లు డిమాండ్ చేశాడట. ఓ డైరెక్టర్‌కు ఇంత భారీ మొత్తం అంటే మాటలు కాదు.
అయితే పుష్ప హిట్ తర్వాత సుకుమార్‌పై నమ్మకం ఉంచి మేకర్స్.. దానికి ఓకే చెప్పారు. అయితే ఇంత మొత్తం నేరుగా ఇవ్వలేక సుకుమార్‌ను మూవీ ప్రొడక్షన్‌లో భాగం చేశారు. దీంతో పుష్ప 2లో సుకుమార్ రైటింగ్స్ కూడా చేరింది. అంటే ఇప్పుడీ సినిమా లాభాల్లో సుకుమార్‌కు కూడా వాటా దక్కనుంది. దీనికితోడు అతనికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఎలాగూ ఉంటుంది.
పుష్ప ద రైజ్ హిట్ తర్వాత పుష్ప ద రూల్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఆ లెక్కన పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం (ఆగస్ట్ 22) హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్‌న్యూసే.
సంబంధిత కథనం