Pushpa 2 Begins: పుష్ప 2 మొదలైంది.. పూజా కార్యక్రమాలకు అల్లు అర్జున్‌ మిస్‌-pushpa 2 pooja ceremonies begin as allu arjun missing from the action ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Begins: పుష్ప 2 మొదలైంది.. పూజా కార్యక్రమాలకు అల్లు అర్జున్‌ మిస్‌

Pushpa 2 Begins: పుష్ప 2 మొదలైంది.. పూజా కార్యక్రమాలకు అల్లు అర్జున్‌ మిస్‌

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 10:32 AM IST

Pushpa 2 Begins: అల్లు అర్జున్‌ మచ్‌ అవేటెడ్‌ మూవీ పుష్ప ద రూల్‌ సందడి మొదలైంది. ఆదివారం అనౌన్స్‌ చేసినట్లుగానే సోమవారం(ఆగస్ట్‌ 22) ఉదయమే మేకర్స్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పుష్ప 2 పూజా కార్యక్రమాలు ప్రారంభం
పుష్ప 2 పూజా కార్యక్రమాలు ప్రారంభం (twitter)

అల్లు అర్జున్‌ పుష్ప ద రైజ్‌ దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఓ ఊపు ఊపేసింది. తెలుగుతోపాటు హిందీ బెల్ట్‌లోనూ బన్నీ నటనకు నీరాజనాలు పట్టారు. ఈ మూవీ సీక్వెల్‌ కూడా ఉందని ముందే ప్రకటించడంతో అది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మూవీ అప్‌డేట్స్‌ గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మొత్తానికి పుష్ప 2 ప్రారంభమైంది. సోమవారం (ఆగస్ట్‌ 22) ఉదయం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌ అవుతోంది. డైరెక్టర్‌ సుకుమార్‌ పూజ నిర్వహించారు. పుష్ప 2 ద రూల్‌ అని పూలతో అందంగా డెకొరేట్‌ చేసిన బ్యానర్‌ ముందు దేవుడి చిత్రపటాలు ఉంచి పూజలు నిర్వహించారు.

అయితే ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ రాలేదు. అతడు ఇండియా డే పరేడ్‌లో పాల్గొనడానికి న్యూయార్క్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి రావడం ఆలస్యం కావడంతో బన్నీ ఈ ముహూర్తానికి మిస్సయ్యాడు. చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా సోమవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారమే మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

గతేడాది డిసెంబర్‌లో రిలీజైన పుష్ప దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగింది. ఫస్ట్‌ పార్ట్‌లో ఈ ఎర్రచందనం కూలీల్లో ఒకడిగా పక్కా మాస్‌ క్యారెక్టర్‌లో అర్జున్‌ అదరగొట్టాడు. తగ్గేదే లే అన్న అతని మేనరిజం, శ్రీవల్లి సాంగ్‌లో బన్నీ వెరైటీ స్టెప్పులు తెగ పాపులర్‌ అయ్యాయి. గల్లీలోని మాస్‌ ఫ్యాన్స్‌ నుంచి పెద్ద పెద్ద స్టార్ల వరకూ ఏదో ఓ సందర్భంలో వీటిని ఫాలో అయిన వాళ్లే.

టీ20 వరల్డ్ కప్ 2024