Allu Arjun: న్యూయార్క్ వీధుల్లో త్రివర్ణ పతాకంతో అల్లు అర్జున్.. ఫొటోలు వైరల్
Allu Arjun: న్యూయార్క్‌లో సందడి చేస్తున్నాడు టాలీవుట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా అక్కడ జరిగిన ఇండియా డే పరేడ్‌లో త్రివర్ణ పతాకం పట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నాడు.
పుష్ప 2 షూటింగ్ ప్రారంభానికి ముందు భార్య స్నేహతో కలిసి న్యూయార్క్ వెళ్లిన అల్లు అర్జున్.. అక్కడ బిజీబిజీగా గడుపుతున్నాడు. తాజాగా అక్కడ జరిగిన ఇండియా డే పరేడ్‌లో వేల మంది భారతీయులతో కలిసి పాల్గొన్నాడు. ఓ ఓపెన్‌టాప్ వెహికిల్‌లో భార్యతో కలిసి నిల్చొన్న అర్జున్.. చేతిలో తిరంగాతో కనిపించాడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పరేడ్‌లో పాల్గొనడానికే మూడు రోజుల కిందట అల్లు అర్జున్ న్యూయార్క్ వెళ్లాడు. అప్పుడు అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో అతడు కనిపించిన వీడియో కూడా చాలా వైరల్ అయింది. అక్కడి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ ఇండియా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిర్వహించిన ఈ పరేడ్‌లో అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
అంతకుముందు అతడు న్యూయార్క్ మేయర్‌ను కూడా కలిశాడు. ఈ ఫొటోలను తన ట్విటర్‌లో షేర్ చేశాడు. పుష్పలోని తగ్గేదే లే మేనరిజాన్ని ఈ సందర్భంగా మేయర్ కూడా అర్జున్‌తో కలిసి చూపించడం విశేషం. న్యూయార్క్‌లో జరగబోతున్న 40వ ఇండియా డే పరేడ్‌కు వచ్చినందుకుగాను ప్రత్యేక గుర్తింపుగా ఓ ప్రశంసా పత్రాన్ని కూడా ఈ సందర్భంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్.. అల్లు అర్జున్‌కు అందించారు.
మరోవైపు పుష్ప 2 షూటింగ్ ప్రారంభంపై ఆదివారం మేకర్స్ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారమే (ఆగస్ట్ 22) ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. న్యూయార్క్‌లో పరేడ్ ముగించుకొని వచ్చిన బన్నీ.. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నాడు. చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఇదే రోజు సినిమా మొదలుపెట్టడం బాగుంటుందని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.