Mahesh Babu: సందీప్ వంగా వ‌ర్సెస్ సుకుమార్‌... మ‌హేష్ బాబు 30వ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌రు-sandeep vanga or sukumar who will direct mahesh babu 30th film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: సందీప్ వంగా వ‌ర్సెస్ సుకుమార్‌... మ‌హేష్ బాబు 30వ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌రు

Mahesh Babu: సందీప్ వంగా వ‌ర్సెస్ సుకుమార్‌... మ‌హేష్ బాబు 30వ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌రు

Nelki Naresh Kumar HT Telugu
Jun 23, 2022 08:11 AM IST

మ‌హేష్‌బాబు (mahesh babu) 30వ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు ప‌లువురు టాప్ డైరెక్ట‌ర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. వారు ఎవ‌రంటే...

మ‌హేష్‌బాబు
మ‌హేష్‌బాబు (twitter)

గ‌తంలో ఓ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే మ‌రో చిత్రానికి క‌మిట్‌మెంట్ ఇచ్చేవారు స్టార్ హీరోలు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయింది. ఓ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే నాలుగైదు చిత్రాల‌ను అంగీక‌రిస్తున్నారు. స్పీడు పెంచుతున్నారు. మ‌హేష్‌బాబు కూడా అదే ప‌నిలో ఉన్నారు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేస్తున్నారు మ‌హేష్‌బాబు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమా జూలైలో ప్రారంభంకానుంది.

త్రివిక్ర‌మ్(trivikram) చిత్రం పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్‌బాబు-రాజ‌మౌళి సినిమా సెట్స్‌పైకిరానుంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఇది మొద‌లుకానుంది. రాజ‌మౌళి(rajamouli) సినిమా త‌ర్వాత మ‌హేష్‌బాబు చేయ‌నున్న తదుపరి చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ చిత్ర దర్శకుడిగా అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో పాటు సుకుమార్(sukumar) పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌హేష్‌బాబు 30వ సినిమాకు వీరిద్ద‌రిలో ఒక‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

వీరితో పాటు కొర‌టాల శివ(koratala shiva) ఈ లిస్ట్ లో ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌తంలో సుకుమార్ తో వ‌న్ నేనొక్క‌డినే సినిమా చేశారు మ‌హేష్ బాబు. మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను చిత్రాలు రూపొందాయి. ఎస్ఎస్ఎమ్ బీ 30 సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం ఇటీవ‌లే మ‌హేష్‌బాబుకు వారు యాభై కోట్ల అడ్వాన్స్‌ల‌ను అంద‌జేసిన‌ట్లు చెబుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం