తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Release In English: ఇంగ్లీష్‌లోకి డ‌బ్ అవుతోన్న తొలి క‌న్న‌డ సినిమాగా కాంతార రికార్డ్

Kantara Release In English: ఇంగ్లీష్‌లోకి డ‌బ్ అవుతోన్న తొలి క‌న్న‌డ సినిమాగా కాంతార రికార్డ్

12 February 2023, 16:15 IST

  • Kantara Release In English: రిష‌బ్ శెట్టి కాంతార సినిమాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోకి డ‌బ్అవుతోంది. ఇంగ్లీష్ వెర్ష‌న్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

కాంతార
కాంతార

కాంతార

Kantara Release In English: రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన కాంతార సినిమా గ‌త ఏడాది ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవ‌లం 16 కోట్ల వ్య‌యంతో రూపొందిన ఈ సినిమా 400 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ది. కేజీఎఫ్ 2 త‌ర్వాత క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమా కాంతార కావ‌డం కావ‌డం గ‌మ‌నార్హం.

ట్రెండింగ్ వార్తలు

Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

క‌న్న‌డంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లో కాంతార‌ స్ట్రెయిట్ సినిమాల‌కు ధీటుగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది తెలుగులో రెండు కోట్ల‌తో రిలీజ్ చేస్తే యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న కాంతార సినిమా త్వ‌ర‌లోనే ఇంగ్లీష్‌లో రిలీజ్ కానుంది. '

ఓటీటీలో ల‌భిస్తోన్న ఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను ఇంగ్లీష్‌లోకి మేక‌ర్స్ డ‌బ్ చేయ‌బోతున్నారు. ఇంగ్లీష్ డ‌బ్బింగ్ వెర్ష‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 1 రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌లోకి డ‌బ్ కానున్న తొలి కన్నడ సినిమాగా కాంతార రికార్డ్ క్రియేట్ చేయ‌నుంది.

కాంతార సినిమాలో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు రిష‌బ్ శెట్టి. భూత‌కోళ అనే క‌ళ‌కు రివేంజ్ డ్రామాను జోడించి ఈ సినిమా రూపొందింది. త‌మ భూమిని ఆక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన పెద్ద‌ల‌పై దేవుడి స‌హాయంతో శివ అనే యువ‌కుడు ఎలాంటి పోరాటాన్ని సాగించాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

కాంతార సినిమాలో స‌ప్త‌మి గౌడ‌,కిషోర్‌, అచ్యుత్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.కాంతార సినిమాకు ప్రీక్వెల్ రూపొందించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే రిష‌బ్‌శెట్టి ప్ర‌క‌టించాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.