Urvashi Rautela In Kantara 2: కాంతార -2 లో వాల్తేర్ వీరయ్య బ్యూటీ - గాసిప్ అంటూ షాకిచ్చిన సినిమా యూనిట్
Urvashi Rautela In Kantara 2:కాంతార -2 సినిమాలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా లీడ్ రోల్‌లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరో రిషబ్ శెట్టితో ఊర్వశి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Urvashi Rautela In Kantara 2: గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దక్షిణాది సినిమాల్లో కాంతార ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండియా వైడ్‌గా 400 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో రిషబ్ శెట్టి నటనకు ప్రశంసలు దక్కాయి.
కాంతార సినిమాకు ప్రీక్వెల్‌ను రూపొందించబోతున్నట్లు ఇటీవలే హీరో రిషబ్ శెట్టితో పాటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. కాగా ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శనివారం హీరో రిషబ్ శెట్టితో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఊర్వశి రౌటేలా.
కాంతార 2 లోడింగ్ అంటూ ఈ ఫొటోను ఉద్దేశించి క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంతార ప్రీక్వెల్‌లో ఊర్వశి రౌటేలా నటిస్తోన్నట్లు ప్రచారం మొదలైంది.
అవన్నీ పుకార్లేనన్నసినిమా యూనిట్
ఊర్వశి రౌటేలా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు వస్తోన్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులు జరుగుతోన్నట్లు తెలిపింది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు ఎవరిని ఫైనలైజ్ చేయలేదని వెల్లడించింది.
హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధులను ఊర్వశి కలిసినట్లు తెలసింది. ఆ సమయంలోనే రిషబ్ శెట్టితో ఆమె ఫొటో దిగిందని అంటున్నారు. ఇటీవలే వాల్తేర్ వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది ఊర్వశి రౌటేలా. ఈ పాటతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.