తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Sanjiv Kumar HT Telugu

05 May 2024, 8:23 IST

google News
  • Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్‌లలో ఏం జరగనుందనేది ప్రోమోల్లో చూస్తే..

ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ
ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కేర్ సెంటర్‌కు వెళ్లిన కావ్య అక్కడ రాజ్ తీసుకొచ్చిన బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకుంటుంది. రాజ్, మాయ మాట్లాడుకోవడం విన్నట్లు కేర్ సెంటర్ అతను చెబుతాడు. అనంతరం బయటకు వచ్చిన కావ్య ఆఫీస్ నుంచి బయటకు వచ్చేవరకు ఆ బిడ్డ గురించి ఆయనకు ఏం తెలియదు అని అప్పుతో అంటుంది.

పెళ్లి రోజు గుర్తుందా

అంటే ఆఫీస్‌లోనే ఏదో జరిగిందంటావా అని అప్పు అనుమానంగా అంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే మనం ఆఫీస్‌కు వెళ్లాలి అని స్వరాజ్ గ్రూప్ ఆఫీస్‌కు వెళ్తారు కావ్య, అప్పు. వెళ్లి అక్కడున్న వాచ్‌మెన్‌తో మా పెళ్లి రోజు నీకు గుర్తుందా అని అడుగుతుంది. దానికి వాచ్ మెన్ గుర్తుంది మేడమ్ అని చెబుతాడు.

ఆరోజు సాయంత్రం రాజ్ సర్‌ను కలవడానికి ఎవరు వచ్చారు అని కావ్య ప్రశ్నిస్తుంది. దానికి అతను ఎవరు రాలేదని చెబుతాడు. నిజం చెప్పురా భయ్ అని అప్పు గట్టిగా అడుగుతుంది. సీసీ టీవీ కెమెరాలో చూడండి అని వాచ్ మెన్ చెబుతాడు. పద చూపించూ అని కావ్య, అప్పు వెళ్తారు.

సీసీ టీవీ ఫుటేజ్

కంప్యూటర్‌లో సీసీ కెమెరా టీవీ ఫుటేజ్ చూస్తారు కావ్య, అప్పు. అందులో చూసి కావ్య చాలా షాక్ అవుతుంది. అయితే అందులో ఎవరు రానట్లు కనిపించినట్లు తెలుస్తోంది. అందుకే కావ్య అంతలా షాక్ అయింది. మరి తర్వాత బిడ్డ గురించి ఇంకా పూర్తి విషయాన్ని కావ్య ఎలా తెలుసుకుంటుందో తెలియాలంటే మే 6వ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో డీబీఎస్టీ కాలేజీ ఎండీ బాధ్యతల నుంచి వసుధార తప్పుకుంటున్నట్లు బోర్డ్ మెంబర్స్ మీటింగ్‌లో చెబుతుంది. అలా వద్దని ఫణీంద్ర చెబితే.. లేదు సార్ ఇబ్బంది పెట్టకండని వసుధార అంటుంది. మరి ఇప్పుడు ఎండీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారని అడిగితే.. శైలేంద్ర గారు ఉన్నారు కదా అని మిగతా బోర్డ్ మెంబర్స్ అంటారు.

వసుధార కొత్త స్కెచ్

సరే మీరు ఇప్పుడు చేసేదేముంది అని ఫణీంద్ర ఒప్పుకుంటాడు. దాంతో శైలేందర్ ఒకింత ఆశ్చర్యపోతూనే సంబరపడిపోతాడు. అయితే రాజీవ్‌ను పట్టుకునేందుకే శైలేంద్రకు ఎండీ బాధ్యతలు అప్పజెప్పే స్కెచ్ వసుధార, మహేంద్ర కలిసి వేసినట్లుగా తెలుస్తోంది.

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తమ బిడ్డ ఎవరి కడుపులో పెరుగుతుందో తెలుసుకునేందుకు హాస్పిటల్‌కు వెళ్తాడు మురారి. అక్కడ డాక్టర్‌ని అడిగితే ఫైల్ తెప్పిస్తానంటుంది. ఇంతలో మురారికి కృష్ణ కాల్ చేస్తుంది. వందేళ్లే తింగరి నీకు.. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా అని మురారి అంటాడు.

మురారి ఎమోషనల్

అది సరే గానీ, వెళ్లిన అసలు పని ఏమైంది. ఆవిడ ఎవరో తెలిసిందా అని కృష్ణ అడుగుతుంది. కట్ చేస్తే మురారి ముందు మీరా నిల్చుని ఉంటుంది. తనను చూసి మురారి షాక్ అవుతాడు. ఇప్పుడు ఆవిడ ఎవరో తెలుసుకుని ఏం చేస్తారు అని మీరా అడుగుతుంది. మా బిడ్డను మోసేది అంటే మా ప్రాణాన్ని మోసేది. ప్రాణంగా చూసుకుంటాం అని మురారి ఎమోషనల్‌గా అంటాడు.

అది విన్న మీరా సంతోషిస్తుంది. ప్రేమగా చూస్తుంది. తర్వాత మురారి తలపై చేయి వేసిన మీరా మీ బిడ్డను మోయబోయే ఆ సరోగసీ మదర్‌ను నేనే అని మీరా నిజం చెబుతుంది. అది విని మురారి అవాక్కవుతాడు. ఇదే విషయాన్ని కృష్ణతో చెప్పినట్లు.. తను కూడా షాక్‌కు గురైనట్లు ప్రోమోలో చూపించారు.

తదుపరి వ్యాసం