Pathaan Records: కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్ చేసిన ప‌ఠాన్‌ - బాహుబ‌లి -2 మాత్ర‌మే బ్యాలెన్స్ -shahrukh pathaan breaks yash kgf 2 box office record pathaan collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Shahrukh Pathaan Breaks Yash Kgf 2 Box Office Record Pathaan Collection

Pathaan Records: కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్ చేసిన ప‌ఠాన్‌ - బాహుబ‌లి -2 మాత్ర‌మే బ్యాలెన్స్

షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్
షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్

Pathaan Records: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ సినిమా ఇండియా వైడ్‌గా హ‌య్యెస్ట్ నెట్‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్ సినిమాల జాబితాలో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. య‌శ్ కేజీఎఫ్ -2 రికార్డ్‌ను ప‌ఠాన్ బ్రేక్ చేసింది. ఈ జాబితాలో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న సినిమా ఏదంటే...

Pathaan Records: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. గ‌త సినిమాల రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కు దూసుకుపోతున్న‌ది. ప‌దిహేను రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌ఠాన్ 900 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో 446 కోట్ల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. ఇండియా వైడ్‌గా హ‌య్యెస్ట్ నెట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన హిందీ సినిమాల్లో సెకండ్ ప్లేస్‌కు ప‌ఠాన్ చేరుకున్న‌ది. గ‌తంలో ఈ రికార్డ్ య‌శ్ కేజీఎఫ్ -2 సినిమా పేరు మీద ఉంది. కేజీఎఫ్ 2 హిందీ వెర్ష‌న్ ఇండియాలో 434 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఆ రికార్డ్‌ను ప‌ఠాన్ ప‌దిహేను రోజుల్లోనే బ్రేక్ చేసింది.

ఓవ‌రాల్‌గా ఈ జాబితాలో 510 కోట్ల‌తో ప్ర‌భాస్ బాహుబ‌లి -2 ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. బాహుబ‌లి -2 రికార్డ్‌ను మ‌రో రెండు రోజుల్లో ప‌ఠాన్ అధిగ‌మించే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌ఠాన్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత షారుఖ్‌ఖాన్ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రా ఏజెంట్‌గా షారుఖ్‌ఖాన్ యాక్టింగ్‌, అత‌డిపై తెర‌కెక్కించ‌న యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇండియాలో విధ్వంసానికి కుట్ర‌లు ప‌న్నిన ఓ ప్రైవేట్ ఏజెంట్‌ను ప‌ఠాన్ ఎలా అడ్డుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ.

షారుఖ్‌కు జోడీగా దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టించింది. ఐఎస్ఐ ఏజెంట్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో దీపికా క‌నిపించింది. స‌ల్మాన్‌ఖాన్ గెస్ట్‌లో రోల్‌లో న‌టించాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.