తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramarao On Duty Review: రామారావు ఆన్‌ డ్యూటీ మూవీ రివ్యూ - రవితేజ వన్ మ్యాన్ షో

Ramarao On Duty Review: రామారావు ఆన్‌ డ్యూటీ మూవీ రివ్యూ - రవితేజ వన్ మ్యాన్ షో

HT Telugu Desk HT Telugu

29 July 2022, 12:55 IST

  • Ramarao On Duty Review: ర‌వితేజ (Raviteja) హీరోగా  శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ (Ramarao On Duty). క‌రోనా కార‌ణంగా ప‌లు మార్లు వాయిదాప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం నేడు భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...

రవితేజ
రవితేజ (twitter)

రవితేజ

Ramarao On Duty Movie Review: మాస్ హంగుల‌తో పాటు వినోదానికి కేరాఫ్ అడ్ర‌స్ గా రవితేజ సినిమాలు నిలుస్తుంటాయి. ఫుల్ ఎనర్జీతో కూడిన యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో క్యారెక్ట‌ర్‌లోనైనా అల‌వోక‌గా ఒదిగిపోతుంటారాయన. ర‌వితేజ‌లోని మాస్ కోణాన్ని వెండితెర‌పై ప‌రిపూర్ణ స్థాయిలో ఆవిష్క‌రించే సినిమా వ‌చ్చి చాలా కాల‌మైంది. గ‌త నాలుగేళ్ల‌లో క్రాక్ మిన‌హా ర‌వితేజ న‌టించిన సినిమాల‌న్నీ ప‌రాజ‌యాలుగా నిలిచాయి. జ‌యాప‌జ‌యాల్ని ఒకేలా స్వీక‌రిస్తూ సినిమా ఫ‌లితంతో సంబంధం లేకుండా కొన్నేళ్లుగా కొత్త ద‌ర్శ‌కుల్ని ప్రోత్స‌హిస్తున్నారు రవితేజ. ఆ బాటలోనే ర‌వితేజ చేసిన తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 9th Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లితో రాజ్‌ పెళ్లి- నిజం చెప్పనున్న సుభాష్- రుద్రాణిలా పుట్టింట్లో అపర్ణ

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్య సూపర్, బంటుని చితకబాదిన కార్తీక్.. కాంచన మనసులో విషం నింపిన పారిజాతం

Guppedantha Manasu Serial: వ‌సుధార‌ను కిడ్నాప్ చేసిన రాజీవ్ - రిషి త‌మ్ముడికి శైలేంద్ర సాయం - కొడుకుపై అనుప‌మ పంతం

NNS May 9th Episode: భాగీకి దగ్గరవుతున్న పిల్లలు.. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అమర్.. ఆరు కోరికకు మాయమైన యముడు

Ramarao On Duty మూవీతో శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. దివ్యాంశ‌కౌశిక్‌, రాజీషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. సీనియ‌ర్ హీరో వేణు కీల‌క పాత్ర‌ను పోషించారు. టైటిల్‌తో పాటు పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ సినిమాతో ర‌వితేజ హిట్ కొట్టాడా? కొత్త ద‌ర్శ‌కుడిపైఅత‌డు పెట్టుకున్న న‌మ్మ‌కం గెలిచిందా లేదా అన్నది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

Ramarao On Duty Review: రామారావు కథ..

రామారావు (రవితేజ)నిజాయితీపరుడైన డిప్యూటీ కలెక్టర్. ప్రజలకు మంచి చేయడానికి అవసరమైతే చట్టాన్ని కూడా అతిక్రమించడానికి సిద్ధపడతాడు. తాను అనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టడు. తాను పనిచేసే ప్రతి చోట మోస్ట్ కాంట్రవర్షియల్ ఆఫీసర్ గా పేరుతెచ్చుకుంటాడు. ఓ ప‌వ‌ర్ ప్రాజెక్ట్‌లో ప్ర‌జ‌ల త‌ర‌ఫున నిల‌బ‌డిన కార‌ణంగా రామారావు చిత్తూరుకు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాడు. అతడి మాజీ ప్రియురాలు మాలిని (రాజీషా విజయన్) ఇబ్బందుల్లో ఉందనే నిజం రామారావుకు తెలుస్తుంది. మాలిని భ‌ర్త సురేంద్ర క‌నిపించ‌కుండా పోయాడ‌ని, అత‌డి కోసం వెతుకుతుందని తెలుసుకున్న రామారావు ఆమెకు అండగా నిలబడతాడు. అత‌డి అన్వేషణ‌లో సురేంద్ర తో పాటు మ‌రో ఇర‌వై మంది కూడా చాలా రోజులుగా క‌నిపించడం లేద‌నే వాస్తవం బయటపడుతుంది.

వారందరి మిస్సింగ్ కు కార‌ణ‌మేమిటి? ఈ కేసుతో రామారావు త‌మ్ముడు అనంత్‌(రాహుల్ రామకృష్ణ), స్నేహితుడు క‌బీర్‌(అరవింద్ కృష్ణ)తో ఉన్న సంబంధ‌మేమిటి? ఈ కేసు అన్వేష‌ణ‌లో రామారావుకు పోలీస్ ఆఫీస‌ర్ ముర‌ళీ (వేణు) ఎలాంటి ఆటంకాలు సృష్టించాడు? ప్రాణంగా ప్రేమించిన మాలినిని కాద‌ని నందిని (దివ్యాంశ కౌశిక్)ను రామ‌రావు పెళ్లి చేసుకోవ‌డానికి కార‌ణ‌మేమిట‌న్న‌దే రామారావు ఆన్ డ్యూటీ క‌థ‌.

Ramarao On Duty Movie Review: డిప్యూటీ కలెక్టర్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్

సాధార‌ణంగా ఇన్వేస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్స్ పోలీస్ ఆఫీస‌ర్ కోణంలో సాగుతుంటాయి. క్రైమ్ వెన‌కున్న ర‌హ‌స్యాల్ని పోలీసులు, సీబీఐ ఆఫీస‌ర్స్ ఛేదిస్తుంటారు. పోలీసులు మాత్రమే మాత్ర‌మే కాకుండా జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో క్రైమ్ కేసుల‌ను సాల్వ్ చేసే అధికారం డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ కు కూడా ఉంటుంద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ ఈ క‌థ‌ను రాసుకున్నారు. పోలీసులు వల్ల సాధ్యం కాలేకపోయినా మిస్సింగ్ మిస్ట‌రీని ఓ ప్ర‌భుత్వ అధికారి ఎలా సాల్వ్ చేశాడ‌నే అంశానికి ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడించి రామారావు ఆన్ డ్యూటీ సినిమాను తెర‌కెక్కించారు.

క్రైమ్ థ్రిల్లర్...

రామారావుగా ర‌వితేజ మంచిత‌నాన్ని, అత‌డిలోని హీరోయిజాన్ని ప‌రిచ‌యం చేస్తూ మాస్ అంశాల‌తో సినిమాను మొద‌లుపెట్టారు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత సురేంద్ర మిస్సింగ్ కేసుతో కథ క్రైమ్ వైపుకు ట‌ర్న్ అవుతుంది. ఆ కేసుకు సంబంధించిన ఒక్కో వాస్తవాన్ని వెలికితీస్తూ కథను ముందుకు నడినిపించారు. రామారావు ఫ్యామిలీ మెంబ‌ర్స్ పైనే అనుమానాల్ని రేకెత్తిస్తూ ఫ‌స్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. స‌మాజంలో ఆ సామాన్యులుగా చెలామ‌ణీ అవుతూ ఈ క్రైమ్ వ‌ర‌ల్డ్ ను న‌డిపిస్తున్న వ్య‌క్తుల‌ను రామారావు ఎలా ప‌ట్టుకున్నాడ‌నేది సెకండ్ హాఫ్‌లో చూపించారు.

మలుపులు లేవు...

క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల‌ను ప‌క‌డ్బందీ స్క్రీన్‌ప్లే, ఊహకు అందని మ‌లుపుల‌తో రాసుకున్న‌ప్పుడే వ‌ర్క‌వుట్ అవుతాయి. ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేయ‌డం చాలా ముఖ్యం. ఆ థ్రిల్ Ramarao On Duty సినిమాలో పూర్తిగా మిస్స‌యింది. ర‌వితేజ కేసును ఛేదించే సీన్స్ అన్ని న‌త్త‌న‌డ‌క‌న సాగుతాయి. సినిమా ఆరంభం నుండి ముగింపు వ‌ర‌కు ఓకే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ద‌ర్శ‌కుడు రాసుకున్న ట్విస్ట్ లు కూడా లాజిక్‌లెస్‌గా ఉంటాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ పాయింట్ కు ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా అంశాన్ని జోడించి క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు పూర్తిగా త‌డ‌బ‌డిపోయాడు. ఆ సీన్స్ అన్ని పుష్ప‌తో పాటు ఇదివ‌ర‌కు వ‌చ్చిన చాలా సినిమాల్ని గుర్తుకుతెస్తాయి.

Ramarao On Duty: విలన్ లేకపోవడం మైనస్...

క‌థ‌లో ధీటైన‌ విల‌న్ ఉన్న‌ప్పుడే హీరో క్యారెక్ట‌ర్ ఎలివేట్ అవుతుంది. ఈ సినిమాలో ప్రాప‌ర్ విల‌న్ అంటూ ఎవ‌రూ క‌నిపించ‌రు. నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్స్ అన్ని క‌మెడియ‌న్ త‌క్కువ విల‌న్ కు ఎక్కువ‌గా అన్న‌ట్లుగా సాగుతాయి. ఫ్యామిలీ డ్రామా నుండి స‌రైన ఎమోష‌న్స్ రాబ‌ట్టుకోలేక‌పోయారు. ఆ సీన్స్ అన్ని క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌కు సంబంధం లేన‌ట్లుగా ఉంటాయి.

రవితేజ వన్ మెన్ షో...

రామారావు ఆన్ డ్యూటీలో నిజాయితీప‌రుడైన ప్ర‌భుత్వ ఉద్యోగిగా, బాధ్య‌త క‌లిగిన ఫ్యామిలీ మ్యాన్ భిన్న కోణాల్లో సాగే పాత్ర‌లో ర‌వితేజ క‌నిపించాడు. డైలాగ్ డెలివ‌రీతో పాటు యాక్ష‌న్ సీన్స్‌లో ఆక‌ట్టుకున్నాడు. దివ్యాంశ కౌశిక్ కేవ‌లం పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. పాట అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ఆమె క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇస్తుంది. క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌లో రజీషా విజ‌య‌న్ క‌నిపించింది. ఆమె క్యారెక్ట‌ర్ నిడివి త‌క్కువే. ఇద్ద‌రు హీరోయిన్లు పూర్తిగా అతిథులుగా క‌నిపించారు. ఈ సినిమాతో చాలా రోజుల త‌ర్వాత సీనియ‌ర్ హీరో వేణుతో పాటు ఈరోజుల్లో శ్రీ, అర‌వింద్ కృష్ణ రీఎంట్రీ ఇచ్చారు. అవినీతి ప‌రుడైన పోలీస్ అధికారిగా వేణు చిత్తూరు యాస డైలాగ్స్ తో మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో అర‌వింద్ కృష్ణ న‌టించాడు.

సీక్వెల్ తో సర్ ప్రైజ్...

ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా శ‌ర‌త్ మండ‌వ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. బోరింగ్ స్క్రీన్‌ప్లేతో రామారావు ఆన్ డ్యూటీ సినిమాను న‌డిపించి నిరాశ‌ప‌రిచాడు. ద‌ర్శ‌కుడిగా అత‌డి ముద్ర‌ను చాటిచెప్పే బ‌ల‌మైన సీన్ ఒక్క‌టి కూడా సినిమాలో క‌నిపించ‌దు. రామారావు త‌న డ్యూటీని ఎలా పూర్తిచేశాడ‌న్న‌ది రెండో భాగంలో చూడాలంటూ సీక్వెల్ ప్ర‌క‌టించి ట్విస్ట్ ఇచ్చాడు. శ్యామ్ సీఎస్ సంగీతం బాగుంది. సీసా ప్ర‌త్యేక‌గీతంతో డ్యూయెట్స్ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాయి. స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. యాక్ష‌న్ సీక్వెన్స్‌ను కొత్త‌గా డిజైన్ చేశారు.

Ramarao On Duty: కొత్తదనం కరువైంది..

రామారావు ఆన్ డ్యూటీ అనే పేరులో ఉన్న వైవిధ్య‌త సినిమాలో లేదు. టాలీవుడ్ తో పాటు ప‌లు భాష‌ల ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు పూర్తిగా అన్ని ర‌కాలుగా వాడి ప‌క్క‌న‌పెట్టిన పాత క‌థ‌కు కొత్త మెరుగులు దిద్ది శరత్ మండవ మ్యాజిక్ చేయాల‌ని అనుకున్నారు. ఈ ప్ర‌య‌త్నం పూర్తిగా బెడిసికొట్టింది.

రేటింగ్: 2.5/ 5

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.