తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 9th Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లితో రాజ్‌ పెళ్లి- నిజం చెప్పనున్న సుభాష్- రుద్రాణిలా పుట్టింట్లో అపర్ణ

Brahmamudi May 9th Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లితో రాజ్‌ పెళ్లి- నిజం చెప్పనున్న సుభాష్- రుద్రాణిలా పుట్టింట్లో అపర్ణ

Sanjiv Kumar HT Telugu

09 May 2024, 7:45 IST

    • Brahmamudi Serial May 9th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 9వ తేది ఎపిసోడ్‌లో రాజ్ తీసుకొచ్చిన బిడ్డ తల్లితో రాజ్ పెళ్లి జరిపిస్తానని అంటుంది అపర్ణ. దాంతో తను అఫైర్ పెట్టుకున్న అమ్మాయితో కొడుకు పెళ్లి చేయిస్తానని అన్న అపర్ణ మాటలు తట్టుకోలేక చెవులు మూసుకుంటాడు సుభాష్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ మే 9వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 9వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ మే 9వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్‌ను నిజం చెప్పమని అపర్ణ నిలదీస్తుంది. రుద్రాణి మాత్రం వెటకారంగా మాట్లాడుతూ చెప్పమని అడుగుతుంది. నీకు ఏ సమస్య ఉంది. ఏ పరిస్థితి నిన్నుకట్టేస్తుంది. ఆర్చడానికి తీర్చడానికి మీ అమ్మ ఉంది కదా అని రుద్రాణి అంటుంది. ఇంతలో లేచిన ప్రకాశం నేను ఏదైనా మర్చిపోతుంటాను. నిన్ను నా కన్నకొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను. నువ్ వెళ్లిపోతే ఆ బాధ భరించలేనురా. నిజం చెప్పు అని అంటాడు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

భార్యగా తీసుకురమ్మాంటారా

రాజ్ ఇందరం అడుగుతున్నావ్. నువ్ మాత్రం నోరు విప్పడంలేదు. తప్పును సరిదిద్దడానికి మార్గం ఉంటే చెప్పు. ఆ బిడ్డ తల్లికి భార్య స్థానం ఇవ్వాలంటే. ఈ ఇంటి కోడలిగా తీసుకురావాలని ఉంటే నిర్భయంగా చెప్పు అని అపర్ణ అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు అంటీ.. ఇప్పటికీ మా కావ్య బతుకు అన్యాయమైపోయిందని బాధపడుతుంటే.. బిడ్డను కనేసి వదిలిపోయినదాన్ని భార్యగా తీసుకురమ్మంటారా అని ఫైర్ అవుతుంది స్వప్న.

మీ పెద్దరికానికి చెదలు పట్టిందా. సంవత్సరం పాటు మీరు, మా అత్త, మీ తోడి కోడలు, ఆమె కోడలు ఎన్నెన్ని మాటలు అంటున్న నోరు మూసుకున్నందుకు మీరు ఇచ్చే బహుమానం ఇదా అని స్వప్న ఆవేదనగా అడుగుతుంది. దానికి కోప్పడిన అపర్ణ ఇది మా ఇంటి సమస్య అని అంటుంది. దానికి ఏ ఇంటి సమస్య.. ఆ అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. ఏ సమస్య అని మళ్లీ అడుగుతుంది ఇందిరాదేవి. మా.. అని అనబోయినా అపర్ణ మన ఇంటి సమస్య అంటుంది అపర్ణ.

ఎదురుతిరగక తప్పట్లేదు

ఈ సమస్యను లేవనెత్తింది ఎవరు. వాడికి వారం రోజులు గడువు ఇచ్చి శాసనం చేసింది ఎవరు. మేము వాడిని బయటకు వెళ్లేందుకు ఒప్పుకున్నామా. వాడు చేసిందాన్ని సమర్థించట్లేదు కానీ, ఇలా బయటకు పంపే కార్యక్రమం పెట్టాలనుకోవట్లేదు అని ఇందిరాదేవి అంటుంది. వదినా.. మీ నిర్ణయానికి మేను కట్టుబడతాం. ఎందుకంటే మీపై నమ్మకం, గౌరవం. కానీ, మీరు రాజ్ విషయంలో తల్లిగా నిర్ణయం తీసుకుంటున్నట్లు లేదు. అందుకే మీకు ఎదురు తిరగక తప్పట్లేదు అని ప్రకాశం అంటాడు.

బిడ్డ తల్లిని ఇంటి కోడలిగా తీసుకురావడాన్ని మేము సహించలేం. కావ్య జీవితం నాశనం ఏ నిర్ణయమైన మేము ఒప్పుకోం. మీకు ఎదురుచెప్పే ఇలాంటి సందర్భం మళ్లీ రాకూడదని కోరుకుంటున్నాను అని ప్రకాశం అంటాడు. ఏమైంది పెద్దమ్మా. నన్నే సొంత కొడుకులా చూసుకునే మీరు సొంత కొడుకు విషయంలో ఇంత కఠినంగా ఎందుకు ఉంటున్నారు అని కల్యాణ్ అంటాడు. తన తోడి కోడలు అంటుందన్నో, మా అత్త ఏమంటుందనో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని స్వప్న అంటుంది.

సంఘర్షణ మాత్రమే

ఇన్నాళ్లు కాపాడుకున్న పెద్దరికం ఎక్కడపోతుందనే అహంతో కొడుకు ఎక్కడపోతే ఏంటీ, కోడలు ఏమైపోతే ఏంటీ అని ఆలోచిస్తున్నారు అని స్వప్న అంటుంది. దాంతో హా.. కరెక్ట్‌గా చెప్పావ్ కోడలా.. ఇన్నాళ్లకు అత్తగా నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. మా వదినకు ఉన్న వాల్యూ ఎక్కడ పోతుందో అని ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని రుద్రాణి అంటుంది. దాంతో దయచేసి అంతా మౌనంగా ఉంటారా. ఇది నాకు మా అమ్మకు జరిగే సంఘర్షణ మాత్రమే అని రాజ్ అంటాడు.

మా అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడతాను అని రాజ్ తెగేసి చెబుతాడు. దాంతో విన్నావా. ఆరోజు నీ భర్త బయటకు వెళ్లకుండా నిజం బయటపెడతానని చెప్పావ్. ఇప్పుడు ఏం చెబుతావ్ అని అపర్ణ అడుగుతుంది. నేను ఓడిపోయాను అత్తయ్య.. అవును, నేను ఓడిపోయాను అని కావ్య అంటుంది. దానికి రాజ్ షాకై చూస్తాడు. ఏం జరిగిందో అనేది నాకు అనవసరం. ఇప్పుడు ఏం జరిగినా దానికి నేను తలవంచుతాను అని కావ్య అంటుంది.

ఆడది ఉండకూడదు

ఓడిన వాళ్లకు ఇంకో అవకాశం అడిగే అర్హత ఉండదు. అలాగే మీ నిర్ణయాన్ని కాదనే హక్కు మీ కొడుకుకే లేనప్పుడు నాకూ ఉండదు. కాబట్టి.. మీ నిర్ణయానికి నా భర్త ఎలా తలవంచారో నేను అలాగే అంగీకరిస్తాను. భర్తలేని అత్త ఇంట్లో ఏ ఆడది కూడా ఉండకూడదు. ఆ ఆడదానికి ఎలాంటి ఉనికి ఉండదు. తప్పో ఒప్పో.. కష్టమో సుఖమో.. ఆయనతోపాటే నేను కూడా. నా భర్తతోపాటే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని కావ్య అంటుంది. దానికి అంతా షాక్ అయి చూస్తారు.

శభాష్ కావ్య.. శభాష్.. చాలా గొప్పమాట అన్నావ్. ఇన్నాళ్లు తప్పు చేసినా సరే నీ భర్తను వెనుకేసిన సరే.. ఇప్పుడు నీ భర్తతోనే వెళ్తానంటున్నావ్. నీకు ఇంకో దారి లేదు. ఎందుకంటే కన్నకొడుకుని బయటకు పంపించే నీ అత్త నిన్ను కూడా బయటకు వెళ్ల అనకడముందే నీ గౌరవాన్ని కాపాడుకున్నావ్. నీ భర్త గౌరవాన్నిపెంచావ్ అని సుభాష్ అంటాడు. విన్నావా అపర్ణ.. కోడుకుని, కోడలిని బయటకు పంపించే నువ్ చాలా సాధించావని గర్వంగా చెబుదామనుకున్నావా అని ఇందిరాదేవి అంటుంది.

ఇల్లంతా దండెత్తితే గానీ

అలా జరిగితే కార్చిచ్చులా నిన్ను దహించే కడుపుకోత తప్పా ఇంకేం ఉండదు అని ఇందిరాదేవి అంటుంది. అపర్ణ తల్లిగా నువ్ నిర్ణయం తీసుకున్నావ్. మరి తండ్రిగా నా సంగతి ఏంటీ. నాకు వాడిమీద మమకారం ఉండదా. నా నిర్ణయాలకు ఎలాంటి గుర్తింపు లేదా అని సుభాష్ అంటాడు. ఉంటుందంటి. ఆ విషయమే మర్చిపోయాను. నేను చేసింది తప్పే. ఆ విషయం ఇల్లంతా దండెత్తితే గానీ నాకు తెలియలేదు. ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాను. తల్లిగా నాకు వాడి మీద ఎలాంటి హక్కు ఉందో ఇప్పుడే తెలిసింది అని అపర్ణ అంటుంది.

మీరు ఒప్పుకుంటే నా అభ్యర్థన ఒకటి చెబుతాను. రేపు ఉదయం లోగా రాజ్ జరిగిందేంటో చెప్పాలి. జరగాల్సిందేంటో చెప్పాలి. ఏం జరిగితే వాడికి న్యాయం జరుగుతుందో చెప్పాలి. లేకుంటే వాడిపై ఎలాంటి హక్కు లేని నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. నేనే ఇంట్లోనుంచి వెళ్లిపోతాను అని అపర్ణ అంటే.. అంతా షాక్ అవుతారు. వాడి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు లేకుంటే నాపై తీసుకునే హక్కు ఉంది అని అపర్ణ అంటుంది.

నువ్ కూడా రుద్రాణిలా

రేపు ఉదయం లోగా వాడు నిజం బయటపెట్టకపోతే ఇంటి హక్కులన్నీ వదిలేసుకుని నేను వెళ్లిపోతాను. నా విషయంలో నా నిర్ణయం కాదనే హక్కు ఎవరికీ ఇవ్వను అని వెళ్లిపోతుంది అపర్ణ. దాంతో అంతా స్తబ్దుగా ఉండిపోతారు. అనంతరం అపర్ణ దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు సుభాష్. నీ నిర్ణయం నచ్చలేదు. అప్పుడు రుద్రాణి నీకు పోలిక ఏంటీ. రుద్రాణిలా పుట్టింట్లో ఉంటావా అని సుభాష్ అంటాడు. దయచేసి రుద్రాణిలాంటి స్త్రీ మూర్తితో పోల్చకండి ఆమె సంగతి వేరు. నా సంగతి వేరు అని అపర్ణ అంటుంది.

ఇంటి పెద్ద కోడలివి అయినా నువ్ ఇల్లు వదిలిపెట్టి పోతావా. రాజ్ విషయంలో అన్ని ఆంక్షలు పెడతావా అని సుభాష్ అంటాడు. ఇంతేనా ఇన్నేళ్లలో మీరు అర్థం చేసుకుంది. నేను దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిని. అన్నిటికి మించి కన్నతల్లిని. నా కొడుకు పతనాన్ని చూస్తూ ఊరుకుంటున్నానా అని అపర్ణ అంటుంది. కంపెనీ బాధ్యతల నుంచి తీసేయడం, ఇప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోమనడం తల్లి చేసే పనేనా అని సుభాష్ అంటాడు.

భయపడి నిజం చెబుతాడని

చేశాను. కానీ, అహంతో కాదు గాడితప్పినా నా కొడుకు జీవితం సరిదిద్దడానికి అని అపర్ణ అంటుంది. ఇలా చేస్తే అయినా వాడు నిజం చెబుతాడని ఆశపడ్డాను. వాడికి సంస్కారం, ఇంటి మీద మమకారం అడ్డు వస్తున్నాయి, నా కోపం అంతా ఒక తెర మాత్రమే. తోడి కోడలు నవ్విందనో, ఆడపడుచు దెప్పి పొడించిందనే నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఇలా చేస్తే వాడు భయపడి నిజం చెబుతాడనుకున్నాను. కానీ వాడు ఒప్పుకుని దోషిలా నిలబడతాడనుకోలేదు అని అపర్ణ అంటుంది.

మీకంటే వందరెట్లు వాడిపై నాకు ప్రేమ ఉంది. నేను లేనప్పుడు వాడి పెళ్లి చేశారు. ఆ పిల్లతో వాడి కలిసి ఉంటున్నాడే తప్పా.. వాడికి సుఖం లేదు. సంతోషం లేదు. అది నాకు ఎప్పుడో తెలుసు. అందుకే వాడు బయట అమ్మాయిని చూసుకున్నాడు. బిడ్డను కూడా కన్నాడు. కావ్యను పంపించలేక.. తనకు ఇష్టమైన వ్యక్తిని తీసుకురాలేక సతమతం అయ్యాడు. కన్నబిడ్డ అనాథలా పెరగడం చూడలేక ఇంటికి తీసుకొచ్చాడు. వాడు ఇంటికి అడుగుపెట్టినప్పటి నుంచి మనసు మనసులో లేదు అని అపర్ణ అంటుంది.

బిడ్డ తల్లితో పెళ్లి జరిపిస్తాను

నేను ఇన్ని ఆంక్షలు పెట్టింది ఆ బిడ్డ తల్లిని ఈ ఇంటికి తీసుకురావాలనే అని అపర్ణ అంటుంది. దాంతో షాక్ అవుతాడు సుభాష్. ఆ బిడ్డ తల్లి ఎవరో చెబితే అని సుభాష్ అడిగితే.. వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని అపర్ణ అంటుంది. దాంతో మరింత షాక్ అవుతాడు సుభాష్. ప్రపచం అంతా ఎదురైనా సరే నా బిడ్డ సుఖ సంతోషం ముఖ్యమని ఆ బిడ్డ తల్లితో వాడి పెళ్లి జరిపిస్తాను అని అపర్ణ అంటుంది. దాంతో సుభాష్ చెవులు మూసుకుంటాడు.

అది చూసిన అపర్ణ.. అంటీ విని భరించలేకపోతున్నారా. వాడికి రెండో పెళ్లి చేస్తే.. కావ్య పరిస్థితి ఏమైపోతుందో అని భయపడుతున్నారా. కావ్య మాత్రం ఏం సుఖపడుతోందండి. భర్త దూరం పెట్టాడు. మరో అమ్మాయితో బిడ్డను కన్నాడు. అలాంటి వాడితో ఏ ఆడది ఎలా ఉంటుంది అని అపర్ణ అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

రహస్యం బద్ధలైపోవాలి

బ్రహ్మముడి సీరియల్ తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ లగేజ్, బాబును పట్టుకుని బయలుదేరుతాడు. నా వల్ల నీ పేరు పోవడం నాకిష్టం లేదని అంటాడు. ఆ బాబు కోసం నీ సర్వస్వం దార పోస్తావని అర్థమైంది. నువ్ వెళ్లడం కాదు నేనే వెళ్తాను అని అపర్ణ లగేజ్ పట్టుకుని వెళ్తుంది. దాంతో అపర్ణ ఒక్క నిమిషం. వెళ్లేముందు నిజాలు తెలుసుకుని వెళ్లు. ఇవాళ్టితో ఈ రహస్యం బద్దలైపోవాలి అని సుభాష్ అంటాడు. చూస్తుంటే ఆ బిడ్డకు తండ్రి తనే అని సుభాష్ చెబుతాడని తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం