Raj Tarun: చీర కట్టే వృత్తిలో రాజ్ తరుణ్.. ప్రభాస్ డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-prabhas director maruthi comments on raj tarun bhale unnade at teaser launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raj Tarun: చీర కట్టే వృత్తిలో రాజ్ తరుణ్.. ప్రభాస్ డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Raj Tarun: చీర కట్టే వృత్తిలో రాజ్ తరుణ్.. ప్రభాస్ డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 06, 2024 01:01 PM IST

Maruthi About Raj Tarun Bhale Unnade Teaser: ప్రభాస్ రాజా సాబ్ డైరెక్టర్ మారుతి హీరో రాజ్ తరుణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చీర కట్టే వృత్తి పాత్రలో చేస్తున్న రాజ్ తరుణ్ సినిమా భలే ఉన్నాడే టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మారుతి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చీర కట్టే వృత్తిలో రాజ్ తరుణ్.. ప్రభాస్ డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చీర కట్టే వృత్తిలో రాజ్ తరుణ్.. ప్రభాస్ డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Maruthi Raj Tarun Bhale Unnade: ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా 'రాజా సాబ్' రూపొందిస్తున్నాడు దర్శకుడు మారుతి. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ 'భలే ఉన్నాడే'కి డైరెక్టర్ మారుతి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందే ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

yearly horoscope entry point

మే 5వ తేదీన భలే ఉన్నాడే సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి ఈ టీజర్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ టీజర్.. చీర కట్టే వృత్తిని ఎంచుకున్న రాధగా రాజ్ తరుణ్ పాత్రను పరిచయం చేస్తూ ప్రారంభం అవుతుంది. అతను అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు. బైక్‌పై అబ్బాయిలా కూర్చోవడాన్ని కూడా ఇష్టపడడు. అయితే, హీరోయిన్ మనీషా కంద్కూర్ అతనిని ఇష్టపడుతుంది. తనతో ప్రేమలో పడుతుంది. ఈ ప్రేమకథ ఎక్కడ ముగుస్తుంది అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. "రాజ్ తరుణ్‌తో మంచి ప్రాజెక్ట్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. దర్శకుడు సాయికి ఈ పాయింట్ చెబితే తను చాలా బాగా డిజైన్ చేసుకొని తీసుకొచ్చారు. నిర్మాత కిరణ్ గారు కూడా కథ నచ్చి ప్రాజెక్ట్‌లోకి వచ్చారు" అని మారుతి అన్నారు.

"ఇది కాన్సెప్ట్ ఫిల్మ్. ప్రేక్షకులని థియేటర్స్‌కి రప్పించే ఫిల్మ్ అని భావిస్తున్నాను. ఇది మన మధ్యలో జరిగే ఒక కథలా ఉంటుంది. మనిషా చాలా చక్కగా నటించింది. శివసాయి చాలా పాషన్ ఉన్న దర్శకుడు. ప్రతి విషయంలో చాలా క్లియర్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటాడు. శేఖర్ చంద్ర మంచి పాటలు ఇచ్చారు. ఇద్దరు డీవోపీలు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు" అని డైరెక్టర్ మారుతి చెప్పారు.

"దాదాపు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్ లందరూ సినిమాలో ఉన్నారు. తమిళ్ నుంచి కూడా వీటీ గణేషన్ లాంటి నటులను తీసుకొచ్చారు. మంచి కంటెంట్‌తో రాబోతుంది ఈ సినిమా. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా అవ్వబోతుంది. రెండు రీళ్లు చూశాను. ఫ్లో చాలా బావుంది. పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ ఆర్ట్స్ నిర్మాతలకు స్వాగతం" అని మారుతి తెలిపారు.

"చిన్న సినిమాలు ఎప్పటికీ బావుండాలి. నేను ఎంత పెద్ద సినిమాలు చేస్తున్నా.. చిన్నసినిమాతోనే వచ్చాను కాబట్టి ఆ సినిమాలు వదలకుండా ట్రావెల్ అవుతున్నాను. ఈ సినిమా కూడా బాగా ఆడితే ఇంకా ఎనర్జీ వస్తుంది. ఈటీవీ విన్, ఆదిత్య మ్యూజిక్ కి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని దర్శకుడు మారుతి చెప్పుకొచ్చారు.

ఇక టీజర్‌లో రాజ్ తరుణ్ చీర కట్టే వృత్తితోపాటు గే అని తెలుస్తోంది. టీజర్ చివరిలో వీటీ గణేషన్ డైలాగ్ చెప్పే విధానం బాగుంది. హీరోయిన్ మనీషా కంద్కూర్ తన గ్లామర్ షో చేస్తూ, తన నటనతో ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ స్నేహితుడిగా హైపర్ ఆది కనిపించాడు. ఇతర ప్రముఖ హాస్యనటుల ప్రజెన్స్ చూస్తుంటే ఈ చిత్రంలో ఎంటర్ టైమెంట్ అదిరిపోతుందని తెలుస్తోంది.

Whats_app_banner