Ee Rojullo Re Release: రాజా సాబ్ డైరెక్టర్ మారుతి జీవితాన్ని మార్చేసిన మూవీ రీ రిలీజ్.. సరిగ్గా 12 ఏళ్లకు అదే రోజున!-raja saab director maruthi first movie ee rojullo re released after 12 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Raja Saab Director Maruthi First Movie Ee Rojullo Re Released After 12 Years

Ee Rojullo Re Release: రాజా సాబ్ డైరెక్టర్ మారుతి జీవితాన్ని మార్చేసిన మూవీ రీ రిలీజ్.. సరిగ్గా 12 ఏళ్లకు అదే రోజున!

Sanjiv Kumar HT Telugu
Mar 23, 2024 01:04 PM IST

Ee Rojullo Re Release Director Maruthi: ప్రభాస్‌తో రాజా సాబ్ సినిమా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఈ రోజుల్లో. తాజాగా ఈ రోజుల్లో సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి కామెంట్స్ వెరల్ అవుతున్నాయి.

రాజా సాబ్ డైరెక్టర్ మారుతి జీవితాన్ని మార్చేసిన మూవీ రీ రిలీజ్.. సరిగ్గా 12 ఏళ్లకు అదే రోజున!
రాజా సాబ్ డైరెక్టర్ మారుతి జీవితాన్ని మార్చేసిన మూవీ రీ రిలీజ్.. సరిగ్గా 12 ఏళ్లకు అదే రోజున!

Ee Rojullo Re Release: ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే 2012 మార్చి 23న విడుద‌లై యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా కుర్ర‌కారుని ఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యం సాధించిన సినిమా ఈ రోజుల్లో. అలాంటి ఈ మూవీని మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్‌. సినిమా విడుద‌లైన 12 సంవ‌త్స‌రాల‌కు మ‌ళ్లీ అదే రోజున అంటే మార్చి 23న (శనివారం) ఈ రోజుల్లో సినిమా రీ రిలీజ్ కావ‌డం విశేషం.

ఎన్నో సంచ‌ల‌నాల‌కు తెర‌లేపిన ట్రెండ్‌సెట్ట‌ర్ ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మ‌ళ్లీ చూడాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. గుడ్ సినిమా గ్రూప్‌ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వెంలో వచ్చిన సినిమా ఈ రోజుల్లో. ఇందులో శ్రీనివాస్, రేష్మ హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి జేబి సంగీతం అందించారు. ఎస్‌కేఎన్‌, శ్రేయాస్ శ్రీ‌నివాస్ ఈ రోజుల్లో సినిమాను నిర్మించారు. ఈ రోజుల్లో సినిమా ఇవాళ విడుదల కానున్న సందర్భంగా మార్చి 22న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతి తన మనసులోను భావాలను పంచుకున్నారు. "ఈ రోజుల్లో సినిమా విడుద‌లైన 12 సంవ‌త్స‌రాల త‌రువాత మ‌ళ్లీ రీ రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా చిన్న బ‌డ్జెట్‌తో స‌ర‌దాగా చేసిన సినిమా ఇది. మా జీవితాల‌ను మార్చిన సినిమా ఇది. గ‌త 12 సంవ‌త్స‌రాలుగా మా ముగ్గురి జ‌ర్ని కూడా ఎంతో స‌క్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా ఉంటుంది. అందుకే ఎస్‌కేఎస్‌, శ్రీ‌నివాస్ పూనుకుని ఈ సినిమా స్వీట్ మొమ‌రీస్‌ను అంద‌రికి గుర్తు చేస్తే బాగుంటుంద‌ని ఈ చిత్రాన్ని మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నాం" అని మారుతి అన్నారు.

"12 సంవ‌త్స‌రాల క్రితం విడుద‌లైన సినిమా మ‌ళ్లీ ఇప్ప‌డు బిగ్ స్కీన్‌పై చూసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. మా లైఫ్‌లు టర్న్ చేసిన సినిమా ఇది. ఈ స్వీట్ మొమెరీని అందరూ మ‌రోసారి గుర్తు చేసుకుని సినిమాను చూసి మ‌ళ్లీ ఆనందించాల‌ని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ మారుతి ఆసక్తికకర కామెంట్స్ చేశారు.

"మా ముగ్గురి కెరీర్‌లో ఇది చాలా ప్ర‌త్య‌క‌మైన సినిమా. పీఆర్‌వోగా ఉన్న న‌న్ను నిర్మాత‌ను చేసిన సినిమా ఇది. మా అంద‌రిని బిజీ చేసిన ట్రెండ్‌సెట్ట‌ర్ మూవీ ఇది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మారుతి లాంటి ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడిని అందించిన చిత్రం ఈ రోజుల్లో. ఆ రోజున మొద‌లైన మా ప్ర‌యాణంలో అంద‌రికి మంచి కెరీర్‌ను ఇచ్చిన సినిమా ఇది" అని బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ అన్నారు.

"ఈ రోజుల్లో నుంచి బేబీ వ‌ర‌కు నిర్మాత‌గా నా ప్ర‌యాణం, ద‌ర్శ‌కుడిగా మారుతి ప్ర‌స్థానం, శ్రీ‌నివాస్ కెరీర్ ఎంతో స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతుంది. ఇది కేవ‌లం రీ రిలీజ్ మాత్ర‌మే కాదు. పుష్క‌ర కాలంలో మా కెరీర్‌లో ఎలా ఎదిగాం అని చూసుకునే తీపి గుర్తు ఈ సినిమా. ఈ సినిమా విడుద‌లైన త‌రువాత సినీ ప‌రిశ్ర‌మ‌లో రూ. 50 ల‌క్ష‌ల‌తో ఎలా సినిమా తీశారు.. అంటూ మా ప్ర‌తిభ‌ను గుర్తించారు. ఎంతో మంది వాళ్ల స‌హ‌కారం అందించారు. ఇలాంటి సినిమా మ‌ళ్లీ వెండితెర‌పై చూసుకోవ‌డం ఆనందంగా ఉంది" అని నిర్మాత ఎస్‌కేఎన్ తెలిపారు.

"ఇది మా ముగ్గురి ఎమోష‌న‌ల్ జ‌ర్ని, కేవ‌లం 50 ల‌క్ష‌ల‌తో చేసిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దర్శ‌కుడు మారుతి అప్ప‌ట్లోనే కంటెంట్ ఈజ్ కింగ్ అని న‌మ్మి ఈ సినిమా తీశాడు. మా ప్ర‌మోష‌న్‌తో సినిమాను మ‌రింత జ‌నాల్లోకి తీసుకువెళ్లాం. ఈ సినిమా ఇన్‌స్పిరేష‌న్‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. మ‌ళ్లీ ఇలాంటి స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ ఈ సినిమాను మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డం సంతోషంగా ఉంది" అని ప్రొడ్యూసర్ శ్రేయాస్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

IPL_Entry_Point