Guppedantha Manasu Serial: వసుధారను కిడ్నాప్ చేసిన రాజీవ్ - రిషి తమ్ముడికి శైలేంద్ర సాయం - కొడుకుపై అనుపమ పంతం
09 May 2024, 7:08 IST
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో మను అడ్డు తొలగిపోవడంతో వసుధారను తన సొంతం చేసుకోవాలని రాజీవ్ అనుకుంటాడు. వసుధారను కిడ్నాప్ చేయబోతాడు. అతడి బారి నుంచి వసుధార తెలివిగా బయటపడుతుంది.
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu Serial:వసుధార పిలిచినట్లు కల కంటాడు రాజీవ్. బావ అనే పిలుపు విని మైమరచిపోతాడు. మరోసారి తనను బావ అని పిలవమని కలలో వసుధారను ప్రేమగా అడుగుతాడు రాజీవ్. వసుధారను చూడాలని కళ్లు తెరుస్తాడు. కానీ అతడి ఎదురుగా వసుధార బదులు శైలేంద్ర ఉంటాడు. శైలేంద్రను చూసి షాకవుతాడు రాజీవ్. మంచి కలను చెడగొట్టావని శైలేంద్రపై ఫైర్ అవుతాడు. మనుకు జైలు శిక్ష ఖరారు అయ్యే వరకు సిటీలో ఉండకుండా ఎక్కడికైనా వెళ్లమని రాజీవ్‌ను హెచ్చరిస్తాడు శైలేంద్ర. కానీ శైలేంద్ర మాటల్ని లెక్కపెట్టడు రాజీవ్. వసుధారను చూడకుండా తాను ఉండలేనని, ఆమె కోసం ఇక్కడే ఉంటానని, ఎక్కడికి వెళ్లనని అంటాడు.
వసుధార డౌట్...
నువ్వు బతికే ఉన్నట్లు వసుధార, మహేంద్రలకు డౌట్ వచ్చిందని, నీ కోసం వాళ్లు వెతుకుతున్నారని రాజీవ్‌తో అంటాడు శైలేంద్ర. వాళ్లకు దొరక్కుండా జాగ్రత్తగా ఉండమని రాజీవ్‌ను హెచ్చరిస్తాడు. నీ నంబర్ కోసం ధరణి తన ఫోన్ కొట్టేసిందని, కానీ తెలివిగా నీ ఫోన్ నంబర్, నీకు పంపించిన మెసేజ్‌లను డిలేట్ చేశానని, ఇక నుంచి తనకు ఫోన్ చేయడం తగ్గించమని రాజీవ్‌కు జాగ్రత్తలు చెబుతాడు శైలేంద్ర.
శైలేంద్ర సలహా....
మను జైలులో ఉన్నాడని, మహేంద్ర డల్‌గా ఉన్నాడని వాళ్లు ఏం చేయలేరని వసుధార ఇంటికి మాత్రం వెళ్లకు అని రాజీవ్‌కు చెబుతాడు శైలేంద్ర. వసుధారను కలవడానికి శైలేంద్రనే మంచి ఐడియా ఇచ్చాడని మనసులో అనుకుంటాడు రాజీవ్. పైకి మాత్రం వసుధారను కలవనని శైలేంద్రకు మాటిస్తాడు. నాకు అడ్డు ఎవరూ లేనప్పుడు వసుధారను కలవకుండా ఎలా ఉండగలనని, ఇప్పుడే ఆమెను చూడాలని ఫిక్సవుతాడు.
మారువేషంలో...
పాలవాడి వేషంలో వసుధార ఇంటికివస్తాడు రాజీవ్. కర్చీఫ్‌పై మత్తు మందు స్ప్రే చేసి వసుధార నోటికి అడ్డంపెడతాడు. దాంతో వసుధార కళ్లు తిరిగి తన ఒడిలో పడిపోయినట్లు రాజీవ్ కల కంటాడు. సరిగ్గా కలలో జరిగినట్లే వసుధారను కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు రాజీవ్. వసుధార ఇంటి తలుపు కొడతాడు. కానీ వసుధార ఇంటి లోపలి నుంచి కాకుండా బయటినుంచి వస్తుంది. వసుధార బయటే ఉండటంతో ఆమెను ఈజీగా కిడ్నాప్ చేయచ్చని రాజీవ్ అనుకుంటాడు. కానీ రాజీవ్‌ను చూసి వసుధార గట్టిగా అరవడంతో మహేంద్ర, అనుపమ లోపలి నుంచి వస్తారు. దాంతో వారిని చూసి రాజీవ్ పారిపోతాడు.
అనుపమ పంతం...
రాజీవ్‌ను పట్టుకుంటేనే మను జైలు నుంచి విడుదలవుతాడని అనుపమ అంటుంది. మనును కొడుకు అని కాకుండా అనుపమ పేరు పెట్టి పిలవడంపై మహేంద్ర ఫైర్ అవుతాడు. కొడుకు విషయంలో ఇప్పుడు కూడా పంతం ఎందుకని కోప్పడుతాడు.
మహేంద్ర ఛాలెంజ్...
మనును కలవడానికి వసుధార, మహేంద్ర పోలీస్ స్టేషన్‌కు వస్తారు. మనునే నేరం చేశాడని ఒప్పిస్తే అతడికి శిక్ష తగ్గుతుందని పోలీస్ ఆఫీసర్ అంటాడు. రాజీవ్‌ను చంపింది మనునే అని వసుధారతో వాదిస్తాడు. మనును ఎలాగైనా జైలు నుంచి విడిపిస్తామని పోలీస్ ఆఫీసర్‌తో మహేంద్ర ఛాలెంజ్ చేస్తాడు.
రాజీవ్‌ను తాను చూశానని తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని మనుతో అంటుంది వసుధార. రాజీవ్‌ను పట్టుకోవడంలో శైలేంద్ర తప్ప మనకు హెల్ప్ చేసేవారు ఎవరూ లేరని వసుధారతో అంటాడు మను. అతడు చెప్పిన పేరు విని వసుధార, మహేంద్ర ఆశ్చర్యపోతారు. ఎండీ సీట్ ఆశ చూపించి శైలేంద్రను మన దారిలోకి తెచ్చుకొని రాజీవ్‌ను పట్టుకోవాలని సలహా ఇస్తాడు మను. కానీ ఆ ప్రయత్నం కూడా చేశామని, కానీ శైలేంద్రకు మాపై డౌట్ రావడంతో అది ఫెయిలైందని మనుతో చెబుతాడు మహేంద్ర.
యాభై కోట్ల అప్పు...
శైలేంద్రను ట్రాప్‌లో ఇరికించడానికి మను కొత్త ప్లాన్ వేస్తాడు. కాలేజీ కోసం తాను యాభై కోట్లు అప్పు ఇచ్చింది అబద్ధమని మను అంటాడు. శైలేంద్రనే కాలేజీ మీద అప్పు ఉన్నట్లు దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేశాడని, అతడి ప్లాన్‌ను తానే తెలివిగా అడ్డుకున్నానని, శైలేంద్ర దగ్గర ఉన్న యాభై కోట్ల చెక్‌ను చింపేశానని అంటాడు.తప్పుడు సాక్ష్యాలు కావడంతో ఇప్పటివరకు యాభై కోట్ల గురించి శైలేంద్ర ఎవరికి చెప్పుకోలేకపోయాడని మను అంటాడు.
ఇప్పుడు ఆ యాభై కోట్ల అప్పును అడ్డం పెట్టుకొని శైలేంద్రను దెబ్బ కొడతానని వసుధారకు చెబుతాడు మను. ఆ అప్పును పదిహేను రోజుల్లో చెల్లించకుంటే తాను కాలేజీని జప్తు చేస్తున్నట్లు నోటీసులు ఇవ్వబోతున్నట్లు, ఆ నోటీసులు చూసి భయపడి శైలేంద్ర మనం చెప్పినట్లు చేస్తాడని వసుధారతో అంటాడు మను. మను చెప్పిన ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయాలని వసుధార, మహేంద్ర అనుకుంటారు.
అనుమ గురించి ఆరా...
జైలు నుంచి మహేంద్ర వెళ్లబోతున్న సమయంలో అనుపమ ఎలా ఉందని మహేంద్రను అడుగుతాడు మను. ఆ మాట విని మహేంద్ర ఆనందంగా ఫీలవుతాడు. అనుపమ, మను మధ్య ఉన్న దూరం తగ్గుతుండటంతో సంతోషపడతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.