Guppedantha Manasu October 10th Episode: ఎండీ సీట్ రిషిదే - శైలేంద్రకు మరో ట్విస్ట్ - దేవయానిని భయపెట్టిన మహేంద్ర
Guppedantha Manasu October 10th Episode: జగతి దూరమైన బాధలో మహేంద్ర మందు తాగుతాడు. అతడిపై దేవయాని సీరియస్ అవుతుంది. తమ కుటుంబం పరువు తీస్తున్నావని కోప్పడుతుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu October 10th Episode: జగతి చనిపోయిన బాధ నుంచి మహేంద్ర కోలుకోలేకపోతాడు. కాలేజీ బోర్డ్ మీటింగ్ నుంచి మధ్యలోనే వెళ్లిపోతాడు. బాగా తాగి రోడ్ పక్కన పడిపోతాడు. మహేంద్ర ఇంటికి రాకపోవడంతో రిషి కంగారు పడతాడు. వసుధారతో కలిసి తండ్రి కోసం వెతుకుతుంటాడు. చివరకు రోడ్ పక్కన తాగి పడిపోయాడని తెలుస్తుంది. తండ్రిని ఆ స్థితిలో చూసి రిషి షాక్ అవుతాడు. మీరు తాగడం ఏంటి అని బాధపడతాడు. మిమ్మల్ని ఇలా చూడటం నా వల్ల కావడం లేదని ఆవేదనకు లోనవుతాడు.
మహేంద్ర ఎమోషనల్...
జగతి ప్రతిరోజు తన పక్కనే ఉండేదని, ఇప్పుడు ఫొటోలో చూడాల్సివస్తుందని మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. మహేంద్రను ఇంటికి రమ్మని రిషి, వసుధార బతిమిలాడుతారు. కానీ జగతి లేని చోటుకు తాను రానని, అక్కడ ఉండలేనని అంటాడు మహేంద్ర.
జగతి జ్ఞాపకాలు తనను వెంటాడుతూనే ఉన్నాయని చెబుతాడు. ఎంత బతిమిలాడినా వినిపించుకోడు చివరకు బలవంతంగా తండ్రిని కారులోకి ఎక్కిస్తాడు రిషి. కొడుకు అమ్మ అని పిలవడంతో జగతి మురిసిపోయిందని, నువ్వు కూడా అత్తయ్య అని పిలిస్తే వినాలని ఆనంద పడిందని వసుధారతో అంటాడు మహేంద్ర. జగతి తనను ఒంటరిని చేసి వెళ్లిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
మహేంద్ర గొడవ...
ఇంటికి రాగానే తాను ఇక్కడ ఉండలేనని, బయటకు వెళ్లిపోతానని గొడవ చేస్తాడు మహేంద్ర. రిషి, వసుధార అతడికి సర్ధిచెబుతారు. తమ్ముడు తాగడం చూసి ఫణీంద్ర షాకవుతాడు. తాగి ఇంటికి వచ్చిన మహేంద్రపై దేవయాని సీరియస్ అవుతంది. తాగేసి ఇంటికి ఎలా వస్తావు అంటూ కోప్పడుతుంది. భార్యపై ఫణీంద్ర ఫైర్ అవుతాడు. నా తమ్ముడు మందుకు బానిస కాదు.
ఈ రోజు ఎందుకు తాగి వచ్చాడో అర్థం చేసుకోలేవా...ఇంతటితో ఆపేయ్ అని అంటాడు. ఇంకో మాట మాట్లాడితే బాగుండదు. నీ బోడి సలహాలు అవసరం లేదని దేవయానిపై కోప్పడుతాడు. ఫణీంద్రను ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని అతడి కాళ్లపై పడిపోతాడు మహేంద్ర.
మేడమ్ కాదు అమ్మ...
జగతి ఎక్కడ అని రిషిని అడుగుతాడు మహేంద్ర. మేడమ్ వస్తుందని రిషి అతడికి సమాధానం చెబుతాడు. మేడమ్ ఏంటి. అలా ఎందుకు పిలుస్తున్నావు. మీ అమ్మ అంటూ కొడుకును కోపగించుకుంటాడు మహేంద్ర. తండ్రి కన్నీళ్లు చూసి రిషి తల్లడిల్లిపోతాడు. పాలు తాగమని తండ్రికి ఇస్తాడు రిషి. కానీ మహేంద్ర తాను తాగాల్సింది పాలు కాదని మందు బాటిల్ తీస్తాడు. ఎంత వారించినా వినడు. జగతి లేదనే బాధను మర్చిపోవాలంటే మందు తాగడం ఒక్కటే పరిష్కారమని అంటాడు. రిషిని కూడా తాగమని బలవంతపెడతాడు.
దేవయాని ఫైర్...
దేవయాని మరోసారి తన నోటికి పనిచెబుతుంది. తాగి రావడమే తట్టుకోలేకపోతున్నాం. పైగా రిషిని తాగమని చెబుతున్నావు. ఇది నీకు కరెక్ట్‌గా అనిపిస్తుందా అంటూ మహేంద్రపై తనకున్న కోపాన్ని బయటపెడుతుంది. భూషణ్ ఫ్యామిలీ అంటే సొసైటీలో ఎంతో పేరుందని, నువ్వు ఇలా తాగి తిరిగితే పరవు మొత్తం పోతుందని అంటుంది.
మహేంద్రను చూసి నువ్వు తాగుడు అలవాటు చేసుకుంటే మన ఇళ్లు, కాలేజీ ఏమైపోతుందని రిషితో అంటుంది దేవయాని. ఎంత బాధ అయినా మోసే శక్తి ఈ గుండెకు ఉందని దేవయానికి సమాధానమిస్తాడు రిషి. ఇకపై ఇలా జరగదని, తండ్రితో తాను మాట్లాడాతనని దేవయానికి సర్ధిచెబుతాడు రిషి.
బాధలకు కారణం...
వదినగారు అంటూ ఒక్కసారిగా మహేంద్ర పైకిలేవడంతో దేవయాని భయపడిపోతుంది. ఆమెకు చేతులు జోడించి దండం పెట్టి అన్ని పోగోట్టుకున్నా....చివరకు నా బాధను పోగోట్టుకోవడానికి తెచ్చుకున్న బాటిల్ కూడా లాగేసుకుంటారా అని దేవయానితో అంటాడు మహేంద్ర. నీ బాధలన్నింటికి నేనే కారణమైనట్లు అలా మాట్లాడుతున్నావేంటి మహేంద్ర అంటూ దేవయాని తడబడిపోతుంది. అవును అన్ని మీరే చేశారు.
అంత మీరే చేశారని మహేంద్ర అనడంతో దేవయాని కంగారు పడుతుంది. నా మంచికోసం ఆలోచిస్తున్నానని అంటున్నారు...నా బాధ మొత్తం పోగొట్టి ఆ పుణ్యం మీరే కట్టుకొండి అంటూ దేవయానితో అంటాడుమహేంద్ర. నా జగతిని నాకు తిరిగి తెప్పించమని అంటాడు. లేదంటే నన్నే జగతి దగ్గరకు పంపించమని చెబుతాడు. అప్పుడు మీరు హ్యాపీ...నేను హ్యాపీ అని అంటాడు. అలా చేస్తే జన్మజన్మలకు రుణపడి ఉంటానని, నన్ను చంపేయమని దేవయానితో అంటాడు మహేంద్ర.
ఫణీంద్ర కోపం...
దేవయాని తన మాటల ప్రవాహం ఆపకపోవడంతో ఫణీంద్ర సీరియస్ అవుతాడు. ఇప్పుడైనా నువ్వు నోరు మూసుకుంటావా...ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ కోప్పడుతాడు. నేనేదో మహేంద్రను బాగు చేద్దామనుకుంటే అందరూ నన్నే తప్పుపడుతున్నారని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని.
ఎండీ సీట్...
జగతి చనిపోయిందనే బాధలో ఉండి మన పనులు, బాధ్యతల్ని విస్మరిస్తే ఎన్నో కష్టాలు పడాల్సివస్తుందని, తమనే నమ్మకున్న స్టూడెంట్స్, ఎంప్లాయిస్ జీవితాలు అగమ్యగోచరమైపోతాయని రిషితో అంటాడు ఫణీంద్ర. ఈ కష్టాలన్నీ తొలగిపోవాలంటే నువ్వు ఎండీ సీట్‌లో కూర్చోవాలని రిషిని కోరుతాడు. మహేంద్రను ఆ పదవిలో కూర్చోబెడదామంటే తను మాట వినే పరిస్థితిలో లేడని, ఈ పదవికి నువ్వే కరెక్ట్ అని బతిమిలాడుతాడు. కానీ రిషి అందుకు ఒప్పుకోడు. ఎవరో కాలేజీని టార్గెట్ చేశారని, వారి కుట్రకు జగతి బలైపోయిందని, వారు ఎవరో తెలుసుకోవాలంటే నువ్వు కాలేజీకి రావాలని ఫణీంద్ర బతిమిలాడుతాడు.
ప్రాబ్లెమ్ సాల్వ్....
నేను కాలేజీకి రాకపోవడానికి కారణం కూడా మీ అందరికి తెలుసు, ఈ విషయంలో నాపై ఒత్తిడి తేవద్దని ఫణీంద్రతో అంటాడు రిషి. ఆ కారణం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదని వసుధార చెబుతుంది. తాను, ఫణీంద్ర గారు మినిస్టర్‌తో పాటు ఎస్ఐని కలిసి ఆ ప్రాబ్లెమ్‌ను సాల్వ్ చేశామని చెబుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.