Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం-guppedantha manasu may 7th episode shailendra advised rajiv to hide from vasundhara guppedantha manasu today serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం

Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం

Nelki Naresh Kumar HT Telugu
May 07, 2024 08:23 AM IST

Guppedantha Manasu Serial: శైలేంద్ర బ‌తికే ఉన్నాడ‌నే నిజం ధ‌ర‌ణి ద్వారా వ‌సుధార తెలుసుకుంటుంది. మ‌రోవైపు డీఎన్ఏ రిపోర్ట్‌లో మ‌ను మ‌ర్డ‌ర్ చేసింది రాజీవ్‌నే అని తేలుతుంది. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu Serial: రాజీవ్‌తో క‌లిసి శైలేంద్ర చేస్తోన్న కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెట్టి మ‌నును జైలు నుంచి విడిపించాల‌ని వ‌సుధార‌, మ‌హేంద్ర ప్ర‌య‌త్నిస్తారు. ఈ ప్లాన్‌లో భాగంగా శైలేంద్ర‌ను సీక్రెట్‌గా మ‌హేంద్ర ఫాలో అవుతుంటాడు. త‌న‌ను మ‌హేంద్ర ఫాలో అవుతోన్న విష‌యాన్ని శైలేంద్ర క‌నిపెడ‌తాడు.

రాజీవ్ బ‌తికే ఉన్నాడ‌ని త‌న‌కు తెలిసింద‌ని, అత‌డి కోస‌మే తాను వెతుకుతున్నాన‌ని , అంతే త‌ప్ప నిన్ను ఫాలో కావ‌డం లేద‌ని శైలేంద్రతో అంటాడు మ‌హేంద్ర‌. తాను కూడా రాజీవ్‌ను వెతికే ప‌నిలో ఉన్నాన‌ని మ‌హేంద్ర‌తో అబ‌ద్ధం ఆడుతాడు శైలేంద్ర‌.

ప్లాన్ ఫెయిల్‌...

శైలేంద్ర‌కు దొరికిపోవ‌డంతో త‌న ప్లాన్ ఫెయిలైన‌ట్లేన‌ని మ‌హేంద్ర భ‌య‌ప‌డిపోతాడు. ఇక‌పై శైలేంద్ర మ‌న‌ల్ని న‌మ్మ‌డ‌ని, ఎండీ సీట్ ఇస్తాన‌ని చెప్పిన తీసుకోక‌పోవ‌చ్చున‌ని వ‌సుధార‌తో అంటాడు మ‌హేంద్ర‌. శైలేంద్ర జ‌గ‌త్ కంత్రీ అని, ఎండీ సీట్ కోసం కుట్ర‌లు చేయ‌డం ఆప‌డ‌ని కోపంగా అంటాడు. మ‌న ప్లాన్‌ల గురించి ఎవ‌రో శైలేంద్ర‌కు చెబుతున్నార‌ని వ‌సుధార అనుమాన‌ప‌డుతుంది. మ‌న‌ల్ని ఎవ‌రో ఫాలో అవుతున్నార‌ని, అది రాజీవ్ అయ్యుండ‌వ‌చ్చ‌ని అంటుంది.

సీక్రెట్‌గా వ‌సుధార‌, మ‌హేంద్ర మాట్లాడుకుంటున్న మాట‌ల‌ను రాజీవ్ వింటుంటాడు. వ‌సుధార గెస్ నిజం అవ‌డం చూసి షాక‌వుతాడు. రాజీవ్ త‌ల‌దాచుకోవ‌డం గురించే ఆలోచిస్తుంటాడ‌ని, మ‌న‌ల్ని ఫాలో అయ్యేంత సీన్ వాడికి లేద‌ని మ‌హేంద్ర అంటాడు. ఓ ప్లాన్ ఫెయిల‌వ్వ‌డంతో మ‌రో ప్లాన్ వేసి మ‌నును జైలు నుంచి విడిపించాల‌ని వ‌సుధార‌తో చెబుతాడు మ‌హేంద్ర‌. ఇక‌పై ఈ దాగుడుమూత‌ల‌కు పుల్‌స్టాప్ పెట్టి వ‌సుధార‌పై డైరెక్ట్ ఎటాక్ చేయాల‌ని రాజీవ్ ఫిక్స‌వుతాడు.

మ‌నుకు వ్య‌తిరేకంగా డీఎన్ఏ రిపోర్ట్‌...

మ‌ను కోసం పోలీస్ స్టేష‌న్ వెళ‌తారు మ‌హేంద్ర‌, వ‌సుధార‌, అనుప‌మ‌. అప్పుడే డెడ్‌బాడీ డీఎన్ఏ రిపోర్టులు వ‌చ్చాయ‌ని, అది రాజీవ్ డెడ్‌బాడీగా తేలింద‌ని పోలీస్ ఆఫీస‌ర్ చెబుతాడు. అత‌డి మాట‌లు విని ముగ్గురు షాక‌వుతారు.

మ‌నును కాపాడ‌టం ఎవ‌రి వ‌ల్ల కాద‌ని, మ‌నుకు శిక్ష ప‌డ‌టం ఖాయ‌మ‌ని పోలీస్ ఆఫీస‌ర్ అంటాడు. నేరం ఒప్పుకుంటే మ‌ను లాంటి క్రిమిన‌ల్స్‌కు శిక్ష త‌ప్పుతుంద‌ని చెబుతాడు. మ‌నును పోలీస్ ఆఫీస‌ర్ క్రిమిన‌ల్ అన‌గానే వ‌సు ఫైర్ అవుతుంది. నేరం రుజువు కాక‌ముందే మ‌నును ఎలా క్రిమిన‌ల్ అంటార‌ని ఫైర్ అవుతుంది.

మ‌ను క‌ళ్ల‌లో భ‌యం...

పోలీస్ ఆఫీస‌ర్ మాట‌ల‌తో మ‌ను కూడా భ‌య‌ప‌డిపోతాడు. తాను శిక్ష ప‌డ‌టం ఖాయ‌మ‌ని అనుకుంటాడు. మ‌ను క‌ళ్ల‌లోని భ‌యాన్ని అనుప‌మ క‌నిపెడుతుంది. త‌న కొడుకును తాను పిరికివాడిగా పెంచ‌లేద‌ని, ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా, ఎన్ని క‌ష్టాలు ఎదురైన ధైర్యంగా ఉండ‌ట‌మే నేర్పాన‌ని, ఎంత భార‌మైన స‌రే ఒక్క క‌న్నీటిచుక్క కూడా బ‌య‌ట‌ప‌డొద్ద‌ని పెంచాన‌ని మ‌నుతో అంటుంది అనుప‌మ‌.

తాను భ‌య‌ప‌డుతుంది శిక్ష గురించి కాద‌ని, త‌న తండ్రి ఎవ‌రో తెలుసుకోలేక‌పోతున్నందుక‌ని మ‌ను అంటాడు. అత‌డి స‌మాధానం విని అనుప‌మ షాక‌వుతుంది. తాను జైలుకు వెళితే...ఎప్ప‌టికీ తండ్రి ఎవ‌రో తాను తెలుసుకోలేన‌ని మ‌ను అంటాడు. మీరు ఈ విష‌యంలో ఎలాంటి భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌ని, త్వ‌ర‌లోనే తండ్రి ఎవ‌ర‌నే నిజం మీకు తెలుస్తుంద‌ని మ‌నుతో అంటుంది వ‌సుధార‌.

ఇన్నేళ్ల మీ ఎదురుచూపుల‌కు త‌ప్ప‌కుండా స‌మాధానం దొరుకుతుంద‌ని వ‌సుధార చెబుతుంది. నువ్వు అంగీక‌రించిన‌, అంగీక‌రించ‌క‌పోయినా నీ తండ్రి స్థానంలో నేను ఉన్నాన‌ని మ‌నుతో అంటాడు మ‌హేంద్ర‌. నా ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి అయినా నిన్ను జైలు నుంచి విడిపిస్తాన‌ని మాటిస్తాడు. మీరు ఏ త‌ప్పు చేయ‌లేద‌ని మేము నిరూపిస్తామ‌ని వ‌సుధార అంటుంది.

శైలేంద్ర అనుమానం...

త‌న‌పై మ‌హేంద్ర‌కు డౌట్ రావ‌డం చూసి శైలేంద్ర‌లో కంగారు మొద‌ల‌వుతుంది. మ‌రోవైపు ఎండీ సీట్ వ‌దులుకోవ‌డానికి వ‌సుధార సిద్ధ‌ప‌డ‌టం వెనుక ఎదో మ‌త‌ల‌బు ఉంద‌ని డౌట్ ప‌డ‌తాడు. రాజీవ్ బ‌య‌ట‌తిర‌గ‌డం చూసి భ‌య‌ప‌డిపోతాడు. అత‌డు దొరికితే త‌న ప్లాన్ మొత్తం ఫెయిల‌వుతుంద‌ని గాబ‌రా ప‌డ‌తాడు. అప్పుడే ఓ కాలేజీ ఫైల్ తీసుకొని శైలేంద్ర సంత‌కం కోసం అటెండ‌ర్ వ‌స్తాడు.

కానీ ఆ ఫైల్ పై సంత‌కం పెట్ట‌డానికి శైలేంద్ర ఒప్పుకోడు. వ‌సుధార‌నే ఫైల్ తీసుకొని వ‌స్తుంది. త‌న‌ను ట్రాప్‌లో పెట్ట‌డానికే సంత‌కం కోసం వ‌చ్చావ‌ని, ఎంత చేసిన రాజీవ్ ర‌హ‌స్యం త‌న నుంచి బ‌య‌ట‌పెట్ట‌లేర‌ని వ‌సుధార‌తో అంటాడు శైలేంద్ర‌. త‌న‌కు తెలియ‌కుండానే రాజీవ్ బ‌తికే ఉన్నాడ‌న్న నిజాన్ని బ‌య‌ట‌పెడ‌తాడు.

నువ్వునిజాల్ని బ‌య‌ట‌పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని, రాజీవ్ బ‌తికే ఉన్నాడ‌ని, అత‌డు ఎక్క‌డ ఉన్నాడో త‌న‌కు తెలుసున‌ని శైలేంద్ర‌తో అంటుంది వ‌సుధార‌. రాజీవ్‌ను ప‌ట్టుకొని, నువ్వు, అత‌డు క‌లిసి చేస్తోన్న కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెట్టి మ‌నును నిర్ధోషిగా విడిపిస్తాన‌ని శైలేంద్ర‌తో ఛాలెంజ్ చేస్తుంది వ‌సుధార‌.

రాజీవ్‌కు ఫోన్‌...

వ‌సుధార మాట‌ల‌తో కంగారు ప‌డ్డ శైలేంద్ర వెంట‌నే రాజీవ్‌కు ఫోన్ చేస్తాడు. ఇప్ప‌టి నుంచి జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని లేదంటే మ‌న బండారం మొత్తం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అంటాడు. వ‌సుధార భ‌య‌పెట్ట‌గానే నాకు వెంట‌నే ఎలా ఫోన్‌చేస్తావ‌ని, ఒక‌వేళ నీ నంబ‌ర్‌ను ట్రాప్ చేస్తే నేను ఎక్క‌డున్నాన‌నే నిజం బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని శైలేంద్ర‌కు క్లాస్ ఇస్తాడు రాజీవ్‌. ఇద్ద‌రు ఫోన్‌లోనే గొడ‌వ‌ప‌డ‌తారు.

ధ‌ర‌ణికి వార్నింగ్‌...

రాజీవ్‌తో శైలేంద్ర ఫోన్ మాట్లాడుతుండ‌టం ధ‌ర‌ణి చూస్తుంది. సీక్రెట్‌గా భ‌ర్త మాట‌లు విన‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. కానీ శైలేంద్ర క‌నిపెట్టి ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. ఆ త‌ర్వాత వ‌సుధార‌కు ఫోన్ చేసిన ధ‌ర‌ణి.. రాజీవ్‌తో శైలేంద్ర మాట్లాడుతుంది నిజ‌మేన‌ని చెబుతుంది.

రాజీవ్ బ‌తికే ఉన్నాడ‌ని అంటుంది. శైలేంద్ర‌మాట్లాడిన ఫోన్ నంబ‌ర్ దొరికితే రాజీవ్ ఎక్క‌డున్నాడో క‌నిపెట్ట‌వ‌చ్చిన వ‌సుధార అనుకుంటుంది. ఆ నంబ‌ర్‌ను ఎలాగైనా సంపాదించమ‌ని ధ‌ర‌ణిని కోరుతుంది. క‌ష్ట‌మైన స‌రై త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని వ‌సుధార‌కు మాటిస్తుంది ధ‌ర‌ణి. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

IPL_Entry_Point