Guppedantha Manasu March 22th Episode: అడ్డంగా బుక్కైన శైలేంద్ర - అనుపమను టార్గెట్ చేసిన దేవయాని -ఏంజెల్ లవ్‌స్టోరీ
Guppedantha Manasu March 22th Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో తమ కుటుంబానికి ఆపద తలపెడుతోన్న శత్రువులు ఎవరో కనిపెట్టే బాధ్యతను శైలేంద్రకు అప్పగిస్తాడు ఫణీంద్ర. సాక్ష్యాధారాలతో వారిని పట్టుకోవాలని శైలేంద్రతో చెబుతాడు.
Guppedantha Manasu March 22th Episode: అనుపమ ఆరోగ్యం గురించి దేవయాని ఆరాలు తీస్తుంది. అనుపమ ఎలా ఉంది, ట్యాబ్లెట్స్ వేసుకుంటుందా? మహేంద్రపై ఫోన్‌లో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మొక్కుబడిగా ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతాడు మహేంద్ర. అనుపమను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు అని మహేంద్రను అడుగుతుంది దేవయాని. తనకు తెలియదని మహేంద్ర నిర్లక్ష్యంగా బదులిస్తాడు.
అనుపమ విషయంలో మీరు ఎందుకు అంతగాఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదని దేవయానితో అంటాడు మహేంద్ర. అనుపమ నీ బెస్ట్ ఫ్రెండ్. నీకు జగతికి పెళ్లి చేసింది. కష్టాల్లో ఉన్న నీకు తోడుగా నిలిచింది. అలాంటి అనుపమ బాగోగులు తెలుసుకోకపోతే ఎలా అని దేవయాని ఆన్సర్ ఇస్తుంది.
మీరు తెలుసుకున్న, తెలుసుకోకపోయినా పెద్దగా ఉపయోగం ఏం లేదని దేవయానికి పంచ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు మహేంద్ర. అతడి సమాధానం విని దేవయాని రుసరుసలాడుతుంది. ఫణీంద్ర కూడా తమ్ముడినే వెనకేసుకు వస్తాడు. దేవయానినే తప్పుపడతాడు.
శత్రువు ఎవరు?
తమ కుటుంబసభ్యులపై ఎటాక్‌లు జరగడం, ఒకదాని తర్వాత మరొకటి కష్టాలు వరుసగా రావడంతో ఫణీంద్ర ఆలోచనలో పడతాడు. మన శత్రువులు ఎవరో నీకు తెలుసా అని శైలేంద్రను అడుగుతాడు. ఆ ప్రశ్నకు శైలేంద్ర కంగారు పడతాడు. తల్లినే చూస్తూ ఉండిపోతాడు. తండ్రి మరోసారి గట్టిగా అడగడటంతో తనకు తెలియదని అబద్ధం ఆడుతాడు.
కాలేజీని దక్కించుకోవడం కోసమే ఎవరో ఈ కుట్రలన్నీ పన్నుతున్నారని ఫణీంద్ర అంటాడు. డీబీఎస్‌టీ కాలేజీ శత్రువులు ఎవరో కనిపెట్టే బాధ్యతను శైలేంద్రకు అప్పగిస్తాడు ఫణీంద్ర. శత్రువులను సాక్ష్యాధారాలతో పట్టుకోవాలని చెబుతాడు.
ఏంజెల్ ప్రేమ...
అనుపమ గురించే ఆలోచిస్తూ భోజనం కూడా చేయకుండా మను కూర్చొని ఉండిపోతాడు. అతడి కోసం శాండ్‌విచ్ తీసుకొస్తారు ఏంజెల్, వసుధార. కానీ అతడు శాండ్‌విచ్ తిననని అంటాడు. అమ్మ ప్రేమ కోసం ఎన్నో రోజుల పాటు తినకుండా ఎదురుచూసిన రోజులు ఉన్నాయని మను సమాధానం చెబుతాడు.
అమ్మకు నేనే దూరంగా ఉన్నప్పుడు నా ఆకలితో పనేం ఉంది అంటూ ఎమోషనల్‌గాసమాధానం చెబుతాడు. బలవంతంగా అతడితో ఏంజెల్ శాండ్‌విచ్ తినిపిస్తుంది. అతడికి పొలమారడంతో ఏంజెల్ కంగారు పడుతుంది. వాటర్ తీసుకొచ్చి తాగిస్తుంది. మనుపై ప్రేమను కురిపిస్తుంది.
మహేంద్రతో ఏంజెల్ పోటీ...
అనుపమ కోలుకుందని, రేపు ఉదయమే ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెబుతుంది. ఆమె ఇంటికి తీసుకెళ్లడానికి మహేంద్ర, ఏంజెల్ పోటీపడతారు. పక్కనుండి అత్తయ్య బాగోగులు చూసుకోవాలని ఉందని, ఆమెను తన ఇంటికి తీసుకెళతానని ఏంజెల్ పట్టుపడుతుంది.
ఇన్ని రోజులు మాకు అండగా అనుపమ ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను మీ ఇంటికి పంపించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదని మహేంద్ర అంటాడు. అత్తయ్యలో తల్లి ప్రేమను చూడాలని తాను కోరుకుంటున్నట్లు ఏంజెల్ ఎమోషనల్‌గా మహేంద్రతో అంటుంది.
అనుపమను ఎలాగైనా మన ఇంటికే నువ్వే తీసుకురావాలని వసుధారతో అంటాడు మహేంద్ర. వారి వాదనను వసుధార ఆపేస్తుంది. ఎక్కడికి వెళ్లాలన్నది అనుపమ ఇష్టమని వసుధార, మను చెబుతారు.
శైలేంద్ర అసహనం...
మను అడ్డు తొలగించుకోవాలని తాను వేసిన ప్లాన్ బెడిసికొట్టడం శైలేంద్ర తట్టుకోలేకపోతాడు. దేవయాని మాత్రం కూల్‌గా ఉంటుంది. చిన్న విషయాల గురించి అతిగా ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడొద్దని కొడుకుకు సలహా ఇస్తుంది. మన వేసిన ప్లాన్స్ ఫెయిలైనా కొత్తగా ఆలోచిస్తూ లక్ష్యం కోసం ప్రతిక్షణం ప్రయత్నించాలని శైలేంద్రకు ధైర్యం చెబుతుంది.
మనును దెబ్బకొట్టడానికి అతడి తండ్రి ఎవరో తెలుసుకోమని శైలేంద్రతో అంటుంది. ఆ రహస్యం తెలిస్తే మను, వసుధారలతో ఆట ఆడుకోవచ్చునని దేవయాని చెబుతుంది. అనుపమ డిశ్చార్జ్ అయిన ఆమెను వెళ్లి కలిసి అనుపమకు గట్టి డోస్ ఇవ్వాలని దేవయాని ఫిక్సవుతుంది.
తల్లికి అండగా మను…
అనుపమను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. కారు దిగిన తర్వాత నడవలేకపోతుంది అనుపమ. తూలి కిందపడబోతుంది. ఆమెను మను పట్టుకుంటాడు. జాగ్రత్త అంటూ మహేంద్ర అంటాడు. చూసుకోవడానికి తన కొడుకు ఉన్నాడని వసుధార సర్ధిచెబుతుంది.
తన ఇంటికి వెళ్లిపోతానని అనుపమ పట్టుపడుతుంది. నువ్వు పేషెంట్‌వని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉండటమే కరెక్ట్ మహేంద్ర సర్ధిచెబుతాడు. ఇప్పుడే కాదు నేను పాతికేళ్ల నుంచి పేషెంట్‌నని, మనసులో బాధను మోస్తూనే ఉన్నానని అనుపమ ఫిలాసఫికల్‌గా సమాధానం చెబుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.