Guppedantha Manasu January 4th Episode: కిడ్నాపర్ల నుంచి వసు సేఫ్ - శైలేంద్రకు షాకిచ్చిన ముకుల్ - ఫణీంద్ర వార్నింగ్
Guppedantha Manasu January 4th Episode: వసుధారను రౌడీలతో కిడ్నాప్ చేయిస్తాడు శైలేంద్ర. ముకుల్ ఆమెను కాపాడుతాడు. ఆ రౌడీల సాయంతోనే శైలేంద్రను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ముకుల్ స్కెచ్ వేస్తాడు. ఇంకా నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu January 4th Episode: రిషిని కలవడానికి వచ్చిన వసుధారను రౌడీలతో కిడ్నాప్ చేయిస్తాడు శైలేంద్ర. వసుధార తనకు చేసిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆమె అడ్డు తొలగించుకొని తాను డీబీఎస్‌టీ కాలేజీకి ఎండీ కావాలని కలలుకంటాడు శైలేంద్ర.
ముకుల్ హెల్ప్...
వసుధార కిడ్నాప్ అయిన విషయం పెద్దమ్మ ద్వారా తెలుసుకున్న రిషి ఆ విషయం ముకుల్‌కు ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటాడు. అతడికి కాల్ చేస్తాడు. వసుధార నంబర్ నుంచి రిషి ఫోన్ చేయడం చూసి ముకుల్ షాకవుతాడు. అదే విషయం రిషిని అడుగుతాడు. వసుధార వచ్చి తనను కలిసిందని ముకుల్‌తో చెబుతాడు రిషి.కానీ ఆ తర్వాత ఆమెను ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారని చెబుతాడు. మీ దగ్గరకు ఒంటరిగా వచ్చి వసుధార తప్పు చేసిందని రిషితో అంటాడు ముకుల్. వసుధారను తాను సేవ్ చేస్తానని రిషికి మాటిస్తాడు ముకుల్.
శైలేంద్ర ఆనందం....
వసుధారను కిడ్నాప్ చేసిన రౌడీలు కట్టిపడేస్తారు. ఆమె దగ్గరకు శైలేంద్ర బయలుదేరుతాడు. నా దగ్గర నుంచి నిన్ను ఎవరూ కాపాడలేరు. నాకు ఎండీ సీట్ ఇస్తే నీకు, రిషికి ఈ పరిస్థితి వచ్చేది కాదని మనసులో అనుకుంటాడు. వసుధారకు స్పృహ వస్తుంది. శైలేంద్రనే తనను కిడ్నాప్ చేశాడని అర్థం చేసుకుంటుంది. ఎండీ సీట్ కోసమే అతడు ఈ పని చేసి ఉంటాడని, ఇప్పుడు ఇక్కడకు వచ్చి అగ్రిమెంట్ పేపర్స్‌పై తనతో తప్పకుండా సంతకం చేయించుకుంటాడని భయపడుతుంది.
ముకుల్ ఎంట్రీ...
సడెన్‌గా వసుధారను కిడ్నాప్ చేసిన రౌడీల ముందుకు ముకుల్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలను చితక్కొట్టి వసుధారను సేవ్ చేస్తాడు. వసుధారను అక్కడి నుంచి పంపిస్తాడు. వసుధారను కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరో తనకు ఇప్పుడే చెప్పాలని రౌడీలను బెదిరిస్తాడు ముకుల్. మాతో డీల్ కుదుర్చుకున్న వ్యక్తి పేరు తమకు తెలియదని రౌడీలు చెబుతారు. అప్పుడే రౌడీలకు శైలేంద్ర ఫోన్ చేస్తాడు. వారితో వసుధార ఇక్కడే ఉందని చెప్పిస్తాడు ముకుల్. శైలేంద్ర ఇక్కడికి రాగానే అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అనుకుంటాడు.
ఫణీంద్ర క్లాస్...
శైలేంద్ర ఏదో కుట్ర చేశాడని ధరణి భావిస్తుంది. అతడిని ఎలాగైనా ఆపాలని పదే పదే ఫోన్ చేస్తుంది కానీ అతడు లిఫ్ట్ చేయడు. ఆ విషయం తెలిసిన ఫణీంద్ర...ధరణి ఫోన్ నుంచి శైలేంద్రకు కాల్ చేస్తాడు. ధరణినే ఫోన్ చేసిందని అనుకున్న శైలేంద్ర బుద్ది లేదా అంటూ మాటలు జారుతాడు. కాల్ కట్ చేసిన ఎందుకు పదేపదే ఫోన్ చేస్తున్నావని క్లాస్ ఇస్తాడు. కానీ ధరణి వాయిస్ కాకుండా తండ్రి వాయిస్ వినిపించడంతో శైలేంద్ర షాకవుతాడు. ధరణిపై ఎందుకు కొప్పడుతున్నావని కొడుకుపై ఫైర్ అవుతాడు ఫణీంద్ర. ధరణి ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని, ఎక్కడికి వెళ్లావని క్లాస్ ఇస్తాడు. వెంటనే ఇంటికి తిరిగి రమ్మని శైలేంద్రకు చెబుతాడు. ఇంకోసారి ధరణిపై కొప్పడితే బాగుండదని వార్నింగ్ ఇస్తాడు.
భద్ర షాక్...
వసుధారను కిడ్నాప్ చేసిన ప్లేస్‌కు భద్ర వస్తాడు. అక్కడ ముకుల్‌ను చూసి షాకవుతాడు. ఆ విషయం శైలేంద్రకు ఫోన్ చేసి చెబుతాడు. ఇక్కడికి వస్తే ముకుల్‌కు నువ్వు దొరికిపోతావని హెచ్చరిస్తాడు. కానీ భద్ర మాటలను శైలేంద్ర నమ్మడు. కావాలనే అతడు అబద్ధం చెబుతున్నాడని అనుకుంటాడు. నీ కోసమే ముకుల్ ప్లాన్ చేసి వెయిట్ చేస్తున్నాడని శైలేంద్రకు చెబుతాడు భద్ర. ఇక్కడి నుంచి వెళ్లిపోకపోతే మీ కారులోనే మిమ్మల్ని ముకుల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం ఖాయమని అంటాడు. వెంటనే ఇంటికి వెళ్లిపొమ్మని అంటాడు. భద్ర చెప్పినట్లే చేయాలని శైలేంద్ర ఫిక్సవుతాడు. రౌడీలు ఎక్కడ తన పేరు చెబుతాడోనని శైలేంద్ర భయపడతాడు. వారిని ముకుల్ దగ్గర నుంచి తాను తప్పిస్తానని శైలేంద్రకు హామీ ఇస్తాడు భద్ర. అన్నట్లుగా పొగ బాంబ్ రూమ్‌లో వేసి ముకుల్ బారి నుంచి రౌడీలను తప్పిస్తాడు.
రిషి, వసుధార కలిసి...
ముకుల్ సాయంతో రౌడీల దగ్గర నుంచి బయటపడిన వసుధార రిషి దగ్గరకు వెళుతుంది. అతడిని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. చాలా రోజుల తర్వాత రిషితో కలిసి కారులో జర్నీ చేయడం చూసి వసుధార ఎమోషనల్ అవుతుంది. ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటుంది.
మీరు ఎలా కిడ్నాప్ అయ్యారని రిషిని అడుగుతుంది వసుధార. ఓ అపరిచిత వ్యక్తి తనకు ఫోన్ చేసి...జగతి హత్య గురించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తానని కాల్ చేశాడని వసుధారతో చెబుతాడు రిషి. నిజమని నమ్మి వెళితే తనను కిడ్నాప్ చేశారని, వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో లోయలో పడి గాయాలపాలయ్యానని వసుధారకు చెబుతాడు రిషి. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.