Guppedantha Manasu February 28th Episode:దేవయాని నటనకు శైలేంద్ర ఫిదా - తప్పు చేసిన మహేంద్ర - వసుకు మను సాయం
Guppedantha Manasu February 28th Episode: వసుధారకు తెలియకుండా రిషి కర్మకాండలు జరిపిస్తుంటాడు మహేంద్ర. మను సహాయంతో అక్కడికి వచ్చిన వసుధార తనకు కర్మకాండలు జరిపించమని రిషి ఫొటో పక్కన తన ఫొటో పెడుతుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?

Guppedantha Manasu February 28th Episode: శైలేంద్ర, దేవయాని చేస్తోన్న కుట్రలను ఫణీంద్రకు చెప్పాలని అనుకుంటుంది ధరణి. కానీ ఆమె నిజాలు చెప్పకుండా దేవయాని అడ్డుకుంటుంది. రిషి చనిపోయిన తర్వాత తాను పడుతోన్న ఆవేదనను మీకు చెప్పాలని ధరణి అనుకుంటుందని టాపిక్ డైవర్ట్ చేస్తుంది దేవయాని. రిషిపై ప్రేమను కురిపిస్తుంది.
నేను బతికి ఉండగానే నా కళ్ల ముందే నా బిడ్డకు కర్మకాండలు చేయాల్సివస్తుందని ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది దేవయాని. ఇదంతా చూస్తుంటే నా గుండెలు పగిలిపోతున్నాయని ఎమోషనల్ అవుతుంది. రిషి చనిపోయిన తర్వాత నిద్ర కూడా సరిగా రావడం లేదని, ఎవరు పిలిచినా తనకు రిషి గొంతులాగే అనిపిస్తుందని దేవయాని అంటుంది.
శైలేంద్ర యాక్టింగ్...
తల్లి నటనకు శైలేంద్ర ఫిదా అవుతాడు. నువ్వు మహానటివి అంటూ తల్లిపై మనసులోనే పొగడ్తలు కురిపిస్తాడు. తల్లిని ఓదార్చుతున్నట్లుగా మాట్లాడుతూ శైలేంద్ర కూడా డ్రామాను రక్తికట్టిస్తాడు. రిషి దూరమైన తర్వాత తనకు ఏ విషయంలో ధైర్యం సరిపోవడం లేదని, రిషి పోతూ పోతూ మన ఇంటికి చీకటి చేసి పోయాడని శైలేంద్ర కూడా ఎమోషనల్ అవుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తాడు. ఫణీంద్ర వారి బుట్టలో పడిపోతాడు. శైలేంద్ర, దేవయాని మోసాల గురించి నిజం చెప్పాలని అనుకున్న ధరణి వారి యాక్టింగ్ చూసి ఆగిపోతుంది.
వసుధారకు అబద్ధం...
తన చేతుల మీదుగా రిషికి కర్మకాండలు జరిపించాల్సిరావడం మహేంద్ర తట్టుకోలేకపోతాడు. వసుధార కోసమే తన బాధను, దుఃఖాన్ని దిగమింగుకున్నానని, కానీ ఆమెకు ఇప్పుడు అబద్ధం చెప్పాల్సివస్తుందని తల్లడిల్లిపోతాడు. నీకు కర్మకాండలు జరిపిస్తున్నామనే విషయం తెలిసి వసుధార ఎలా రియాక్ట్ అవుతుందోనని భయపడుతున్నానని రిషి ఫొటో చూస్తూ అంటాడు మహేంద్ర.
నేను కార్మకాండలు చేయకపోతే పెదనాన్న ఫణీంద్ర నీకు తండ్రి స్థానంలో ఉండి కర్మకాండలు చేస్తానని అంటున్నాడని, నన్ను ఎందుకు ఇరకాటంలో పెట్టి వెళ్లిపోయావని రిషి ఫొటో చూస్తూ మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ధరణి అసహ్యం...
భర్త చేస్తోన్న దుర్మార్గాలను సహించలేక ధరణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను ఓదార్చాలని శైలేంద్ర ప్రయత్నిస్తాడు. అతడి ప్రేమ నాటకమని ధరణి తేల్చేస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టమని ధరణికి బదులిస్తాడు శైలేంద్ర. నువ్వు కొట్టిన, తిట్టిన భరిస్తానని, కానీ ఎండీ సీట్ విషయంలో మాత్రం తనకు అడ్డు రావద్దని భార్యకు చెబుతాడు.
నాకు ఎండీ సీట్‌పై మాత్రమే ఆశ ఉందని, అంతే కానీ వసుధారపై కోపం లేదని చెబుతాడు. ఎండీ సీట్‌ను నాకు వాళ్లు మొదటే అప్పగిస్తే ఈ కక్షలు, కుట్రలు ఉండేవి కావని భార్యతో అంటాడు శైలేంద్ర. ఎండీ సీట్ కోసం హత్యలు చేయాలా? ప్రాణాలు తీసి సాధించుకోవడం మనిషి లక్షణం కాదని, అలాంటి బతుకు ఓ బతుకే కాదని భర్తను కన్వీన్స్ చేయడానికి ధరణి ప్రయత్నిస్తుంది.
ఎండీ సీట్ కోసం ఎన్ని ఘోరాలు, నేరాలు చేసినా తనకు పాపం అనే ఫీలింగ్ కలగదని శైలేంద్ర ఆన్సర్ ఇస్తాడు. మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుందని శైలేంద్రతో అంటుంది ధరణి. ఇదంతా ఒక్కరోజే...రేపు రిషి కర్మకాండలు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిపిస్తే తన పని పూర్తవుతుందని, ఆ తర్వాతే నీ ఫోన్‌ను నీకు ఇచ్చేస్తానని ధరణికి చెబుతాడు శైలేంద్ర.
వసుధార కంగారు...
మహేంద్ర ఇంట్లో కనిపించకపోవడంతో వసుధార కంగారు పడుతుంది. వసుధారతో పాటు అనుపమ కూడా మహేంద్రకు ఫోన్ చేస్తుంది. కానీ అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వసుధార టెన్షన్ మరింత పెరుగుతుంది. తనకు తెలియకుండా ఏదో జరుగుతుందని వసుధార అనుమాన పడుతుంది.
రిషికి కర్మకాండలు జరిపిస్తుంటాడు మహేంద్ర. ఈ కార్యక్రమాన్ని వసుధార ఆపితే బాగుండునని ధరణి కోరుకుంటుంది.
తప్పు చేస్తున్న మహేంద్ర...
వసుధారకు చెప్పకుండా కర్మకాండలు జరిపించి తాను తప్పు చేస్తున్నానని మహేంద్ర అనుకుంటాడు. ఈ కార్యక్రమాలను తర్వాత చేద్దామని అన్నయ్యను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ నిజం తెలిస్తే వసుధార తట్టుకోలేదని అంటాడు. అయినా ఫణీంద్ర పట్టువీడడు. రిషి ఆత్మకు శాంతి జరగాలంటే కర్మకాండలు జరగాల్సిందేనని అంటాడు. తన కొడుకు ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా అమలు అవుతోండటంతో లోలోన దేవయాని ఆనందపడుతుంది.
వసుధార వాదన...
వసుధార కాలేజీకి బయలుదేరుతుంది. ఆమె దగ్గరకు మను వస్తాడు. ఓ అర్జెంట్ పని ఉందని, తనతో పాటు రావాలని వసుధారను కోరుతాడు. మను వెంట వెళ్లడానికి వసుధార అంగీకరించదు. యాభై కోట్లు ఇచ్చారని మిమ్మల్ని నమ్మి ఎక్కడికి చెబితే అక్కడికి రావాలా అంటూ మనుపై ఫైర్ అవుతుంది.
డబ్బులు ఇచ్చే ముందు పదవులుపై వ్యామోహం లేదని చెప్పి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు...మెళ్లమెళ్లగా కాలేజీని మీ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ మనుతో వాదిస్తుంది వసుధార. నిజంగానే కాలేజీని నా చేతుల్లోకి తీసుకోవాలంటే ఇప్పటివరకు ఆగేవాడిని కాదని, ఆ పని ఎ ప్పుడో చేసేవాడినని మను అంటాడు. కాలేజీని హ్యండోవర్ చేసుకోవడం నాకు ఈజీ అని వసుధారతో చెబుతాడు.
వీడియో సాక్ష్యం...
అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయడం అనవసరమని, అర్జెంట్‌గా నాతో పాటు రావాలని వసుధారతో అంటాడు మను. సాయం చేసిన వాళ్లు గాయం చేయరని గ్యారెంటీ ఏంటి మనుతో వెళ్లడానికి వసుధార ఒప్పుకోదు. నా కోసం కాదు మీ కోసం...మీ రిషి కోసం కోసం తనతో పాటు రావాలని వసుధారను కన్వీన్స్ చేసేందుకు మను ప్రయత్నిస్తాడు. అయినా వసుధార అతడి మాటలను నమ్మదు. దాంతో రిషికి మహేంద్ర కర్మకాండలు జరిపిస్తోన్న వీడియోను వసుధారకు చూపిస్తాడు మను. ఆ సీన్ చూసి వసుధార షాకవుతుంది.
వసుధార ఫోటో...
కర్మకాండలు జరుపుతుండగా...రిషి ఫొటో పక్కన తన ఫొటో తెచ్చిపెడుతుంది వసుధార. అది చూసి మహేంద్ర, ఫణీంద్రతో పాటు అక్కడ ఉన్న వారందరూ షాకవుతారు. మీరు తప్పు చేశారని మహేంద్రతో అంటుంది వసుధార. వసుధారకు సమాధానం చెప్పలేక మహేంద్ర మౌనంగా ఉండిపోతాడు.
తన ప్లాన్ ఫెయిలవ్వడం దేవయాని తట్టుకోలేతుంది. ఆచారాల ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంటే ఏదో ఘోరాలు చేస్తున్నట్లు మాట్లాడుతున్నావని వసుధారపై ఫైర్ అవుతుంది. నీకు ఒక్కదానికే బాధ ఉన్నట్లు మాట్లాడుతున్నావని వసుధారపై కోప్పడుతుంది. మీ మాటలను ఆపేయమని దేవయానిని హెచ్చరిస్తుంది వసుధార. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.