తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్య సూపర్, బంటుని చితకబాదిన కార్తీక్.. కాంచన మనసులో విషం నింపిన పారిజాతం

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. శౌర్య సూపర్, బంటుని చితకబాదిన కార్తీక్.. కాంచన మనసులో విషం నింపిన పారిజాతం

Gunti Soundarya HT Telugu

09 May 2024, 7:23 IST

    • Karthika deepam 2 serial today may 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్య నిజం చెప్పేస్తుంది. నెక్లెస్ బంటు తీసుకొచ్చి అమ్మ బ్యాగ్ లో వేశాడని నిజం బయట పెట్టడంతో కార్తీక్ వాడిని కొడతాడు. 
కార్తీకదీపం 2 సీరియల్ మే 9వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 9వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కార్తీకదీపం 2 సీరియల్ మే 9వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial today may 9th episode: దీప తీయకపోయినా పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదాని పారిజాతం అంటుంది. శివనారాయణ పారిజాతం మీద ఫైర్ అవుతాడు. సాయంగా ఇస్తానంటేనే కాదనే మనిషి ఇలాంటి పని ఎలా చేస్తుందని తిడతాడు. శౌర్య వచ్చి ఏమైంది తాత ఎందుకు గ్రానిని తిడుతున్నావ్ అంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

krishna mukunda murari serial: అబార్షన్ చేయించుకున్న మీరా.. బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ

Jr NTR Movies OTT: హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్: మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హిట్ సినిమాలు ఈ ఓటీటీల్లో చూసేయండి

నెక్లెస్ మా అమ్మ బ్యాగ్ లో ఉంది

శౌర్యతో ఈ విషయం గురించి మాట్లాడొద్దని సుమిత్ర, కార్తీక్ వారిస్తారు. కానీ పారు మాత్రం ఒప్పుకోదు. మీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ ఉందా అని అడుగుతుంది. నెక్లెస్ ఎక్కడైనా చూశావా అని అంటే చూశానని చెప్తుంది. ఎక్కడ అంటే మా ఇంట్లోనే మా అమ్మ బ్యాగ్ లో ఉందని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

ఇప్పటికైనా అర్థం అయ్యిందా ఎవరు దొంగతనం చేశారో అని పారిజాతం అరుస్తుంది. అలాంటి నెక్లెస్ మన బ్యాగ్ లో ఉండటం ఏంటని దీప శౌర్యని అడుగుతుంది. ఉందమ్మా నేను చూశాను అంటుంది. మన బ్యాగ్ లో నెక్లెస్ ఉండటం ఏంటి? నువ్వు పెట్టావా అని దీప అడుగుతుంది.

శౌర్య సూపర్

నువ్వు తీయకుండా నీ బ్యాగ్ లోకి ఆ నెక్లెస్ ఎలా వచ్చిందని పారిజాతం నిలదీస్తుంది. ఎందుకు మా అమ్మని తిడుతున్నావని శౌర్య అంటుంది. మీ అమ్మ నెక్లెస్ బ్యాగ్ లో పెట్టుకుందిగా అంటే అని నేను చెప్పానా అంటుంది. మరి ఎవరు పెట్టారని కార్తీక్ అడిగితే శౌర్య బంటుని చూపిస్తే ఆ అంకుల్ పెట్టాడని చెప్తుంది.

నేను ఇంట్లో కూర్చుని డ్రాయింగ్ వేసుకుంటుంటే ఆ అంకుల్ వచ్చాడని చెప్తుంది. గ్రానీ నువ్వు చెప్పినట్టే జరిగింది మా అమ్మ బ్యాగ్ లో నెక్లెస్ పెట్టింది ఆ అంకుల్ అంటుంది. అమ్మమ్మ అమ్మ కోసం సర్ ప్రైజ్ ఇచ్చిందనుకుని నేను చెప్పలేదు. కార్తీక్ నేను చేసింది కరెక్ట్ కదా అంటుంది.

బంటుని చితకబాదిన కార్తీక్

సరే నువ్వు వెళ్ళి నెక్లెస్ తీసుకు రా ఈలోపు అంకుల్ కి థాంక్స్ చెప్తానని కార్తీక్ కోపంగా చూస్తాడు. బంటుని పట్టుకుని కొడతాడు. మంచితనంతో నిజాయితీగా బతుకుతున్న మనిషి, ఆ నిజాయితీని చంపాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

ఈ పని నువ్వే చేశావా? నీతో ఎవరైనా చేయించారా అని బంటు చెంపలు వాయించేస్తాడు. పారిజాతం తన పేరు చెప్పొద్దని సైగ చేస్తుంది. తానే చేశానని బంటు ఒప్పుకుంటాడు. ఒక నింద పడిన తర్వాత అది నిజం కాదని నిరూపించుకోవడం ఎంత కష్టమో తెలుసా?

నమ్మకం ప్రాణం కంటే ఎంతో గొప్పది ఒక్కసారి పోతే తిరిగిరాదు. వెళ్ళి ఆ మనిషి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగమని బంటుని కార్తీక్ తోస్తాడు. క్షమించమని అడుగుతాడు. పారిజాతం ఏమి తెలియనట్టు ఇలాంటి ఎదవ పని చేశావ్ ఏంటని అంటుంది.

నెక్లెస్ తీసుకొచ్చిన శౌర్య

బంటుని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని దశరథ చెప్తాడు. మళ్ళీ నా కంట పడితే దొంగతనం చేశావని చెప్పి జైలులో పెట్టిస్తానని వార్నింగ్ ఇస్తాడు. శౌర్య నెక్లెస్ తీసుకుని వస్తుంది.

ఇదిగో ఇదే ఆ అంకుల్ మా అమ్మ బ్యాగ్ లో పెట్టిన నెక్లెస్ అని ఇస్తుంది. మాట రాయి లాంటిది మనసు అద్దం లాంటిది. ఆలోచించకుండా వేసే రాళ్ళు అద్దాన్ని వాటి అందాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని చెప్పి కార్తీక్ నెక్లెస్ జ్యోత్స్న చేతిలో పెడతాడు.

వస్తువు తిరిగి తీసుకున్నంత తేలిక కాదు మాటని తిరిగి తీసుకోవడమని అంటాడు. మాటలు చెప్పినంత తేలిక కాదు మనుషులను అర్థం చేసుకోవడం అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. శివనారాయణ భార్యకి కాస్త గడ్డి పెడతాడు. నీ మీద మాకు ఎప్పుడూ నమ్మకం ఉందని తమని తప్పుగా అర్థం చేసుకోవద్దని సుమిత్ర అడుగుతుంది.

కార్తీక్ మీద నింద

జ్యోత్స్న, పారిజాతం తప్ప ఇంట్లో అందరూ తనని నమ్ముతున్నారని దీప మనసులో అనుకుంటుంది. అదేమీ లేదని చెప్తుంది. జ్యోత్స్నతో ఏమైనా గొడవ జరిగిందాని సుమిత్ర కార్తీక్ ని అడుగుతుంది. అదేమీ లేదని మామూలుగానే ఉన్నామని కార్తీక్ చెప్పేసి వెళ్ళిపోతాడు.

పారిజాతం కాంచనకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏమైందని శ్రీధర్ అడుగుతాడు. పిన్ని ఎప్పుడు లేనిది కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. దీప విషయంలో ఏదో గొడవ జరిగిందంట జ్యోత్స్నని సపోర్ట్ చేయకుండా తనని సపోర్ట్ చేశాడట. జ్యోత్స్న చాలా బాధపడుతుంది.

త్వరగా కార్తీక్, జ్యోత్స్న పెళ్లి చేయాలి

పిన్ని మాటలు నమ్మడం కరెక్టేనా? అంటుంది. అంతే చెప్పిందా ఇంకేమైనా చెప్పిందా అని అడుగుతాడు. దీపతో కార్తీక్ చనువుగా ఉంటున్నాడని చెప్పిందని కాంచన చెప్తుంది. ఇది మళ్ళీ కార్తీక్ ని అడగకూడదు వాడు బాధపడతాడు.

ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం వీలైనంత త్వరగా కార్తీక్, జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడాలి. వీలైనంత త్వరగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అంటాడు. దీప కడియం దగ్గరకు వస్తుంది. హోటల్ తీసుకున్నట్టు చెప్తాడు.

కడియం కార్తీక్ గురించి అడుగుతాడు. అంత పెద్ద గొప్ప ఇంట్లో ఉంటూ ఈ పనులు చేయడం ఏంటని అంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం