తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns May 9th Episode: భాగీకి దగ్గరవుతున్న పిల్లలు.. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అమర్.. ఆరు కోరికకు మాయమైన యముడు

NNS May 9th Episode: భాగీకి దగ్గరవుతున్న పిల్లలు.. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అమర్.. ఆరు కోరికకు మాయమైన యముడు

Sanjiv Kumar HT Telugu

09 May 2024, 6:21 IST

    • Nindu Noorella Saavasam May 9th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 9వ తేది ఎపిసోడ్‌‌లో రామ్మూర్తి ఇంటికి రావాలంటే మిస్సమ్మకు షరతులు పెడతారు పిల్లలు. దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటారు అమర్. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 9వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 9వ తేది ఎపిసోడ్‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 9వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 9th May Episode) యమలోకానికి ప్రవేశం లేకపోవడంతో బాధపడుతూ ఉంటాడు చిత్రగుప్తుడు. ఏమైందని అడుగుతుంది అరుంధతి. అప్పుడే అటుగా ఒక మహిళను కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు యమభటులు. ఎందుకు ఆమెను అలా కొడుతున్నారు అని అడుగుతుంది అరుంధతి.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

పాపాలకు అనుభవిస్తుంది

బతికి ఉన్నంతకాలం భర్త, అత్తామామలను చిత్రహింసలు పెట్టి పాపం మూటగట్టుకున్నది అందుకే క్షణానికో శిక్ష మారుస్తూ ఆమె పాపాలకు ఫలితం అనుభవిస్తుంది అంటాడు గుప్త. ఏదో గుర్తొచ్చినట్లు నవ్వుతుంది అరుంధతి. ఏమైందని అడుగుతాడు గుప్త. ఈమె పాపాలకే ఇలా కొడుతున్నారంటే మనోహరి చేస్తున్న పాపాలకు ఎలా ఎలాంటి శిక్షలు అనుభవిస్తుందో అని గుర్తొచ్చి నవ్వుతున్నానంటుంది అరుంధతి.

ముందు నీకు పడబోయే శిక్షల గురించి ఆలోచించు నా సమస్య తీరగానే నీ సంగతి చెబుతానంటాడు చిత్రగుప్త. మరోవైపు రామ్మూర్తితో వాళ్లింటికి వెళ్లడానికి రెడీ అయి వస్తాడు అమర్​. బయలుదేరండి అని నిర్మల అనగానే పిల్లలు ఇంకా రాలేదమ్మా అంటాడు రామ్మూర్తి. పిల్లలు ఇంకా మిస్సమ్మ మీద కోపంగా ఉన్నారని అంటుంది నిర్మల. పిల్లలు లేకుండా వెలితిగా ఉంటుందమ్మా.. నేను వెళ్లి పిల్లలతో మాట్లాడతానంటు వాళ్ల రూమ్​కి వెళతాడు రామ్మూర్తి.

పిల్లల షరతులు

ముందుగా రామ్మూర్తితో మాట్లాడకుండా మొండికేసినా తర్వాత నచ్చజెప్పడంతో వింటారు పిల్లలు. మిస్సమ్మ తమ పనులు చేయదని, తమ దగ్గరకి రాకూడదని షరతులు పెడతారు. సరే.. నా కూతురు మిమ్మల్ని డిస్టర్బ్​ చేయదని మాటిస్తాడు రామ్మూర్తి. సరేనని బయలుదేరతారు పిల్లలు. అందరూ బయలుదేరుతుంటే తానూ వస్తాననంటుంది మనోహరి. అందరూ ఆశ్చర్యపోతారు.

అదేంటి అంకుల్​.. మాట్లాడితే పెద్ద కూతురు అంటారు. నేను మీ ఇంటికి వద్దా అంటుంది మనోహరి. ఏం చెప్పాలో అర్థంకాక అదేం లేదమ్మా అంటాడు రామ్మూర్తి. తాను కూడా వస్తానంటూ బయలుదేరుతుంది మనోహరి. అందరూ కార్లలో బయలుదేరుతుండగా రాథోడ్​ కూడా వస్తాడు. తను అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుందని సంతోషపడుతుంది మనోహరి. అసలు మనోహరి ఏం చేయబోతోందో అర్థంకాక ఒకరినొకరు చూసుకుంటారు రామ్మూర్తి, భాగీ.

మాయాదర్పణం ఎందుకు

చిత్రగుప్తుడు తన తప్పుని మన్నించమని అడిగేందుకు యముడి కోసం ఎదురు చూస్తుంటాడు. అరుంధతి మెల్లిగా మాయాదర్పణం తెరవాలని ప్రయత్నిస్తుంది. చిత్రగుప్తుడు వద్దని వారిస్తారు. అప్పుడే యముడు రావడంతో చిత్రగుప్తుడిని క్షమించమని అంటుంది అరుంధతి. నీకేమైనా కోరిక మిగిలి ఉన్నదా ఇంకా ఏం చూడాలని ఆ మాయాదర్పణం చూడాలనుకుంటున్నావు అంటాడు యముడు.

పుట్టినప్పటినుంచీ ఎన్నో కష్టాలు ఎదురైనా ఎప్పుడూ భయపడని తను తన చావుకి భయపడ్డానని, ఆనందంగా సాగుతున్న తన జీవితాన్ని కకావికలం చేసి తనని చంపినదెవరో తెలుసుకోవాలనుకుంటున్నానని అంటుంది అరుంధతి. ఏం చెప్పకుండా మాయమవుతాడు యముడు.

భయపడిన పిల్లలు

రామ్మూర్తితోపాటు అమర్, భాగీ, పిల్లలతోపాటు మనోహరి కూడా బయలుదేరుతుంది. వాళ్లు వెళ్తుంటే అకస్మాత్తుగా లారీ ఎదురుగా రావడంతో స్టీరింగ్​ని పక్కకి తిప్పి రాథోడ్​ అని గట్టిగా అరుస్తాడు అమర్​. అందరూ కంగారుగా కారు దిగుతారు. పిల్లలకి ఏం జరిగిందోనని కంగారుతో వాళ్లని కిందకి దింపుతుంది మిస్సమ్మ. పిల్లలు మిస్సమ్మని పట్టుకుని భయపడతారు. వాళ్లకి ఏం కాదని ధైర్యం చెబుతుంది భాగీ.

బాబుకి ఏం జరిగిందో చూడమ్మా అంటాడు రామ్మూర్తి. అమర్ ఏం మాట్లాడకుండా ఆయాసపడుతూ ఉంటాడు. ఏం అర్థంకాక కంగారుగా చూస్తుంది భాగీ. అంతలో రాథోడ్​ తమ ఎదురుగా వచ్చిన లారీ లాంటిదే మేడమ్​ గారిని చంపేసిందని అది గుర్తొచ్చే సార్ ఇలా అవుతున్నారు అంటాడు. ఇంతగా ప్రేమించే భర్తని పొందిన ఆమె ఎంత అదృష్టవంతురాలు అనుకుంటుంది మిస్సమ్మ.

దేవుడు కాదు దెయ్యం

ఇంత గొప్ప మనిషికి ఆమెని దూరం చేసి భగవంతుడు తప్పు చేశాడంటాడు రామ్మూర్తి. దేవుడు కాదు సార్​.. ఓ దెయ్యం అంటాడు రాథోడ్. మనోహరి బండారం బయటపడే సమయం వచ్చేసిందా? సరస్వతి మేడమ్​ అమర్​కి ఏం చెప్పబోతోంది? అనే విషయాలు తెలియాలంటే మే 10న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం