NNS 29th April Episode: ​​మిస్సమ్మను క్షమించేదే లేదంటున్న పిల్లలు.. భాగీని ఆశీర్వదించిన అమర్​.. షాక్​లో మనోహరి!-zee telugu serial nindu noorella saavasam today 29th april episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 29th April Episode: ​​మిస్సమ్మను క్షమించేదే లేదంటున్న పిల్లలు.. భాగీని ఆశీర్వదించిన అమర్​.. షాక్​లో మనోహరి!

NNS 29th April Episode: ​​మిస్సమ్మను క్షమించేదే లేదంటున్న పిల్లలు.. భాగీని ఆశీర్వదించిన అమర్​.. షాక్​లో మనోహరి!

Hari Prasad S HT Telugu
Apr 29, 2024 11:50 AM IST

NNS 29th April Episode: ​నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (ఏప్రిల్ 29) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. భాగీని అమర్ ఆశీర్వదించడంతో మనోహరి షాక్ తింటుంది.

మిస్సమ్మను క్షమించేదే లేదంటున్న పిల్లలు.. భాగీని ఆశీర్వదించిన అమర్​.. షాక్​లో మనోహరి!
మిస్సమ్మను క్షమించేదే లేదంటున్న పిల్లలు.. భాగీని ఆశీర్వదించిన అమర్​.. షాక్​లో మనోహరి!

NNS 29th April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (ఏప్రిల్ 29) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్​తో తన పెళ్లి జరగకుండా చేసి ఆ స్థానంలో తాను కూర్చుని పెళ్లి చేసుకుందని భాగీపై పగబడుతుంది మనోహరి. ఎలాగైనా భాగీని అరుంధతి స్థానంలోకి రానివ్వనని అనుకుంటూ పిల్లల దగ్గరకి వెళ్లి మిస్సమ్మకి వ్యతిరేకంగా వారికి మాటలు నూరిపోస్తుంది.

మిస్సమ్మపై పిల్లలకు కోపం

మిస్సమ్మ స్వార్థం కోసం తమని మోసం చేసిందని అనుకుంటారు పిల్లలు. ఇప్పుడు అడిగినా ఈ పెళ్లి ఆపేందుకు వేరే దారిలేక చేసుకున్నానని అంటుందని తన మాటలు ఇక నమ్మకూడదని అనుకుంటారు. తన దగ్గర నుంచి సహాయం తీసుకోవడం, తనకి సహాయం చేయడం వంటివి ఉండకూడదని తీర్మానించుకుంటారు. మనోహరి ఆంటీ అయినా తమకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ, మిస్సమ్మ మాత్రం తమను మోసం చేసి పెళ్లి చేసుకుందని కోపంతో రగిలిపోతారు పిల్లలు.

ఇక నుంచి మిస్సమ్మతో మాట్లాడకూడదని, ఏం చేసినా తమ తల్లి స్థానాన్ని ఇవ్వకూడదని ప్రమాణం చేస్తారు. కోపిష్టి అయిన నీ భర్త ఇప్పుడు ఆ మిస్సమ్మ తనని మోసం చేసిందని ఆ బాలికకు ఎలాంటి శిక్ష వేస్తాడో అంటాడు చిత్రగుప్తుడు. అరుంధతి, గుప్త.. అమర్​ కోసం వేచి చూస్తుంటారు. అమర్​కి నచ్చజెప్పి ఇంటికి తీసుకుని వస్తుంది నిర్మల.

అమర్ ఇంటికి భాగీ

కోపంగా ఇంట్లోకి వెళ్తున్న అమర్​ని ఆపి మిస్సమ్మ వచ్చాక ఇంట్లోకి ఇద్దరూ కలిసి వెళ్లాలని చెప్పి ఆపుతుంది. దేవుడు తనకి అన్యాయం చేశాడని, తను ఉండాల్సిన స్థానంలో మిస్సమ్మను ఉంచాడని అనుకుంటుంది మనోహరి. తన అత్తామామలు ఆచారసంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, మామయ్య తప్పకుండా మిస్సమ్మకి నచ్చజెప్పి తీసుకుని వస్తారని అంటుంది అరుంధతి.

అప్పుడే శివరామ్​ మిస్సమ్మను, ఆమె తల్లిదండ్రులు, కరుణను తీసుకుని ఇంటికి వస్తాడు. కోపంగా అమర్​ని చూసి వణికిపోతున్న భాగీకి ధైర్యం చెబుతుంది కరుణ. మిస్సమ్మను, ఆమె తల్లిదండ్రులను చూసి కోపంతో రగిలిపోతాడు అమర్​. జరిగింది పొరపాటు కాదని, తప్పని దాన్ని తాను ఎప్పటికీ క్షమించనని అంటాడు. నేనెప్పటికీ మీ అల్లుడిని కానని అనడంతో రామ్మూర్తి బాధపడతాడు.

జరిగింది ఏదో జరిగిపోయింది. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో మాకు కూడా తెలియదు బాబు అంతా దైవనిర్ణయం అంటాడు రామ్మూర్తి. నీలను ఎర్రనీళ్లు తీసుకురమ్మని కొత్త దంపతులకు దిష్టి తీస్తుంది నిర్మల. ఇద్దరూ కుడికాలు పెట్టిలోపలకు రమ్మంటుంది. కరుణ ఇద్దరినీ ఆపి వారి పేర్లు చెప్పుకుని రావడం ఆచారం అని గుర్తు చేస్తుంది.

ఏ.. వాళ్ల పేర్లు వాళ్లకి తెలియవా? అంటుంది అంజు. అబ్బో ఈ పిల్లపిడుగు మాటలతోనే చంపేసేలా ఉందే? అని అది ఆచారం కదా ఆంటీ అంటుంది కరుణ. అవునంటుంది నిర్మల. అమర్​, భాగీ ఇంట్లోకి అడుగుపెడతారు. భాగీ పూజగదిలో దీపం పెట్టి హారతిస్తుంది. నిర్మల మిస్సమ్మని ఆశీర్వదించమని అమర్​ చేతిలో అక్షితలు పెడుతుంది.

అయిష్టంగా నిల్చున్న అమర్​ కాళ్లకి దండం పెడుతుంది మిస్సమ్మ. గాలి రావడంతో ఒక్కసారిగా అమర్​ చేతిలోని అక్షితలు మిస్సమ్మ తలపై వదులుతాడు. అమర్​ మిస్సమ్మను భార్యగా అంగీకరిస్తాడా? పిల్లలు మిస్సమ్మపై పగ తీర్చుకోడానికి ఏం చేయబోతున్నారు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point